Share News

గలౌటీ కబాబ్‌

ABN , Publish Date - Dec 17 , 2023 | 12:17 PM

ఉడికించిన రాజ్మా - కప్పు, జీడిపప్పు - పది, కొత్తిమీర - రెండు స్పూన్లు, కుంకుమపువ్వు...

గలౌటీ కబాబ్‌

కావలసిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా - కప్పు, జీడిపప్పు - పది, కొత్తిమీర - రెండు స్పూన్లు, కుంకుమపువ్వు - 3 కాడలు (కొద్ది నీటిలో నానబెట్టాలి), యాలకులు - రెండు, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, రోజ్‌ వాటర్‌, నెయ్యి - స్పూను చొప్పున, శనగ పిండి - పావు కప్పు, నూనె, ఉప్పు - తగినంత.

తయారుచేసే విధానం: జీడిపప్పు కొద్దిసేపు నానబెట్టాలి. ఉల్లి వేగించాలి. తర్వాత జీడిపప్పు, ఉల్లి, పచ్చిమిర్చి, యాలకులు, కొత్తిమీర, కుంకుమ పువ్వు నీటిని కలిపి పేస్టు చేసుకోవాలి. ఇందులో రుబ్బిన రాజ్మా, మిగిలిన పదార్థాలు వేసి ముద్దగా చేసుకోవాలి. కొద్ది కొద్ది మిశ్రమం తీసుకుని కబాబ్‌లుగా చేత్తో ఒత్తి నూనె రాసిన పెనంపై రెండువైపులా దోరగా కాల్చుకోవాలి.

పానీ పకోడా

కావలసిన పదార్థాలు: శనగ పిండి- రెండు కప్పులు, కొత్తిమీర తరుగు-కప్పున్నర, ఉల్లి-అర కప్పు, పచ్చి మిర్చి - రెండు, పుదీనా - అర కప్పు, అల్లం - చిన్న ముక్క, చింతపండు రసం - చిన్న కప్పు, చాట్‌ మసాలా - స్పూను, జీలకర్ర పొడి - అర స్పూను, కారం - స్పూను, ఆమ్‌చూర్‌ - స్పూను, ఇంగువ - చిటికెడు, పసుపు - పావు టీ స్పూను, చల్లని నీళ్లు - అయిదు కప్పులు, ఉప్పు - తగినంత, నిమ్మకాయ - సగం.

తయారుచేసే విధానం: కొత్తిమీర, పుదీనా, అల్లం, పచ్చి మిర్చి కలిపి కొద్ది నీటితో పేస్టులా చేసుకోవాలి. ఈ గ్రీన్‌ చట్నీ గిన్నెలోకి తీసుకోవాలి. చింతపండు రసం, చాట్‌ మసాలా, జీలకర్ర పొడి, కారం, ఆమ్‌చూర్‌, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలపాలి. 5 కప్పుల చల్లనీరు కూడా జతచేయాలి. ఇందులోనే రెండు స్పూన్ల కొత్తిమీర, రెండు స్పూన్ల పుదీనా, పావు కప్పు ఉల్లి వేసి నిమ్మరసం పిండితే థీకా పానీ సిద్ధం. పకోడా చేసే పద్ధతి : పెద్ద గిన్నెలో శనగ పిండి, కారం, పసుపు, ఉప్పు, ఇంగువ, బేకింగ్‌ సోడా, మిగతా ఉల్లి, కొత్తిమీర వేసి జారుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పకోడాలుగా వేగించి, నీళ్లలో నిమిషం నానబెట్టి థీకా పానీలో వేయాలి. ఇలా అన్నిటినీ వేస్తే పానీ పకోడా రెడీ.

Updated Date - Dec 17 , 2023 | 12:17 PM