Share News

ఏడు రోజుల్లో 312 నామినేషన్లు

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:04 AM

చివరి రోజున పతాక స్థాయిలో అభ్యర్థుల నామినేషన్లు త్రిబుల్‌ సెంచరీ దాటింది. ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా గురువారం నాటికి రికార్డుస్థాయిలో మొత్తం 312 నామినేషన్లు దాఖలయ్యాయి. విజయవాడ పార్లమెంట్‌కు 42 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్టీఆర్‌ జిల్లా తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌లతో పాటు మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలలో 270 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు గురువారం రికార్డు స్థాయిలో మొత్తం 136నామినేషన్లు దాఖలయ్యాయి. పార్లమెంట్‌ పరిధిలో 21 నామినేషన్లు, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 115 నామినేషన్లు దాఖలయ్యాయి.

ఏడు రోజుల్లో 312 నామినేషన్లు

చివరి రోజు రికార్డు స్థాయిలో..

పార్లమెంట్‌ 21, అసెంబ్లీ పరిధిలో 115 నామినేషన్లు

నేడు నామినేషన్ల స్ర్కూటినీ

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : చివరి రోజున పతాక స్థాయిలో అభ్యర్థుల నామినేషన్లు త్రిబుల్‌ సెంచరీ దాటింది. ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా గురువారం నాటికి రికార్డుస్థాయిలో మొత్తం 312 నామినేషన్లు దాఖలయ్యాయి. విజయవాడ పార్లమెంట్‌కు 42 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎన్టీఆర్‌ జిల్లా తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌లతో పాటు మైలవరం, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాలలో 270 నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు గురువారం రికార్డు స్థాయిలో మొత్తం 136నామినేషన్లు దాఖలయ్యాయి. పార్లమెంట్‌ పరిధిలో 21 నామినేషన్లు, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 115 నామినేషన్లు దాఖలయ్యాయి.

ఫ విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గంలో జై మహాభారత్‌ పార్టీ అభ్యర్ధిగా చింతలచెరువు హేమలత, స్వతంత్ర పార్టీ, జై భీమ్‌ పార్టీ అభ్యర్థిగా దాట్ల లూర్ధు మేరీ, స్వతంత్ర అభ్యర్థిగా ఎన్‌.చరణ్‌ సుజిత్‌, రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అభ్యర్థిగా పేరం శివనాగేశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు వై.సాంబశివారెడ్డి, వై.మహేష్‌, షేక్‌ మగలాన్‌, రాణి లక్ష్మీనారాయణ శర్మ, దేవరకొండ రామకృష్ణ, చెవిటి అర్జున్‌, తమ్మి రామారావు, అబ్బూరి వెంకటశివనాగమల్లేశ్వరరావు, నంబూరి చరణ్‌ సుజిత్‌, కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఇర్ఫాన్‌ మహ్మద్‌, వల్లూరు భార్గవ్‌, టీడీపీ అభ్యర్ధిగా కేశినేని శివనాథ్‌, లిబరేషన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా వి.రవిచంద్రారెడ్డి, జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా కోకా వినయ్‌కుమార్‌, జనరాజ్యం పార్టీ అభ్యర్ధిగా డి.కుమార్‌, బీఎ్‌సపీ అభ్యర్ధిగా మేకా వెంకటేశ్వరరావులు నామినేషన్లు దాఖలు చేశారు.

ఫ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో చివరి రోజు మొత్తం 22 నామినేషన్లు, సెంట్రల్‌లో 11, విజయవాడ తూర్పులో 13, మైలవరంలో 13, జగ్గయ్యపేటలో 11, తిరువూరురులో 10, నందిగామలో 14 నామినేషన్లు వేశారు.

ఒకే పేరుతో అటు, ఇటుగా..

గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ మోహన్‌ నామినేషన్‌ వేయగా, దాదాపు అదే పేరుతో ఉన్న మరో వ్యక్తి వల్లభనేని మోహన్‌ శ్రీకృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. తిరువూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా కొలికపూడి శ్రీనివాస్‌ నామినేషన్‌ వేశారు. ఆపేరుకు దగ్గరగా కొలికపోగు శ్రీను పేరుతో ఉన్న వ్యక్తి జాతీయ జనసేన పార్టీ తరఫున నామినేషన్‌ వేశారు. అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్‌ నామినేషన్‌ వేశారు. నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున అదే పేరుతో ఉన్న బోయిన బుద్ధ ప్రసాద్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్‌ వేశారు. అదే పేరుతో ఉన్న కొడాలి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఈయన ప్రతి ఎన్నికల్లోనూ నామినేషన్‌ వేస్తుంటారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో టీడీపీ తరపున శ్రీరాం రాజగోపాల్‌ నామినేషన్‌ వేయగా,.. జాతీయ జనసేన పార్టీ అభ్యర్ధిగా శ్రీరామ్‌ రామకృష్ణ నామినేషన్‌ వేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామమోహన్‌ నామినేషన్‌ వేయగా.. స్వతంత్ర అభ్యర్ధులుగా యలమంచిలి రామమోహనరావు, గట్టి రామమోహనరావుల పేరుతో నామినేషన్లు పడ్డాయి. నందిగామ నియోజకవర్గంలో టీడీపీ తరపున తంగిరాల సౌమ్య నామినేషన్‌ వేయగా స్వతంత్ర అభ్యర్ధి పేరుతో తంగిరాల సౌమ్య అనే మహిళ నామినేషన్‌ దాఖలు చేశారు.

నేడు నామినేషన్ల స్ర్కూటినీ

నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగియటంతో శుక్రవారం నామినేషన్ల స్కూటినీ ప్రక్రియను చేపట్టనున్నారు. నామినేషన్ల స్ర్కూటినీ అనేది సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. ఎవరివి తిరస్కరించటం జరిగిందో, ఎవరివి ఆమోదించారో తెలుస్తుంది. శుక్రవారం ఇచ్చే జాబితా తుది నామినేషన్ల జాబితా అవుతుంది. ఇందులో ఎవరైనా ఉపసంహరించుకోవాలంటే 29 వ తేదీ వరకు గడువు ఉంది. 29 తర్వాత పోటీలో ఉండే అభ్యర్ధుల తుది జాబితా వస్తుంది.

కృష్ణాజిల్లాలో..

పార్లమెంటు స్థానానికి 37, ఏడు అసెంబ్ల్లీ స్థానాలకు 200

మచిలీపట్నం, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి) : మచిలీపట్నం పార్ల మెంటు స్థానానికి గురువారం 19నామినే షన్లు దాఖలయ్యాయి. ఏడు అసెంబ్లీ స్థ్థానాలకు గురువారం 76నామినేషన్లు దాఖలయ్యాయి. ఈనెల 18వతేదీనుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా నామినేషన్ల స్వీకరణకు గడువు ముగిసే నాటికి మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి 37 నామినేషన్లు దాఖలయ్యాయి. ఏడు అసెంబ్లీ స్థానాలకు 200 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డీకే బాలాజీ తెలిపారు. .

నామినేషన్ల స్వీకరణకు చివరి రోజైన గురువారం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో 66నామినేషన్లు దాఖలయ్యాయి. గుడివాడ నియోజకవర్గంలో ఆఖరిరోజు 23నామినే షన్లు దాఖలు కావడం విశేషం. అవనిగడ్డలో జనసేనపార్టీ అభ్యర్థి మండలి బుద్ద ప్రసాద్‌ నామినేషన్‌ను దాఖలు చేయగా, స్వతంత్ర అభ్యర్థిగా బోయిన బుద్దప్రసాద్‌ నామినేషన్‌దాఖలు చేశారు. పెడన నియోజకవర్గంలోనూ టీడీపీ అభ్యర్థిగా కాగిత కృష్ణప్రసాద్‌ నామినేషన్‌ను దాఖలుచేయగా ఆయన పేరుతోనే ఉన్న కాగిత శ్రీహరికృష్ణ ప్రసాద్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ను దాఖలు చేశారు.

ఫ అవనిగడ్డ నియోజకవర్గంలో నవరంగ్‌ కాంగ్రె్‌సపార్టీ అభ్యర్థిగా బోయిన బుద్ద ప్రసాద్‌, జనసేనపార్టీ అభ్యర్థిగా మండలి వెంకట్రామ్‌, స్వతంత్ర అభ్యర్థులుగా మత్తి పుష్ఫకుమార్‌, నీలా మనోహర్‌బాబు, జాతీయజనసేన పార్టీ అభ్యర్థిగా వెంట్రప్రగడ అనంద్‌కుమార్‌, వైసీపీ అభ్యర్థిగా సింహాద్రి రమే్‌షబాబు, నవరంగ్‌ కాంగ్రె్‌సపార్టీ అభ్యర్థిగా తాడంకి చంటి నామినేషన్‌లను దాఖలు చేశారు.

ఫ పామర్రు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా కైలే అనిల్‌కుమార్‌, జైభీమ్‌ భారత్‌పార్టీ అభ్యర్థిగా నాయుడు శిరీషారాణి, టీడీపీ అభ్యరిగా వర్ల రామయ్య, వర్ల కుమార్‌రాజా, కాంగ్రె్‌సపార్టీ అభ్యర్థిగా దోవారి యేసుదాస్‌ నామినేషన్‌లను దాఖలు చేశారు.

ఫ పెడన నియోజకవర్గం టీడీపీ అభ్యర్థులుగా కాగిత కృష్ణప్రసాద్‌, కాగిత శిరీష, వైసీపీ అభ్యర్థులుగా ఉప్పాల రమే్‌ష(రాము) ,ఉప్పాల హారిక, యుగతులసి పార్టీ అభ్యర్థిగా కాట్రగడ్డ విష్ణుమూర్తి, స్వతంత్ర అభ్యర్థిగా కాగిత శ్రీహరికృష్ణ ప్రసాద్‌ నామినేషన్‌లను దాఖలు చేశారు.

ఫ గన్నవరం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా గూడపాటి సుధీర్‌కుమార్‌, పొట్లూరి శ్రీదేవి, మాదాసు వరలక్ష్మీ, ఆల్‌ఇండియా పార్వర్డ్‌బ్లాక్‌ అభ్యర్థిగా దొండపాటి ఆనందప్రసాద్‌, వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీమోహన్‌, రిపబ్లికన్‌ పార్టీ అఫ్‌ ఇండియా అభ్యర్థిగా పొట్లూరి రవీంద్రబాబు, టీడీపీ అభ్యర్థులుగా యార్గడ్డ వెంకట్రావ్‌, యార్లగడ్డ జ్ఞానేశ్వరి, జై మహాబారత్‌ పార్టీ అభ్యర్థిగా గూడూరు వెంకట రవికుమార్‌ నామినేషన్‌లను దాఖలు చేశారు.

ఫ మచిలీపట్నం నియోజవర్గం వైసీపీ అభ్యర్థిగా పేర్ని వెంకట్రామయ్య(నాని), టీడీపీ అభ్యర్థులుగా కొల్లు రవీంద్ర, కొల్లు నీలిమ, స్వతంత్ర అభ్యర్థులుగా అంగర చాముండేశ్వరి, చింతపల్లి మనోహర్‌, అమ్మిరెడ్డి శ్రావణి, ఈడే భాస్కరరావు, కాంగ్రె్‌సపార్టీ అభ్యర్థిగా అబ్ధుల్‌ మతీన్‌, భారతచైతన్య యువజనపార్టీ అభ్యర్థిగా కోన నాగార్జున నామినేషన్‌లను దాఖలు చేశారు.

ఫ పెడనమలూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా బోడె ప్రసాద్‌, కాంగ్రె్‌సపార్టీ అభ్యర్థిగా ఎలిశల సుబ్రహ్మణ్యం, భారత్‌ చైతన్య యువజన పార్టీ అభ్యర్థిగా గుర్రాల హరిత, జైభారత్‌ నేఫనల్‌పార్టీ అభ్యర్థిగా లంకా కరుణాకరదాస్‌, స్వతంత్ర అభ్యర్థిగా దొండపాటి సతీష్‌, జాతీయజనసేనపార్టీ అభ్యర్థిగా గుండారు సీతారామయ్య నామినేషన్‌లను దాఖలు చేశారు.

ఫ గుడివాడ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థులుగా వెనిగండ్ల రాము, వెనిగండ్ల రామకృష్ణ, వైసీపీ అభ్యర్థులుగా కొడాలి శ్రీవెంకటేశ్వరరావు, (నాని), కొడాలి నాగేశ్వరరావు (చిన్ని), స్వతంత్ర అభ్యర్థులుగా మెండా శుభకరరావు, దుక్కిపాటి రాధాకృష్ణమూర్తి, ఏల్చూరి వేణుగోపాలరావు, తాళ్లూరి పెద్ద నాగేశ్వరరావు, షేక్‌ కరీముల్లా, కుమ్మరి భావన్‌ నారాయణ, వడ్డాది నాగరాజు, హసన్‌ అహ్మద్‌ అబ్ధుల్‌, కొడాలి వెంకటేశ్వరరావు, నవరంగ్‌ కాంగ్రె్‌సపార్టీ అభ్యర్థిగా పంది నాగార్జున, తెలుగు రాజాధికారసమితిపార్టీ అభ్యర్ధిగా అవుల ప్రవీణ్‌కుమార్‌, జై భారత్‌ నేషనల్‌పార్టీ అభ్యర్థిగా ఆలూరి హేమంత్‌కుమార్‌, కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా శిష్ట్లా దత్తాత్రేయులు, ,జై మహాభారత్‌పార్ట్టీ అభ్యర్థిగా మిట్టపల్లి వెంకట వంశీనరేష్‌ నామినేషన్‌లను దాఖలు చేశారు.

Updated Date - Apr 26 , 2024 | 12:04 AM