Share News

అభివృద్ధి అంటే ఇదేనా...?

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:24 PM

‘బద్వేలు నియోజకవర్గంలో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నాం అంటూ 2021 జూలై10న ఉప ఎన్నికల్లో సీఎం జగన్‌ ప్రక టించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు రూ.500 కోట్ల అభి వృద్ధి. అయితే జరిగిన పనులు రూ.47 కోట్లు మాత్రమే. ప్రతిపక్ష నేత హోదాలో చాంతాడంత హామీలు ఇచ్చినా సీఎం అయ్యాక ఐదేళ్లు ఏం చేయలేకపోగా మళ్లీ వైసీపీనే గెలిపించాలంటూ ఇంటింటి ప్రచారం చేస్తుండడం గమనార్హం.

అభివృద్ధి అంటే ఇదేనా...?

ముఖ్యమంత్రి హామీలు నీటి మూటలు

‘మాట తప్పను మడమ తిప్పను’ నినాదానికి తూట్లు

బద్వేలు రూరల్‌

‘బద్వేలు నియోజకవర్గంలో రూ.500 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నాం అంటూ 2021 జూలై10న ఉప ఎన్నికల్లో సీఎం జగన్‌ ప్రక టించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు రూ.500 కోట్ల అభి వృద్ధి. అయితే జరిగిన పనులు రూ.47 కోట్లు మాత్రమే. ప్రతిపక్ష నేత హోదాలో చాంతాడంత హామీలు ఇచ్చినా సీఎం అయ్యాక ఐదేళ్లు ఏం చేయలేకపోగా మళ్లీ వైసీపీనే గెలిపించాలంటూ ఇంటింటి ప్రచారం చేస్తుండడం గమనార్హం. గోపవరం పక్కనే సోమశిల ప్రాజెక్టు నిర్మా ణం కోసం గోపవరం మండలంలో ఊర్లన్నీ ఖాళీ చేయించారు. చెంతనే నీరున్నా చుక్క కూడా ఉపయోగించలేని దుస్థితి. సోమశిల నీటిని బద్వేలు పెద్దచెరువుకు నింపితే బద్వేలు, గోపవరం మండలాలకు సాగు, తాగునీటి సమస్య తీరుతుందని ఆ ప్రాంతీయులు ఆశించారు. సోమశిల నీటి కోసం ఆందోళనలు, పాదయాత్రలు, ఉద్యమాలు చేశారు. 2018లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక జీఓ ఇచ్చారు. ఇంతలో సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ బద్వేలు నాలుగురోడ్ల కూడలి బహిరంగసభలో మాట్లాడుతూ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే సోమశిల నుంచి 2 టీఎంసీలు కాదు 5 టీఎంసీల నీటిని ఇస్తానని జనం సాక్షిగా హామీ ఇచ్చారు. దీంతో గోపవరం, బద్వేలులో సుమారు 25వేల ఎకరాలకు నీరందుతుందని రైతులు సంతోషించారు. జగన్‌ హామీలకు సైతం మంగళం పాడితే అభివృద్ధి అంటే హామీలు ఇవ్వడం కాదు వాటిని అమలు చేయడమని బద్వేలు వాసులు మడ మ తిప్పిన జగన్‌కు తెలిపే యోచనలో ఉన్నారు.

తాను అధికారంలోకి వస్తే తాగు, సాగునీరు అన్నిరంగాల్లో బద్వేలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తాన ని ప్రతిపక్ష నేతగా 2019లో ఎన్నికల రోడ్‌షోలో హామీలు, ముఖ్యమంత్రి అయ్యాక ఉప ఎన్నికలు సమీపిస్తు న్న తరుణంలో నెల్లూరు బైపాస్‌ రో డ్డులో నిర్వహించిన బహిరంగ సభ లో ఇచ్చిన హమీలు అమలుకు నోచు కోక ఇచ్చిన హామీలు నీటిమూటల య్యాయి. మాట తప్పం, మడమ తిప్పం నాదానికి తూట్లు పడ్డాయి.

2019 రోడ్‌ షోలో ఇచ్చిన హామీలు

2019 ఎన్నికల ప్రచారంలో పట్టణం లోని నెల్లూరు రోడ్డులో నిర్వహించిన రోడ్‌షోలో సోమశిల వెనుక జలాల ద్వారా బద్వేలు, గోపవరం, అట్లూరు మండలాలకు సాగునీరందిస్తామని ఇచ్చిన హామీ అమలుకు నోచుకో లేదు. సోమశిల వెనుకజలాల ఎత్తిపో తల పథకం నిర్మించినట్లయితే బద్వే లు, గోపవరం, అట్లూరు మండలా ల్లోని రైతాంగానికి సాగునీరు అంది చాలా మటుకు రైతాంగ సమస్యలు పరిష్కారం అవుతాయి. అయినా ఆ హామీని నిలబెట్టుకోలేకపోయారు.

2021 సభలో ఇచ్చిన హామీలు

2021 ఉప ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పట్టణంలోని పోరుమా మిళ్ల బైపాస్‌ రోడ్డులో నిర్వహించిన బహిరంగసభలో కుందూ నది వద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రారంభించి ఆ నీటిని బ్రహ్మంసాగర్‌కు అందిస్తామని ఇచ్చి న హామీ ఇప్పటికీ అమలుకు నోచుకో లేదు. కొంత మేర పనులు ప్రారంభ మైనప్పటికీ ఆ పనులు ప్రస్తుతం నిలిచిపోయాయి. దీంతో కుందూ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ హామీ నీటిమూటగా మారింది. అలాగే ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి బద్వేలులో శిధిలా వస్థకు చేరుకున్న తహసీల్దారు కార్యా లయం, సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం నూతన భవ న నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని అడిగారని, రూ.15 కోట్లు ఆ నూతన భవనాలకు నిధులు మం జూరు చేస్తున్నామని హామీ ఇచ్చారు. మరి ఆ హామీ ఇంత వరకూ అమ లు కాలేదు. అలాగే ఎప్పుడూ ప్రస్తా వనకు కూడా రాలేదు. దీంతో ముఖ్య మంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌ ఇచ్చి న చాలా హామీల్లో అమలుకు నోచు కోని విధంగానే బద్వేలుకు ఇచ్చిన హామీ కూడా అమలుకు నోచుకోలేక పోయాయి.

శతాబ ్దం దాటిన రెండు భవనాలు

బద్వేలు తహసీల్దారు కార్యాలయాని కి శతాబ్ధ కాలం పూర్తయింది. దాదా పు 1900లో నిర్మించినట్లుగా చెబుతు న్న కార్యాలయం శిధిలావస్థకు చేరిం ది. 1894లో నిర్మించిన సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయ పరిస్థితి కూడా అలాగే ఉంది. మిగా అభివృద్ధి పనుల మాట ఎలా ఉన్నా ఈ రెండు భవనాలు శతాబ్ధ కాలం దాటింది కనుక నూత న భవనాలు నిర్మించాల్సి ఉంది. ముఖ్యమంత్రి హామీ ఇచ్చినప్పటికీ ఈ రెండు కార్యాలయాల నూతన భవనాలకు నిధులు మంజూరు కాలే దు. అధికారులు, ప్రజలు అలాగే కాలం వెల్లదీస్తున్నారు.

ప్రతిపక్ష, సీఎం హోదాలో జగన్‌ ఇచ్చిన హామీలు

ఫ బద్వేలులో కూరగాయల మార్కెట్‌, పార్కులు, శ్మశానాల అభివృద్ధికి ఇచ్చిన హామీలు పూర్తి కాలేదు.

- నాగులచెరువును సుందరీకరణ చేపడతామన్న హామీ సైతం అటకెక్కించారు.

- పోరుమామిళ్లలో రూ.25 కోట్లతో రోడ్ల విస్తరణ పనులు చేపట్టినా అవి ముందుకు సాగడంలేదు.

- కాశినాయన మండలంలో 22 దేవాలయాలకు నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామన్న హామీ నెరవేరలేదు.

- శిధిలావస్థకు చేరుకున్న బి.కోడూరు మండలం సగిలేరు గురుకుల పాఠశాలకు అదనపు గదులు ఇస్తామని హామీ నేటికీ అలాగే నిలిచిపోయింది.

- బికోడూరు మండలం గోవిందాయపల్లెలో విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

- అట్లూరు మండలం వేమలూరు సగిలేరు మధ్య రూ.22 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి సీఎం జగన్‌ వేసిన శిలాఫలకం అలాగే నిలిచిపోయింది.

- కుడికాల్వ పనులు పూర్తి చేసి అట్లూరుకు తెలుగంగ నీరు అందిస్తామని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు.

- కలసపాడు నుంచి బ్రాహ్మణపల్లెకు వెళ్లే దారిలో సగిలేరు వంతెనపై రూ.9.5 కోట్లతో నిర్మించే బ్రిడ్జికి సీఎం జగన్‌ ఉప ఎన్నికల సందర్భంగా శంకుస్థాపన చేశారు. హామీ శిలాఫలకాలకే పరిమితమైంది.

- వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కలసపాడు, కాశినాయన, పోరుమామిళ్ల మండలాల్లో 25వేల ఎకరాలకు సాగు, తాగునీరు అందించేందుకు ఆ ప్రాజెక్టు డిజైన్‌ చేశారు. ఇంత వరకూ అది కార్య రూపం దాల్చలేదు.

- తెలుగుగంగ ప్రాజెక్టు పిల్ల కాల్వలు, ఇతర పనులు పూర్తి కాకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందని పరిస్థితి కేవలం చెరువులు నింపి వాటి ద్వారా అందిస్తున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:24 PM