Share News

మదనపల్లెలో 19 మంది 33 సెట్ల నామినేషన్ల దాఖలు

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:35 PM

మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గం(164) ఎన్ని కలకు గాను వారం రోజుల పాటు నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియలో గురువారం సాయంత్రం 3గంటల వరకు మొత్తం 19 మంది అభ్యర్థులు 33 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.

మదనపల్లెలో 19 మంది 33 సెట్ల నామినేషన్ల దాఖలు
ఆర్వో రాఘవేంద్రకు బీ పాం అందచేస్తున్న దాసరిపల్లె జయచంద్రారెడ్డి

మదనపల్లె టౌన, ఏప్రిల్‌ 25: మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గం(164) ఎన్ని కలకు గాను వారం రోజుల పాటు నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియలో గురువారం సాయంత్రం 3గంటల వరకు మొత్తం 19 మంది అభ్యర్థులు 33 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఇందులో టీడీపీ అభ్యర్థులుగా ఎం.షాజహానబాషా, ఆయన సతీమణి గుల్నాజ్‌బేగం, వైసీపీ అభ్యుర్థులుగా నిస్సార్‌ అహ్మద్‌, ఆయన కుమారుడు మహ్మద్‌హసన షేక్‌, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మల్లెల పవనకుమార్‌, నరేంద్ర, బీఎస్సీ తరపున ఆర్‌.నరసింహులు నామినేషన్లు వేశారు. వారు పోగా జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక, పిరమిడ్‌, జై భారత పార్టీల తరపున ఒక్కొక్కరు, మిగిలిన వారిలో 9 మంది ఇండిపెండెంట్‌ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారని రిటర్నింగ్‌ అధికారి హరిప్రసాద్‌ తెలిపారు.

పీలేరు అసెంబ్లీ బరిలో 15 మంది నామినేషన్లు దాఖలు

పీలేరు, ఏప్రిల్‌ 25: పీలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ఫర్మాన అహ్మద్‌ తెలిపారు. 15 మంది అభ్యర్థులు 27 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ తరపున ముగ్గురు అభ్య ర్థులు 9 సెట్ల నామినేషన్లు, వైసీపీ తరపున ఇద్దరు అభ్యర్థులు 6 సెట్లు, కాంగ్రెస్‌ పార్టీ తరపున ఒక అభ్యర్థి 3 సెట్లు, బీఎస్పీ, అంబేడ్కర్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ, జై మహాభారత పార్టీ తరపున ఒక్కొక్కరు, ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు ఆయన వివరించారు. కాగా పీలేరు అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గురువారం నామినేషన దాఖలు చేశారు.

తంబళ్లపల్లెలో 34 మంది నామినేషన్లు దాఖలు

తంబళ్లపల్లె, ఏప్రిల్‌ 25: తంబళ్లపల్లె శాసనసభ స్థానానికి 34 మంది నామినేషన్లు వేశారు. ఇందు లో చివరి రోజైన గురువారం 13 నామినేషన్లను అంద చేయగా టీడీపీ అభ్యర్థి దాసరిపల్లె జయ చంద్రారెడ్డి బీపాం ఆర్వోకు అంద చేశారు. టీడీపీ అభ్యర్థులుగా దాసరిపల్లె జయచంద్రారెడ్డి నాలుగు సెట్లు, ఆయన సతీమణి మంత్రి కల్పనారెడ్డి రెం డు సెట్లు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మద్దిరెడ్డి కొండ్రెడ్డి నాలుగు సెట్లు దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థులుగా పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి నాలుగు సెట్లు, పెద్దిరె డ్డిగారి కవిత రెండు సెట్లు, పెద్దిరెడ్డి వెంకట అభినయ్‌రెడ్డి రెండు సెట్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థులుగా ఎంఎన చంద్రశేఖర్‌రెడ్డి రెండు సెట్లు, ఎంఎన భానుచంద్రారెడ్డి ఒక సెట్‌, జై భారత నేషనల్‌ పార్టీ అభ్యర్థిగా పి.అంజలి రెండు సెట్లు, జాతీయ జనసేన అభ్యర్థిగా దూలం జయచంద్రారెడ్డి, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండి యా పార్టీ అభ్యర్థిగా కె.భాస్కర్‌, బహుజన సమాజ్‌ పార్టీ అభ్యర్థిగా ఎస్‌. సుజాత ఒక్కో సెట్‌ నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా గుండాల క్రిష్ణప్ప రెండు సెట్లు, ఎంఎన భానుచంద్రారెడ్డి, ఎం.సురేష్‌, పి.వెంకటరెడ్డి, ఎన.నరసింహులు, ఎన.విశ్వనాథరెడ్డి, వై.ద్వారక నాథరెడ్డిలు ఒక్కో సెట్‌ నామినేషనలు దాఖలు చేశారు.

Updated Date - Apr 25 , 2024 | 11:35 PM