Share News

కమలాపురంలో.. రెడ్లదే హవా

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:27 PM

కమలాపురం నియోజకవర్గానికి జిల్లాలో విశిష్ట స్థానం ఉంది. ఎందరో ఉద్ధండులను కమలాపు రం శాసనసభ స్థానానికి ఎంపిక చేసిన ఓట ర్లు మొట్టమొదటి విజయాన్ని భారత కమ్యూనిస్టు పార్టీకి అందించారు. 1951లో ఏర్పాటైన నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగా యి. ఇందులో రెడ్డి కులానికి చెందిన వా రు 14 సార్లు గెలవగా, ఒకే ఒక్క సారి రెడ్డియే తర అభ్యర్థి గెలవడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు గా రెడ్డి సామాజిక వర్గం పోటీలో ఉండగా సీపీఐ నుంచి రెడ్డియే తర అభ్యర్థి పోటీలో ఉన్నారు. సీపీఐ అభ్యర్థికి కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించింది.

కమలాపురంలో.. రెడ్లదే హవా
ఎన్‌.శివరామిరెడ్డి, తొలి ఎమ్మెల్యే

15 సార్లు ఎన్నికలు

14 సార్లు వాళ్లే

హాట్రిక్‌ లభించని నేతలు

అభ్యర్థి నిర్ణయం మహిళల చేతుల్లోనే

కడప (ఎర్రముక్కపల్లె), ఏప్రిల్‌ 25:

కమలాపురం నియోజకవర్గానికి జిల్లాలో విశిష్ట స్థానం ఉంది. ఎందరో ఉద్ధండులను కమలాపు రం శాసనసభ స్థానానికి ఎంపిక చేసిన ఓట ర్లు మొట్టమొదటి విజయాన్ని భారత కమ్యూనిస్టు పార్టీకి అందించారు. 1951లో ఏర్పాటైన నియోజకవర్గంలో ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరిగా యి. ఇందులో రెడ్డి కులానికి చెందిన వా రు 14 సార్లు గెలవగా, ఒకే ఒక్క సారి రెడ్డియే తర అభ్యర్థి గెలవడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ అభ్యర్థులు గా రెడ్డి సామాజిక వర్గం పోటీలో ఉండగా సీపీఐ నుంచి రెడ్డియే తర అభ్యర్థి పోటీలో ఉన్నారు. సీపీఐ అభ్యర్థికి కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించింది.

తొలి ఎమ్మెల్యేగా ఎన్‌.శివరామిరెడ్డి

1951లో కమలాపురం నియోజకవర్గం ఏర్ప డింది. తొలిసారిగా 1952లోఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా నర్రెడ్డి శివరామిరెడ్డి పోటీ చేసి తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్ధి రామ లింగారెడ్డిపై విజయం సాధించారు. తొలి కమలాపు రం నియోజకవర్గం ఎమ్మెల్యేగా నమోదయ్యారు. ఆ ఎన్నికల్లో 5304 ఓట్లు సాఽధించారు.

పదిహేను సార్లు ఎన్నికలు

నియోజకవర్గంలో 15 పర్యాయాలు ఎన్నిక లు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, కాంగ్రెస్‌-ఐ అభ్యర్థులు 8సార్లు విజయం సాధించగా, రెండు సార్లు టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఒకసారి సీపీఐ, రెండు సార్లు ఇండి పెండెంట్లు, రెండు సార్లు వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే 1967లో ఇండి పెండెంట్‌ అభ్యర్ధి పుల్లా రెడ్డి సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి వడ్డమాను వెంకట రెడ్డిపై 86 ఓట్ల అత్యల్ప ఆఽధిక్య తతో విజయం సాధించారు.

అభ్యర్థిని నిర్ణయించేది మహిళలే...

కమలాపురం నియోజకవర్గంలో 2024ఎన్నికల్లో అభ్యర్థిని నిర్ణయిం చేది మహిళా ఓటర్లే అని చెప్పాలి. నియోజకవర్గంలో 203536 మంది ఓటర్లుండగా, వీరిలో 99553 మంది పురు షులు ఓటర్లు, మహిళలు 1,03,949 మంది, థర్డ్‌ జండర్‌ 34 మంది అయితే అత్యధికంగా ఉన్న మహిళా ఓటర్లు కమలాపురం ఎమ్మెల్యే అభ్యర్థిని నిర్ణయించే అవకాశాలున్నాయి.

మండలాలు

నియోజకవర్గంలో ఆరు మండలాలు న్నాయి. కమలాపురం, సీకే దిన్నె, చెన్నూ రు, పెండ్లిమర్రి, వల్లూరు, వీఎన్‌పల్లె.

2004 నుంచి ఎన్నికల సరళి

2004లో జి.వీరశివారెడ్డి టీడీపీ తరపున ఎన్నికై కాంగ్రెస్‌లోకి మారారు. కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి ఓడిపోయిన పుత్తా నరసింహారెడ్డి టీడీపీలోకి మారారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరపున జి.వీరశివారెడ్డి పోటీ చేసి తన సమీప ప్రత్యర్ధి పుత్తా నరసింహారెడ్డిపై 4163 ఓట్ల మెజార్టీతో గెలి చారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రవీంద్రనాధరెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డిపై 5345 ఓట్ల మెజార్టీతో గెలుపొం దారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పి.రవీంద్రనాధరెడ్డి తన సమీప టీడీపీ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డిపై 27,333 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024లో వైసీపీ తరపున పి.రవీంద్రనాధరెడ్డి, టీడీపీ అభ్యర్థిగా పుత్తా చైతన్య రెడ్డి, సీపీఐ అభ్యర్థిగా గాలిచంద్ర పోటీలో ఉన్నారు.

1952 నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు

1952 నర్రెడ్డి శివరామిరెడ్డి, సీపీఐ

1955 ఎం.శంభురెడ్డి, కాంగ్రెస్‌

1962 వి.వెంకటరెడ్డి, కాంగ్రెస్‌

1967 ఎన్‌.పుల్లారెడ్డి , స్వతంత్ర

1972 ఆర్‌సీతారామయ్య, కాంగ్రెస్‌

1978 పేర్ల శివారెడ్డి, స్వతంత్ర

1983 జి.వెంకటరెడ్డి, టీడీపీ

1985 ఎంవీ మైసూరారెడ్డి, కాంగ్రెస్‌

1989 ఎంవీ మైసూరారెడ్డి, కాంగ్రెస్‌

1994 జి.వీరశివారెడ్డి, టీడీపీ

1999 ఎంవీ మైసూరా రెడ్డి, కాంగ్రెస్‌

2004 వీరశివారెడ్డి, టీడీపీ

2009 వీరశివారెడ్డి, కాంగ్రెస్‌

2014 పి.రవీంద్రనాధరెడ్డి, వైసీపీ

2019 పి.రవీంద్రనాధరెడ్డి, వైసీపీ

Updated Date - Apr 25 , 2024 | 11:27 PM