Share News

TDP: కేశినేని నానికి ఆయన కుటుంబసభ్యులే మద్దతివ్వడంలేదు: బుద్ధ వెంకన్న

ABN , Publish Date - Apr 28 , 2024 | 11:51 AM

విజయవాడ: కేశినేని నాని‌ని చూసి ఊసర వెల్లి కూడా సిగ్గు పడుతోందని, రాజకీయాల్లో ఎక్కవ రంగులు మార్చిన చరిత్ర కేశినేని నానిదేనని, ప్రజారాజ్యం, టీడీపీలను మోసం చేసిన ఆయన వైసీపీలో చేరి భజనలు చేస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత బుద్ధ వెంకన్న తీవ్ర స్థాయిలో విమర్శించారు.

TDP: కేశినేని నానికి ఆయన కుటుంబసభ్యులే మద్దతివ్వడంలేదు: బుద్ధ వెంకన్న

విజయవాడ: కేశినేని నాని‌ (Kesineni Nani)ని చూసి ఊసర వెల్లి కూడా సిగ్గు పడుతోందని, రాజకీయాల్లో ఎక్కవ రంగులు మార్చిన చరిత్ర కేశినేని నానిదేనని, ప్రజారాజ్యం (Prajarajyam), టీడీపీ (TDP)లను మోసం చేసిన ఆయన వైసీపీ (YCP)లో చేరి భజనలు చేస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత (TDP Senior Leader) బుద్ధ వెంకన్న (Buddha Venkanna) తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ సందర్బంగా ఆదివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. కేశినేని నాని పశ్చిమ నియోజకవర్గంలో పర్యటించి సుజనా చౌదరి 9Sujana Choudary), చంద్రబాబు (Chandrababu)పై నోరు పారేసుకుంటున్నారని, పశ్చిమ నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గం చేస్తామని సుజనా చెప్పారని, అది అర్ధం చేసుకోకుండా ఈ సిగ్గులేని నాని నోటి కొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఆయనకు వాళ్ల అమ్మతో సహా కుటుంబ సభ్యులే మద్దతు ఇవ్వడం లేదన్నారు. సోదరుడు పోటీగా నిలబడితే..చెల్లి కూడా నాని ఛాయలకు రావడంలేదన్నారు. ఎవరి ద్వారా లబ్ది, సాయం పొంది.. వారినే తిట్టడం కుశినేని నాని నైజమని, సుజనా చౌదరి వెనుక క్యారేజీలు పట్టుకుని తిరిగేవారని, సుజనా ద్వారా ఎంత సాయం పొందారో నాని మరచిపోయారేమో.. మేము దగ్గర ఉండి నాని‌ వేషాలన్నీ‌ చూశామని బుద్ధ వెంకన్న అన్నారు.


2014లో వేసిన అఫిడవిట్‌లో శ్రీరామ్ చిట్స్‌కు డబ్బులు ఇవ్వాలని, ఐవోబీకి ముప్పై కోట్లు బకాయిలు చెల్లించాలని, 2024 అఫిడవిట్‌లో కూడా ఇవే అప్పులు రాశారని, పదేళ్ల కాలంగా ఆ అప్పులు ఎందుకు కట్టలేదని కేశినేని నానిని బుద్ధ వెంకన్న ప్రశ్నించారు. డబ్బులు ఎగ్గొట్టినందుకు, కార్మికులును అన్యాయం చేసినందుకు చీటింగ్ కేసు పెట్టాలని, ఈ కేసు విషయం అఫిడవిట్‌లో నాని ఎందుకు రాయలేదని ప్రశ్నించారు. మోసం చేసిన నాని నామినేషన్‌ను తిరస్కరించాలి. ఆస్తులు , అప్పులు రాసిన నాని.. కేసులు ఎందుకు రాలేదని నిలదీశారు. అప్పులు తీసుకుని ఎగ్గొట్టే చరిత్ర నానీదని... ఓ పెద్ద చీటర్ అని, అందుకే చంద్రబాబు మెడ పట్టి బయటకు గెంటేశారని అన్నారు.


‘‘కేశినేని నానీ నీకు దమ్ముంటే, నిజాయితీ ఉంటే... నీ ఆస్తులు అమ్మి అయినా అప్పులు కట్టాలి కదా.. నీ దగ్గర పని చేసే ఉద్యోగులు, కార్మికులకు జీతాలు ఎగ్గొట్టావు వారి కష్టాన్ని దోచుకుని... మేడలు కట్టావు.. సిగ్గు, శరం ఉందా.... నువ్వా క్యారెక్టర్ గురించి మాట్లాడేది.. నీకు డబ్బులు ఇచ్చిన వారికి అప్పులు చెల్లించి అప్పుడు రా... నిజాయితీ ఒప్పుకుంటాం.. దొంగే దొంగ అన్న విధంగా నాని వ్యవహారం ఉంది. చీటింగ్ కేసులు ఉన్న నాని పోటీకి అనర్హుడు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల కష్టంతో కేశినేని నాని ఎంపీ అయ్యాడు. ఏరోజు అయినా పేదలకు నీ సొంత డబ్బులు సాయం చేశావా?.. చంద్రబాబు, సుజనా చౌదరి వెనుక తిరిగిన చరిత్ర మరచిపోవద్దని’’ అన్నారు.


క్యారేజీలు మోసుకెళ్లి పబ్బం గడుపుకున్న నీచుడు నాని అని, ఆయనకు తప్పకుండా ప్రజలు బుద్ధి చరెబుతారని బుద్దా వెంకన్న అన్నారు. అబద్దపు అఫిడవిట్ పెట్టిన నాని.. అసలు పోటీలో లేకుండా చేయాలని, ఆయన బతుకే లాలూచీ బతుకని.. అందరూ అర్ధం చేసుకోవాలని కోరుతున్నామని అన్నారు. సుజనా చౌదరి స్థానికుడు కాదని ప్రచారం చేస్తున్నారని, తాతల కాలం నుంచి సుజనా కుటుంబం విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్నారని, కేశినేని నాని ఇల్లు మచిలీపట్నం పార్లమెంటులో ఉందన్నారు. ఓటమి భయంతో చేతకాని‌వాళ్లే ఇలాంటి అనవసర అంశాలను వివాదం చేసి లబ్ధి పొందుతారని అన్నారు. నానీ రాజకీయంలోకి వచ్చింది ప్రజా సేవ కోసం కాదని... అప్పులోళ్ల నుంచి రక్షించుకునేందుకు ఎంపీ పదవిని అడ్డు పెట్టుకుంటున్నారని బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్: ఓ పబ్‌లో యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఆకతాయిలు

అనంతపురం: ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజారెడ్డి రౌడీయిజం

మూడు రాజధానుల పేరుతో జనం చేతిలో చిప్ప

రాజీనామా లేఖతో రేవంత్‌ రెడ్డి రాలేదేం?

KCR: మోదీకి ఓటేస్తే వినాశనమే

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Apr 28 , 2024 | 11:57 AM