Share News

వైసీపీ అరాచకాలు అణగదొక్కేందుకే మళ్లీ వచ్చా

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:54 PM

రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు, జిల్లాలో పెద్దిరెడ్డి కుంటుబీకుల అవినీతి అణగదొక్కేందుకే తాను మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని ఉమ్మడి కూటమి పార్లమెంట్‌ అభ్యర్థి, మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

వైసీపీ అరాచకాలు అణగదొక్కేందుకే మళ్లీ వచ్చా
కమ్మసంఘం ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి

ఉమ్మడి కూటమి పార్లమెంట్‌ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి

మదనపల్లె టౌన, ఏప్రిల్‌ 26: రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు, జిల్లాలో పెద్దిరెడ్డి కుంటుబీకుల అవినీతి అణగదొక్కేందుకే తాను మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని ఉమ్మడి కూటమి పార్లమెంట్‌ అభ్యర్థి, మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రైవేటు కళ్యాణమండపంలో కమ్మసంఘం ఆత్మీయ సమావేశంలో కిరణ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రతి ఒక్కరు హుందాతనం పాటించాలని, వ్యక్తిత్వ హననం చేయకూడదన్నారు. 30 ఏళ్ల రాజకీయంలో తాను చంద్రబాబుతో కలసి బహిరంగ సభలో పాల్గొన్నాని, తనకు చాలా సంతోషంగా వుంద న్నారు. వైసీపీ పాలనలోని రౌడీయిజం, అక్రమ కేసులు పోవాలంటే చంద్రబాబును సీఎం చేయా లని, ప్రధాన మంత్రిగా మోదీని ఎన్నుకోవాల్సిన అవసరం వుందన్నారు. ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహానబాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబు, జనసేన నాయకు డు శ్రీరామ రామాంజనేయులు, కమ్మసంఘం నాయకులు రాటకొండ బాబురెడ్డి, ఆనంద్‌, మార్పు రి సుధాకర్‌నాయుడు, మిట్స్‌ విజయభాస్కర్‌చౌదరి, ద్వారకనాథ్‌, విద్యాసాగర్‌, గురుప్రసాద్‌, గంగారపు గౌతంరెడ్డి, కట్టా దొరస్వామినాయుడు, కమ్మయూత పెరవలి నవీన, నిరంజననాని, బోయపాటి రాణా పాల్గొన్నారు. మదనపల్లె మండలం సీటీ ఎంలో మాజీ సీఎం కిరణ్‌కుమా ర్‌రెడ్డికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు.

Updated Date - Apr 26 , 2024 | 11:54 PM