Share News

AP Election 2024: ఎంపీటీసీని ఎంపీగా గెలిపించబోతున్నాం: ఆలూరులో చంద్రబాబు

ABN , Publish Date - Apr 19 , 2024 | 05:15 PM

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను బంపర్ మెజారిటీతో రాష్ట్ర ప్రజలు గెలిపించబోతున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎంపీటీసీని ఎంపీగా గెలిపించబోతున్నామని అన్నారు.

AP Election 2024: ఎంపీటీసీని ఎంపీగా గెలిపించబోతున్నాం: ఆలూరులో చంద్రబాబు

ఆలూరు: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024 (AP Election 2024), లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను బంపర్ మెజారిటీతో రాష్ట్ర ప్రజలు గెలిపించబోతున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఎంపీటీసీని ఎంపీగా గెలిపించబోతున్నామని అన్నారు. ‘ప్రజాగళం’ ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా ఆలూరు బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.


‘‘ ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర మార్చే కీలక తరుణమిది. ఏపీ ప్రజల భవిష్యత్‌ను మార్చే ఎన్నికలు ఇవి. ఆలూరు అదరగొట్టింది.. కర్నూలు సై అంటూ కాలు దువ్వింది. వైసీపీని చిత్తుగా ఓడించడం కూటమికే సాధ్యం. కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే. కేంద్ర సహకారం కూడా ఏపీకి అవసరం. సాధారణ కార్యకర్తకు ఎమ్మెల్యే సీటు ఇచ్చిన ఘనత టీడీపీదే. ఎంపీటీసీని ఎంపీగా నిలబెట్టి గెలిపించబోతున్నాం. టీడీపీ అభ్యర్థులను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలి’’ అని చంద్రబాబు అన్నారు.

జగన్ పేరు మార్చిన చంద్రబాబు

‘‘ జగన్‌ పేరు మార్చి.. జే..గన్‌ రెడ్డిగా నామకరణం చేస్తున్నాను’’ అని చంద్రబాబు అన్నారు. అధికారం ఇస్తే అన్ని రంగాలను, వ్యవస్థలను ధ్వంసం చేశారని ధ్వజమెత్తారు. అధికారం ఇస్తే బాధ్యతగా ఉండాలని, జగన్‌రెడ్డి మాత్రం అహంకారంతో విర్రవీగుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ పాలనలో ఏపీ అప్పులకుప్పగా మారిందని, రాష్ట్రంలో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని దుస్థితి నెలకొందని మండిపడ్డారు. రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదని విమర్శలు గుప్పించారు.

ఇవి కూడా చదవండి

AP Election 2024: చంద్రబాబు తరఫున నామినేషన్‌ దాఖలు చేసిన నారా భువనేశ్వరి

Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అఫ్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 19 , 2024 | 06:16 PM