Share News

పట్టణ ఆరోగ్య కేంద్రాలు వందశాతం లక్ష్యాలు సాధించాలి

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:16 PM

పట్టణ ఆరోగ్య కేంద్రాలు వందశాతం లక్ష్యాలను సాధించాలని అన్నమయ్య జిల్లా జాతీయ ఆరోగ్య మిషన పర్య వేక్షణ అధికారి (డీపీఎంవో) డాక్టర్‌ రియాజ్‌బేగ్‌ అన్నారు.

పట్టణ ఆరోగ్య కేంద్రాలు వందశాతం లక్ష్యాలు సాధించాలి
మాట్లాడుతున్న డీపీఎంవో డాక్టర్‌ రియాజ్‌బేగ్‌

డీపీఎంవో డాక్టర్‌ రియాజ్‌బేగ్‌

రాయచోటిటౌన, ఏప్రిల్‌ 24: పట్టణ ఆరోగ్య కేంద్రాలు వందశాతం లక్ష్యాలను సాధించాలని అన్నమయ్య జిల్లా జాతీయ ఆరోగ్య మిషన పర్య వేక్షణ అధికారి (డీపీఎంవో) డాక్టర్‌ రియాజ్‌బేగ్‌ అన్నారు. బుధవారం ఆయన రాయచోటి మున్సి పాలిటీ పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రం వాల్మీ కి స్ర్టీట్‌లో వైద్య ఆరోగ్య సిబ్బంది నిర్వహిస్తున్న సెక్టార్‌ మీటింగ్‌ను ఏపీ డెమోలజిస్ట్‌ వెంకటేశతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ యూపీహెచసీలలో వైద్యులు, సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ప్రతిరోజు టెలీ మెడిసిన సేవలు అందించాలని, అర్బనలో వ్యాఽధి నిరోధక టీకాల ప్రగతి చాలా తక్కువగా ఉందని, ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసుకుని లక్ష్యాలను అధిగమించాలని ఆదేశించారు. ఓఆర్‌ ఎస్‌ కార్నర్‌ ఏర్పాటు చేసుకుని అన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఫార్మసిస్ట్‌ను ఆ దేశించారు. ఐహెచఐపీ పోర్టల్‌లో రోజువారీ నివేదికలు అప్డేట్‌ చేయాలని ఎల్‌టీని ఆదేశిం చారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హా స్పిటల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ కమిటీ సమావేశం ప్రతినెలా నిర్వహించి జాతీయ ఆరో గ్యమిషన నిధులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి శుక్రవారం ప్రైడే, డ్రైడే నిర్వ హించాలని, వివరాలను యాప్‌లో ఏఎనయం అప్డేట్‌ చేయాలని తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎండలు పెరుగుతున్న దరిమిలా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయట తిరగకుండా ఉండడం, గొడుగులు, టోపీలు, చలవ అద్దాలు వాడటం వంటి జాగ్రత్తలు పాటించేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యులు, ఏఎనఎంలు, ఆశ కార్యకర్తలు, ఆరోగ్య పర్యవేక్షకులు నూర్జహా న, ఫార్మసిస్ట్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 11:17 PM