Share News

కూటమితోనే రాష్ట్ర పునర్నిర్మాణం

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:06 AM

విధ్వంసకర పాలనతో అన్ని రంగాల్లో అధోగతిపాలైన రాష్ట్ర పునర్నిర్మాణం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోనే సాధ్యమని గన్నవరం టీడీపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. బాపులపాడు మండలం అంపాపురంలో బందరు పార్లమెంట్‌ టీడీపీ కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరితో కలిసి ఆయన శనివారం రాత్రి ప్రచారం నిర్వహించారు. టీడీపీ, జనసేన శ్రేణులతో పాటు ప్రజలు పూలమాలలతో, మంగళహారతులి స్తూ ఘనస్వాగతం పలికారు.

కూటమితోనే రాష్ట్ర పునర్నిర్మాణం
అంపాపురంలో ప్రచారం నిర్వహిస్తున్న గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, బందరు ఎంపీ అభ్యర్థి బాలశౌరి

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌, ఏప్రిల్‌ 27 : విధ్వంసకర పాలనతో అన్ని రంగాల్లో అధోగతిపాలైన రాష్ట్ర పునర్నిర్మాణం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోనే సాధ్యమని గన్నవరం టీడీపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. బాపులపాడు మండలం అంపాపురంలో బందరు పార్లమెంట్‌ టీడీపీ కూటమి అభ్యర్థి వల్లభనేని బాలశౌరితో కలిసి ఆయన శనివారం రాత్రి ప్రచారం నిర్వహించారు. టీడీపీ, జనసేన శ్రేణులతో పాటు ప్రజలు పూలమాలలతో, మంగళహారతులి స్తూ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, వైసీపీ పాలనలో అన్ని వ్యవస్థల విధ్వంసం జరిగిందని, తద్వారాఅన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులెదుర్కొన్నారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రైవేటు ఆస్తులకు కూడా రక్షణ లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలను సకాలంలో అందించాలనే సంకల్పంతోనే కూటమి ముందుకు వెళుతుం దన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా గాడిలో పెట్టాలంటే కేంద్రప్రభుత్వ సహకారం తప్పనిసరి అని, కేంద్ర ప్రాయోజిత పథకాలు, పోలవరం నిర్మాణం లాంటి వాటిని త్వరితగతిన పూర్తి చేస్తూ అభివృద్ధి పథంలో పరుగులు తీయాలంటే ప్రజల మద్దతుతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాల న్నారు. ప్రజలను దోచుకోవడానికి, వేధించేందుకు తాను రాజకీయాల్లోకి రాలేదని ప్రజలకు మేలు చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లేందుకు తాను చేపట్టబోయే పథకాలను ప్రజలకు వివరించారు. నిరుద్యోగ సమస్యను అధిగమించి యువతకు ఉపాధి, ఉద్యోగావకా శాలు కల్పించేలా మల్లవల్లి పారిశ్రామిక వాడను, గన్నవరం లో ఐటీ పార్క్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. అభివృద్ధిపరం గాను, పారిశ్రా మికపరంగా వెనుకబడిపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగే సత్తా చంద్రబాబు నాయు డుకే ఉందన్నారు. అంపాపురంలో తాగునీటి ఎద్దడి తనదృష్టికి వచ్చిందని, ప్రతి ఇంటికీ పరిశుభ్రమైన తాగునీరందేలా చేస్తానని యార్లగడ్డ హామీ ఇచ్చారు.బందరు పోర్టు నిర్మాణం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పనులు ప్రారంభించడం జరిగిందని బాలశౌరితెలి పారు. విమానాశ్రయం, పోర్టులు, రహదారుల వల్లే పారిశ్రామికరంగం, రవాణారంగం అభివృద్ధి చెందు తుందని తద్వారా నిరుద్యోగ సమస్యకు శాశ్వతపరిష్కారంతో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. బందరు పార్ల మెంటు పరిధిలోని నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసి చూపు తాననిబాలశౌరి హామీ ఇచ్చారు. యువత, రాష్ట్రం అభివృద్ధి కోసం ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు పలకాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నియో జకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్‌బాబు,టీడీపీ మండల అధ్యక్షుడు దయాల రాజేశ్వరరావు, జనసేన మం డల అధ్యక్షుడు వడ్డి శివనాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:06 AM