Share News

ప్రమాద బీమా పాలసీని సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:38 PM

పోస్టల్‌శాఖ కొత్తగా ప్రారంభించిన ప్రమాద బీమా పాలసీని సద్వినియోగం చేసుకునులా ప్రజలకు అవగాహన కల్పించాలని చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ ప్రకాష్‌ సూచించారు.

ప్రమాద బీమా పాలసీని సద్వినియోగం చేసుకోవాలి
బసినికొండ బ్రాంచి పోస్టాఫీసులో తనిఖీ చేస్తున్న చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ ప్రకాష్‌

మదనపల్లె టౌన, ఏప్రిల్‌ 25: పోస్టల్‌శాఖ కొత్తగా ప్రారంభించిన ప్రమాద బీమా పాలసీని సద్వినియోగం చేసుకునులా ప్రజలకు అవగాహన కల్పించాలని చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ ప్రకాష్‌ సూచించారు. గురువారం మండలంలోని బసినికొండ బ్రాంచి పోస్టాఫీసును ఆయ న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోస్టల్‌శాఖలో ప్రమాద బీమా ప్రీమి యం రూ.520 చెల్తిస్తే రూ.10లక్షల వరకు, రూ.320 ప్రీమియం చెల్లిస్తే రూ.5లక్షల వరకు ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. ప్రమాద బీమా పాలసీ తీసుకున్న పాలసీదారులకు మెరుగైన సేవలు, సౌకర్యాలు పోస్టల్‌ శాఖ అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పోస్టల్‌ శాఖ అధికారులు శర్వనన, నీలిమ, గణపతి, బీపీఎం నాగలత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:38 PM