Share News

షర్మిల వస్త్రధారణపై జగన్‌ వ్యాఖ్యలు సిగ్గుచేటు

ABN , Publish Date - Apr 27 , 2024 | 03:21 AM

మాజీ మంత్రి వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ స్వయంగా తనకు లేఖ రాసినా సీఎం జగన్‌ మనసు కరగడం లేదు. వివేకా హత్యకు నైతిక బాధ్యత వహించి హంతకులను, కుట్రదారులను శిక్షించాల్సిన జగన్‌..

షర్మిల వస్త్రధారణపై జగన్‌ వ్యాఖ్యలు సిగ్గుచేటు

వివేకా భార్య లేఖ రాసినా జగన్‌ మనసు కరగడం లేదు: కనకమేడల

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): ‘మాజీ మంత్రి వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మ స్వయంగా తనకు లేఖ రాసినా సీఎం జగన్‌ మనసు కరగడం లేదు. వివేకా హత్యకు నైతిక బాధ్యత వహించి హంతకులను, కుట్రదారులను శిక్షించాల్సిన జగన్‌.. అందుకు భిన్నంగా కేసు విచారణను అడ్డుకుంటున్నారు. సొంత చెల్లెలు షర్మిల డ్రెస్‌పై జగన్‌ కామెంట్‌ చేయడం సిగ్గుచేటు’ అని టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ఆరోపించారు. శుక్రవారం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు.

Updated Date - Apr 27 , 2024 | 09:52 AM