నిమ్మకాలు త్వరగా ఎండిపోతున్నాయని బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి..!

ABN, First Publish Date - 2023-12-09T14:08:52+05:30 IST

శీతకాలంలో నిమ్మకాయలు, నారింజ వంటి సిట్రస్ వర్గానికి చెందిన పండ్లను ఎక్కువగా వినియోగించాలి. ఎందుకంటే ఈ కాలంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి, తరచూ రోగాల బారిన పడడం జరుగుతుంది. దీనికి చెక్ పెట్టాలంటే సిట్రస్ జాతికి చెందిన పండ్లు ది బెస్ట్ ఆప్షన్. అయితే, నిమ్మకాయలను ఎక్కువ కాలం తాజాగా, జ్యూసీగా ఉంచడం ఒక సవాలు. కానీ, నిమ్మకాయలను ఎక్కువకాలం తాజాగా ఉండేలా నిల్వ చేయడానికి ఇక్కడ కొన్ని చిన్న చిట్కాలు ఉన్నాయి.

నిమ్మకాలు త్వరగా ఎండిపోతున్నాయని బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి..! 1/5

నిమ్మకాయలను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం వల్ల డీహైడ్రేషన్ ప్రక్రియను నెమ్మదించి, వాటి షెల్ఫ్ (తొక్క) జీవితాన్ని పొడిగిస్తుంది. అలాగే వాటిలో తేమ ఉండేలా చేసేందుకు వెజిటబుల్ క్రిస్పర్ డ్రాయర్‌లో గానీ, ప్లాస్టిక్ బ్యాగ్‌లో గానీ పెట్టి రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి.

నిమ్మకాలు త్వరగా ఎండిపోతున్నాయని బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి..! 2/5

నిమ్మకాయలను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడానికి ముందే వాటిపై ఎలాంటి తేమ లేకుండా శుభ్రం చేయాలి. ఎందుకంటే ఈ తేమ దానిపై అచ్చు పెరగడానికి దారితీస్తుంది. దాంతో అవి త్వరగా కుళ్లిపోవచ్చు.

నిమ్మకాలు త్వరగా ఎండిపోతున్నాయని బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి..! 3/5

సూర్యకాంతి నేరుగా తగిలే చోట నిమ్మకాయలను అసలు ఉంచకూడదు. అధిక మొత్తంలో సూర్యకాంతి నిమ్మకాలపై డైరెక్ట్‌గా పడితే వాటిలోని తేమ తగ్గిపోయి అవి పాడయిపోయేలా చేస్తుంది.

నిమ్మకాలు త్వరగా ఎండిపోతున్నాయని బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి..! 4/5

నిమ్మకాయలను రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడానికి ముందు వాటిని ప్లాస్టిక్ బ్యాగ్ లేదా గాలి చొరబడని కంటైనర్‌లో ఉంచాలి. ఇది తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. అలాగే ఫ్రిజ్‌లో ఉండే ఇతర ఆహార పద్దారాల నుండి నిమ్మకాయలను వాసనలు గ్రహించకుండా నిరోధిస్తుంది.

నిమ్మకాలు త్వరగా ఎండిపోతున్నాయని బాధపడుతున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి..! 5/5

ఇక మీరు నిమ్మకాయలను ఉపయోగించే వరకు వాటిని ముందే కట్ చేయకూడదు. అలా కట్ చేయడం లేదా కొంచెం రసం తీసేసిన నిమ్మకాయలు త్వరగా ఎండిపోతాయి.

Updated at - 2023-12-09T14:08:53+05:30