Share News

ప్రశాంతంగా నామినేషన్ల పరిశీలన

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:52 PM

మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గ ఎన్ని కల్లో నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఐదుగురి నామినేషన్లు తిర స్కరణకు గురయ్యాయి.

ప్రశాంతంగా నామినేషన్ల పరిశీలన
స్ర్కూటినిలో నామినేషన్లు పరిశీలిస్తున్న రిటర్నింగ్‌ అధికారి హరిప్రసాద్‌, అబ్జర్వర్‌ కవిత

మదనపల్లెలో ఐదుగురి నామినేషన్లతోపాటు పీలేరులో మూడు, తంబళ్లపల్లెలో ఏడు నామినేషన్లు తిరస్కరణ

మదనపల్లె టౌన, ఏప్రిల్‌ 26: మదనపల్లె అసెంబ్లీ నియోజకవర్గ ఎన్ని కల్లో నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఐదుగురి నామినేషన్లు తిర స్కరణకు గురయ్యాయి. శుక్రవారం స్థానిక సబ్‌కలెక్టరేట్‌లో రిటర్నింగ్‌ అధికారి హరిప్రసాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన స్ర్కూటిని కార్యక్రమం నిర్వహించారు. అలాగే ఎన్నికల అబ్జర్వర్లు కవిత మనికేరి, వైభవ్‌ శుక్లా పర్యవేక్షణలో నామినేషన్లు వేసిన వారితో పాటు, ఇద్దరు ప్రతిపాదకులు హాజరయ్యారు. ఇందులో భాగంగా టీడీపీ అభ్యర్థి షాజహానబాషా, వైసీ పీ అభ్యర్థి నిస్సార్‌అహ్మద్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి పవనకుమార్‌రెడ్డి, బీఎస్పీ అభ్యర్థి నరసింహులు నామినేషన్లు ఆమోదించారు. మిగిలిన వారిలో ఐదుగురు ఇండిపెండెంట్ల నామినేషన్లు ఆమోదించారు. ఇదిలా వుండ గా టీడీపీ అభ్యరిగా నామినేషన వేసిన గుల్నాజ్‌బేగం, వైసీపీ అభ్యర్థిగా నామినేషన వేసిన మహ్మద్‌ హసన, కాంగ్రెస్‌ అభ్యర్థిగా నామినేషన వేసిన నరేంద్రలు బీ-ఫామ్‌ సమర్పించకపోవడంతో వారి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వారితో పాటు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు ఆకాష్‌కు ఎన్నికల్లో పోటీచేసే వయస్సు 25 ఏళ్లకు తక్కువగా ఉండటం, రెడ్డెప్ప నామినేషన్లతో సాంకేతిక లోపాలు వుండటంతో వారిద్దరి నామి నేషన్లు తిరస్కరించారు. దీంతో మొత్తం ఐదుగురి నామినేషన్లు తిరస్క రణకు గురికాగా 14 మంది నామినేషన్లు ఆమోదించారు.

పీలేరులో: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం పీలేరు లో జరిగిన అసెంబ్లీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ప్ర శాంతంగా ముగిసింది. పీలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి 15 మంది అభ్యర్థులు 27 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. పరిశీలనలో భాగంగా ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. తెలుగదేశం పార్టీ అభ్యర్థి నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి తరపున డమ్మీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన ఆయన సతీ మణి నల్లారి తనూజా రెడ్డి, కుమారుడు నల్లారి అమరనాథరెడ్డి, వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి తరపున డమ్మీ అభ్యర్థిగా నామినేషన దాఖలు చేసిన ఆయన సతీమణి చింతల నీరజమ్మ నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. ఆయా పార్టీల తరపున బీ.ఫారాలు పొంది న ప్రధాన అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందినట్లు అధికారులు తెలిపారు. తిరస్కరణ తరువాత పీలేరు బరిలో 12 మంది అభ్యర్థులు మిగిలారు. వారిలో ప్రధాన పార్టీలైన తెలుగుదేశం తరపున నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి, వైసీపీ తరపున చింతల రామచంద్రారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ తరపున బాలిరెడ్డి సోమశేఖరరెడ్డి, బహుజన సమజ్‌ పార్టీ తరపు న ఎంసీ వెంకటరమణతోపాటు మరో 8 మంది స్వతంత్య్ర అభ్యర్థులు మిగిలారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29వ వరకు గడువు ఉంది. 2014, 2019 ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి నామినేషనపై పుకార్లు వ్యాపించి కాసింత ఉత్కంఠకు దారితీసిన ఉదంతాలు ఉండడంతో ఈ దఫా పోలీసులు నామినేషన్ల పరిశీలనలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

తంబళ్లపల్లెలో: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం తంబళ్లపల్లె రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో ఆర్వో రాఘవేంద్ర ఆధ్వ ర్యంలో నామినేషన పత్రాల పరిశీలన జరిగింది. వాటిలో 12 మంది అభ్యర్థుల నామినేషన్లు సరిగ్గా ఉన్నట్లు గుర్తించి ఆమోదించగా..7 మం ది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఆమోదించిన నామినేష న్లలో టీడీపీ అభ్యర్థి దాసరిపల్లె జయచంద్రారెడ్డి, వైసీపీ అభ్యర్థి పెద్దిరె డ్డి ద్వారక నాథరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంఎన చంద్రశేఖర్‌రెడ్డి, జై భార త నేషనల్‌ పార్టీ అభ్యర్థి పీఠల అంజలి, బహుజన సమాజ్‌ పార్టీ అభ్యర్థి కందుకూరి సుజాత, జాతీయ జనసేన అభ్యర్థి డి.జయచంద్రా రెడ్డి, స్వతంత్ర అభ్యర్థులు గుండాల క్రిష్ణప్ప, వై ద్వారకనాథరెడ్డి, ఎన.నరసింహులు, ఎంఎస్‌ భానుచంద్రారెడ్డి, పీఏ వెంకటరెడ్డి, ఎం.సురే ష్‌ నామినేషన్ల దరఖాస్తులు ఆమోదించినట్లు ఆర్వో తెలిపారు.

Updated Date - Apr 26 , 2024 | 11:52 PM