Share News

ఎత్తిపోతలు.. వట్టి కోతలు

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:15 PM

‘వట్టిమాటలు కట్టిపెట్టోయ్‌ గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌’ అంటూ జగన్‌ గట్టి మేలు కోసం ఎత్తిపోతల పథకం ఏర్పాటు కోసం తగినన్ని నిధులు కేటాయి స్తాం, వెంటనే పనులు ప్రారంభిస్తామని ప్రకటనలు చేశారు. అయితే ఇక్కడ ఎత్తిపోతల పథకం ఎత్తిపోయి జగన్‌ మడమ తిప్పడాన్ని స్పష్టంగా చూపిస్తోంది. కుందూనది నుంచి తెలుగుగంగకు ఎత్తిపోతల ప్రాజెక్టు ఏర్పాటు చేసి వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని చేసిన ప్రకటనలు సైతం మాటతప్పాయని శిలాఫలకాల రూపంలో జగన్‌ను వెక్కిరిస్తున్నాయి. 2019 డిసెంబరు 23న దువ్వూరు మండలం పెద్ద జొన్నవరం వద్ద ఎత్తిపోతలకు శంకుస్థాపన రోజున సీఎం జగన్‌, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చేసిన ప్రకటనలు నీటి మూటలయ్యాయి. ఒకరు రాష్ట్రానికే సీఎం, మరొకరు మైదుకూరు నియోజకవర్గానికి బాస్‌ ఇలా ఇద్దరూ మాట ఇచ్చి మడమ తిప్పారు. వివరాల్లోకెళితే....

ఎత్తిపోతలు.. వట్టి కోతలు
ఎత్తిపోతల పథకానికి కేటాయించిన స్థలం

మడమ తిప్పావ్‌ జగనన్నా !

కుందూ నుంచి తెలుగుగంగ ఎత్తి పోతలకు శంకుస్థాపనతోనే సరి

రాజోలిదీ అదే దారి

ఆయకట్టు లేదు.. తాగునీరు రాదు

మైదుకూరు, ఏప్రిల్‌ 24:

‘వట్టిమాటలు కట్టిపెట్టోయ్‌ గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌’ అంటూ జగన్‌ గట్టి మేలు కోసం ఎత్తిపోతల పథకం ఏర్పాటు కోసం తగినన్ని నిధులు కేటాయి స్తాం, వెంటనే పనులు ప్రారంభిస్తామని ప్రకటనలు చేశారు. అయితే ఇక్కడ ఎత్తిపోతల పథకం ఎత్తిపోయి జగన్‌ మడమ తిప్పడాన్ని స్పష్టంగా చూపిస్తోంది. కుందూనది నుంచి తెలుగుగంగకు ఎత్తిపోతల ప్రాజెక్టు ఏర్పాటు చేసి వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని చేసిన ప్రకటనలు సైతం మాటతప్పాయని శిలాఫలకాల రూపంలో జగన్‌ను వెక్కిరిస్తున్నాయి. 2019 డిసెంబరు 23న దువ్వూరు మండలం పెద్ద జొన్నవరం వద్ద ఎత్తిపోతలకు శంకుస్థాపన రోజున సీఎం జగన్‌, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చేసిన ప్రకటనలు నీటి మూటలయ్యాయి. ఒకరు రాష్ట్రానికే సీఎం, మరొకరు మైదుకూరు నియోజకవర్గానికి బాస్‌ ఇలా ఇద్దరూ మాట ఇచ్చి మడమ తిప్పారు. వివరాల్లోకెళితే....

దువ్వూరు మండలం పెద్ద జొన్నారం వద్ద కుందూ నది పై ఎత్తి పోతల పథకం ఏర్పాటు చేసి ఉంటే తెలుగుగంగ రెండు ఉప జలాశయాలు, బ్రహ్మంసాగర్‌లోనూ జలకళ ఉండేది. దువ్వూరు మండలం చల్లబసాయిపల్లె వద్ద ఉన్న 1వ ఉప జలాశయంలో 2.133 టీఎంసీలు నీరు నిల్వ, మైదుకూరు మండలం గంజికుంట వద్ద ఉన్న 2వ జలాశయంలో 2.44 టీఎంసీల నీరు, బి. మఠం ఉద్ద బ్రహ్మంసాగర్‌లో 17.73 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశముంది. అయితే పాలకుల నిర్లక్ష్యంగా ఉపజలాశయాల్లో 0.2 నుంచి 0.5, బ్రహ్మంసాగర్‌లో 4 టీఎంసీల నీటి నిల్వ చేసుకోలేక పోతున్నాం. అదే ఎత్తి పోతల పథకం ఏర్పాటు చేసి ఉంటే నీటి నిల్వ పుష్కలంగా ఉండడంతో పాటు తాగు, సాగునీటికి ఢోకా ఉండే ది కాదు. శంకు స్థాపన చేసి నాల్గున్నరేళ్లవుతున్నా ఇంత వరకూ ఆ పనులు ఊసే లేదు. టెండరు దక్కించుకున్న కాంట్రాక్టరు పనులు అప్పగించలేదు. అలాగే 48 ఎకరాలు భూసేకరణ చేయాల్సివుండగా అదీ స్థితీగతి లేకుండా పోయింది. సీఎం జగన్‌, ఎమ్మెల్యే రఘురామి రెడ్డి ఇద్దరూ నియోజకవర్గ ప్రజలకు మాట ఇచ్చి తప్పారూ !

రాజోలి జలాశయందీ అదే దారి

2008 డిసెంబరు 23న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రాజోలి రిజర్వాయర్‌ నిర్మాణానికి శంకు స్థాపన చేశారు. ఆయన హయాంలో నిర్మించక పోవడంతో, అధికారం కోసం పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం తిరిగి ఎత్తి పోతల పథకం శంకుస్థాపన రోజే రాజోలి ఆనకట్ట వద్ద జలాశయం నిర్మించేందు కు ముఖ్యమంత్రి జగన్‌ శంకుస్థాపన చేశారు. ఇందు కోసం 1357.20 కోట్ల అంచనా వ్యయం తో 2.95 టీఎంసీల సామర్థ్యంతో జలాశయం నిర్మించేందుకు శంకుస్థాపన చేశారు. అయితే పదవీకాలం ముగుస్తున్నా నేటికీ పనులు ప్రారంభం కాలేదు. శిలా పలకంలో మాత్రం 91 వేల ఆయకట్టు స్థీరీకరణకు 2.95 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజక్టు నిర్మించే విధంగా పేర్కొంది. కాని ఆ శిలా ఫలకం ఇప్పటికీ వెక్కిరిస్తోంది. జగనన్నా !

Updated Date - Apr 24 , 2024 | 11:15 PM