Share News

ys jagan: టీడీపీలో చేరిన కోడికత్తి శ్రీను

ABN , Publish Date - Apr 28 , 2024 | 03:43 PM

కోడికత్తి శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆదివారం ముమ్మడివరం కూటమి అభ్యర్థి, టీడీపీ నాయకుడు దాట్ల బుచ్చిబాబు సమక్షంలో కోడికత్తి శ్రీను ఆ పార్టీలో చేరారు. అనంతరం కోడికత్తి శ్రీను మాట్లాడుతూ... వైసీపీ అధినేత వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం.. చేసిన ప్రయత్నం వల్ల తాను ఐదేళ్లు జైల్లో మగ్గాల్సి వచ్చిందన్నారు. జైలు నుంచి తన విడుదల కోసం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ys jagan: టీడీపీలో చేరిన కోడికత్తి శ్రీను

అమలాపురం, ఏప్రిల్ 27: కోడికత్తి శ్రీను తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆదివారం ముమ్మడివరం కూటమి అభ్యర్థి, టీడీపీ నాయకుడు దాట్ల బుచ్చిబాబు సమక్షంలో కోడికత్తి శ్రీను ఆ పార్టీలో చేరారు. అనంతరం కోడికత్తి శ్రీను మాట్లాడుతూ... వైసీపీ అధినేత వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం.. చేసిన ప్రయత్నం వల్ల తాను ఐదేళ్లు జైల్లో మగ్గాల్సి వచ్చిందన్నారు. జైలు నుంచి తన విడుదల కోసం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.


అయితే తాను వైసీపీని ఎంతగానో అభిమానించానని.. కానీ తాను జైలు నుంచి విడుదలయ్యేందుకు ఆ పార్టీ నుంచి ఏ ఒక్కరు కనీసం సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జైలు నుంచి తన విడుదలకు కారణమైన ప్రతీ ఒక్కరికి ఈ సందర్భంగా కోడికత్తి శ్రీను ధన్యవాదాలు తెలిపారు.

తాను బతికి ఈ రోజు ఇలా ఉండడానికి ప్రతిపక్షాలు, ఎస్సీ సంఘాలే కారణమని కోడికత్తి శ్రీను అభిప్రాయపడ్డారు. ఇక ఈ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా తాను బరిలో దిగాలని తొలుత నిర్ణయించు కున్నానని.. కానీ పరిస్థితులు అందుకు అనుకూలించ లేదని కోడికత్తి శ్రీను వివరించారు.


2019 ఎన్నికలకు ముందు.. అంటే 2018 ఏడాది చివరిలో ప్రతిపక్షనేత వైయస్ జగన్ పాదయాత్ర చేశారు. ఆ క్రమంలో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్నారు. అందుకోసం విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌‌కు వైయస్ జగన్ చేరుకున్నారు. అంతలో ఎయిర్‌పోర్ట్‌లో శ్రీను అనే వ్యక్తి వైయస్ జగన్‌తో సెల్ఫీ దిగాలని కోరాడు.

అందుకు ఆయన అనుమతించారు. అదే సమయంలో వైయస్ జగన్‌పై కోడికత్తితో శ్రీను దాడి చేశారు. ఈ నేపథ్యంలో తనపై హత్యయత్నం జరిగిందంటూ వైయస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తనకు ఆంధ్రపోలీసులపై నమ్మకమే లేదన్నారు.


దీంతో విశాఖలో విమానం ఎక్కి హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం లోటస్ పాండ్‌లోని తన నివాసానికి కూత వేటు దూరంలోని ఆసుపత్రిలో వైయస్ జగన్ చేరారు. అప్పటికే కోడికత్తి దాడి చేసిన శ్రీనుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ కేసు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు అప్పగించారు. ఈ కేసును ఎన్ఐఏ సుధీర్ఘ విచారణ జరిపింది. ఆ సమయంలో సీఎం వైయస్ జగన్ ఒక్క సారి కూడా కోర్టుకు హాజరుకాలేదు.


ఈ కేసులో బెయిల్ దొరక్క కోడికత్తి శ్రీను అయిదేళ్లు జైల్లోనే మగ్గిపోయారు. అయితే తాము వృధాప్యంలో ఉన్నామని.. ఈ సమయంలో తమ కుమారుడు కోడికత్తి శ్రీను తమకు అసరాగా ఉంటాడని అతడి తల్లి భావించింది. ఇదే విషయాన్ని సీఎం వైయస్ జగన్‌కు చెప్పేందుకు ఆమె తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయానికి సైతం వెళ్లారు.

కానీ ఆమె ప్రయత్నం ఫలించలేదు. అటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు, పలువురు నాయవాదులు పూనుకొని.. కోడికత్తి శ్రీనుకు బెయిల్ వచ్చేలా పోరాటం చేశారు. దీంతో ఇటీవల కోడికత్తి శ్రీను బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు.. వైయస్ జగన్‌పై కోడికత్తితో దాడి చేసిన శ్రీనుకు ఎటువంటి కుట్రలు కుతంత్రాలు లేవని తమ దర్యాప్తులో వెల్లడైందని ఆ పార్టీ సీనియర్ నేత వివరించారు.

Read National News and Telugu News

Updated Date - Apr 28 , 2024 | 03:47 PM