Share News

ఎమ్మెల్యే సింహాద్రి నామినేషన్‌ కార్యక్రమంలో అపశృతి

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:06 AM

అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేశ్‌బాబు నామినేషన్‌ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. సింహాద్రి రమేశ్‌ నామినేషన్‌ వేసేందుకు కార్యకర్తలతో కలిసి లంకమ్మ అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి బాణసంచా కాలుస్తూ ర్యాలీగా నామినేషన్‌ కేంద్రానికి బయలుదేరగా, అవనిగడ్డ జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలోని తెలుగుయువత నేత యాసం వెంకటేశ్వరరావు ఇంటిపైకి నిప్పురవ్వలు పడటంతో ఇల్లు దగ్ధమైంది.

ఎమ్మెల్యే సింహాద్రి నామినేషన్‌ కార్యక్రమంలో అపశృతి
దగ్ధమైన యాసం వెంకటేశ్వరరావు ఇల్లు

అవనిగడ్డ, ఏప్రిల్‌ 25 : అవనిగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేశ్‌బాబు నామినేషన్‌ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. సింహాద్రి రమేశ్‌ నామినేషన్‌ వేసేందుకు కార్యకర్తలతో కలిసి లంకమ్మ అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి బాణసంచా కాలుస్తూ ర్యాలీగా నామినేషన్‌ కేంద్రానికి బయలుదేరగా, అవనిగడ్డ జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలోని తెలుగుయువత నేత యాసం వెంకటేశ్వరరావు ఇంటిపైకి నిప్పురవ్వలు పడటంతో ఇల్లు దగ్ధమైంది. అవనిగడ్డ గురక రేవులోని యాసం వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు కుటుంబాలకు చెందిన ఉమ్మడి ఇంటి విషయమై వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుంచి వివాదం నడుస్తున్నది. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ స్థలంలో బాట వే యాలని వైసీపీ నేతలు పట్టుపట్టడంతో గ్రామపంచాయతీ కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి మరీ బాట వేసేందుకు పలుమార్లు ప్రయత్నించగా, జనవరిలో వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావులు స్టే తీసుకురావటంతో అప్పట్లో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. అయితే జనవరి నెలలో తహసీల్దార్‌ కార్యాలయ, పంచాయతీ సిబ్బంది అక్కడ సర్వే చేసేందుకు ప్రయత్నించగా, దానిని అడ్డుకునే క్రమంలో భావోద్వేగానికి గురైన యాసం శ్రీనివాసరావు అదే రోజు రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. తమను ఖాళీ చేయించలేక ఇలా ఇంటిపైకి తారాజువ్వలను కావాలని వేసి ఇల్లు దగ్ధం కావటానికి వైసీపీ నేతలు కారణమయ్యారని, యాసం వెంకటేశ్వరరావు, దివంగత యాసం శ్రీనివాసరావు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. తారా జువ్వలు ఒకదాని తర్వాత ఒకటి ఇంటిపైకి వచ్చి పడ్డాయని, దీని కారణంగానే తమ ఇల్లు దగ్ధమైందని యాసం శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ తెలిపారు. ఇల్లు దగ్ధమైన సమయంలో ఎమ్మెల్యే చూసి వెనుతిరిగి వెళ్లిపోయాడు కానీ కనీసం ఏం జరిగిందని కూడా అడగలేదని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై అవనిగడ్డ ఎస్‌ఐను వివరణ కోరగా, తారాజువ్వలు వేసిన వ్యక్తిని గుర్తించామని, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సుమారు రూ.9 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్టు యాసం వెంకటేశ్వరరావు తెలిపారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బుద్దప్రసాద్‌

అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన యాసం వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు కుటుంబాలను అవనిగడ్డ జనసేన అభ్యర్థి మండలి బుద్దప్రసాద్‌, ఆయన కుమారుడు వెంకట్రామ్‌లు పరామర్శించారు.

Updated Date - Apr 26 , 2024 | 12:06 AM