Share News

ఐదేళ్లుగా షాకులు

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:56 PM

బి.సుగుణమ్మ.. కొండప్రాంతంలో నివాసం ఉంటుంది. ఒక నెలలో 166 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించింది. ఈ యూనిట్లకు వచ్చిన మొత్తం బిల్లు రూ.995. ఉపయోగించిన యూనిట్ల వరకు అయితే, మొత్తం రూ.663 బిల్లు రావాలి. అలాకాకుండా, ట్రూ అప్‌ చార్జీలుగా విధించిన మొత్తం రూ.124.96, ఫిక్స్‌డ్‌, కస్టమర్‌ చార్జీలుగా మరో రూ.124.96 కలిపి అదనంగా రూ.331.68 బిల్లులో చూపించారు. ఓ మధ్యతరగతి వినియోగదారురాలికి తగిలిన విద్యుత్‌ షాక్‌ ఇది. బంగారయ్య మూడేళ్ల క్రితం తన ఇంటిని మురళీకృష్ణకు విక్రయించాడు. రిజిస్ట్రేషన్‌ అయ్యాక ఆ ఇంటికి ఉన్న విద్యుత్‌ సర్వీసును బంగారయ్య విద్యుత్‌ శాఖకు అప్పగించేశాడు. తర్వాత మురళీకృష్ణ కొత్త సర్వీసులను తీసుకున్నాడు. బంగారయ్య వినియోగించుకున్న విద్యుత్‌కు సంబంధించిన ట్రూ అప్‌ చార్జీలు చెల్లించాలని లైన్‌మన్‌ కొద్దిరోజుల క్రితం మురళీకృష్ణ ఇంటికి వెళ్లాడు. బంగారయ్య నుంచి తాను ఇంటిని కొన్నానని, సర్వీసులన్నీ తన పేరు మీద ఉన్నాయని మురళీకృష్ణ చెప్పాడు. బంగారయ్య రూ.1,500 బకాయి చెల్లించాలని, అది వెంటనే చెల్లించాలని, లేకపోతే సర్వీసును తొలగిస్తామని హెచ్చరించారు. దీంతో మురళీకృష్ణ షాక్‌ అయ్యాడు. కూలి పని చేసే ఓ వ్యక్తి మొత్తం 50 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించాడు. ఈ మొత్తానికి శ్లాబ్‌ ప్రకారం ఆయన చెల్లించాల్సిన బిల్లు రూ.117. కానీ, రూ.280 బిల్లు చెల్లించాడు. ఇందులో రూ.109.85 కేవలం ట్రూ అప్‌ చార్జీలే. ఇలా.. అధికారంలోకి వచ్చింది మొదలు సీఎం జగన్‌ విద్యుత్‌ వినియోగదారులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే ఉన్నాడు. అసలు చార్జీల కంటే కొసరు చార్జీలను ఎక్కువగా చూపిస్తూ ఈ ఐదేళ్ల కాలంలో జగనన్న ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి దోచుకుంది అక్షరాలా రూ.782 కోట్లు.

ఐదేళ్లుగా షాకులు

ఉమ్మడి కృష్ణాజిల్లాపై విద్యుత్‌ ట్రూ అప్‌ భారం

రూ.782 కోట్లు అదనంగా వసూలు చేసిన జగనన్న

బిల్లులు చూసి లబోదిబోమంటున్న వినియోగదారులు ూ వాడకంతో సమానంగా ట్రూ అప్‌ భారం

బి.సుగుణమ్మ.. కొండప్రాంతంలో నివాసం ఉంటుంది. ఒక నెలలో 166 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించింది. ఈ యూనిట్లకు వచ్చిన మొత్తం బిల్లు రూ.995. ఉపయోగించిన యూనిట్ల వరకు అయితే, మొత్తం రూ.663 బిల్లు రావాలి. అలాకాకుండా, ట్రూ అప్‌ చార్జీలుగా విధించిన మొత్తం రూ.124.96, ఫిక్స్‌డ్‌, కస్టమర్‌ చార్జీలుగా మరో రూ.124.96 కలిపి అదనంగా రూ.331.68 బిల్లులో చూపించారు. ఓ మధ్యతరగతి వినియోగదారురాలికి తగిలిన విద్యుత్‌ షాక్‌ ఇది.

బంగారయ్య మూడేళ్ల క్రితం తన ఇంటిని మురళీకృష్ణకు విక్రయించాడు. రిజిస్ట్రేషన్‌ అయ్యాక ఆ ఇంటికి ఉన్న విద్యుత్‌ సర్వీసును బంగారయ్య విద్యుత్‌ శాఖకు అప్పగించేశాడు. తర్వాత మురళీకృష్ణ కొత్త సర్వీసులను తీసుకున్నాడు. బంగారయ్య వినియోగించుకున్న విద్యుత్‌కు సంబంధించిన ట్రూ అప్‌ చార్జీలు చెల్లించాలని లైన్‌మన్‌ కొద్దిరోజుల క్రితం మురళీకృష్ణ ఇంటికి వెళ్లాడు. బంగారయ్య నుంచి తాను ఇంటిని కొన్నానని, సర్వీసులన్నీ తన పేరు మీద ఉన్నాయని మురళీకృష్ణ చెప్పాడు. బంగారయ్య రూ.1,500 బకాయి చెల్లించాలని, అది వెంటనే చెల్లించాలని, లేకపోతే సర్వీసును తొలగిస్తామని హెచ్చరించారు. దీంతో మురళీకృష్ణ షాక్‌ అయ్యాడు.

కూలి పని చేసే ఓ వ్యక్తి మొత్తం 50 యూనిట్ల విద్యుత్‌ను వినియోగించాడు. ఈ మొత్తానికి శ్లాబ్‌ ప్రకారం ఆయన చెల్లించాల్సిన బిల్లు రూ.117. కానీ, రూ.280 బిల్లు చెల్లించాడు. ఇందులో రూ.109.85 కేవలం ట్రూ అప్‌ చార్జీలే.

ఇలా.. అధికారంలోకి వచ్చింది మొదలు సీఎం జగన్‌ విద్యుత్‌ వినియోగదారులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే ఉన్నాడు. అసలు చార్జీల కంటే కొసరు చార్జీలను ఎక్కువగా చూపిస్తూ ఈ ఐదేళ్ల కాలంలో జగనన్న ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి దోచుకుంది అక్షరాలా రూ.782 కోట్లు.

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : ఒక్క ఛాన్స్‌.. అని అధికారంలోకి వచ్చిన జగన్‌ విద్యుత్‌ వినియోగదారులకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే ఉన్నాడు. 2019లో అధికారం చేపట్టిన ఆయన 2022 నుంచి విద్యుత్‌ రంగంలో ట్రూ అప్‌ను తెరపైకి తెచ్చాడు. ప్రజలు ఎప్పుడో వినియోగించుకున్న విద్యుత్‌కు 2022 నుంచి ట్రూ అప్‌ చార్జీలను వసూలు చేయడం మొదలుపెట్టాడు. అన్ని కేటగిరీల వినియోగదారులపై ఈ భారాలు మోపాడు. వినియోగించుకున్న విద్యుత్‌కు అయిన బిల్లు కంటే.. దానికి విధిస్తున్న చార్జీలు దరిదాపుగా ఉంటున్నాయి. దీంతో వినియోగదారులు అల్లాడిపోతున్నారు.

జిల్లాపై భారం రూ.782 కోట్లు

ఉమ్మడి కృష్ణాలో ట్రూ అప్‌ చార్జీల రూపంలో వినియోగదారుల నుంచి విద్యుత్‌ శాఖ మొత్తం రూ.782 కోట్లు వసూలు చేసింది. 2022, ఆగస్టు నుంచి వసూలు చేసిన ట్రూ అప్‌ చార్జీలు రూ.196 కోట్లు ఉండగా, 2023 ఏప్రిల్‌ నుంచి ఎఫ్‌పీపీసీఏ-1 (ఫ్యూయల్‌ పర్చేజ్‌ చార్జీ ఎరియర్స్‌) కింద రూ.471 కోట్లు, ఎఫ్‌పీపీసీఏ-2 కింద రూ.115 కోట్లు వసూలు చేసింది. 2014-15 నుంచి 2018-19 కాలంలో పంపిణీ సంస్థలకు నష్టాలు వచ్చాయని ఈ ట్రూ అప్‌ చార్జీలను తెరపైకి తెచ్చారు. ప్రతి యూనిట్‌కు 22 పైసలు చొప్పున లెక్కించి బిల్లులో వడ్డిస్తున్నారు. 2022, ఆగస్టు నుంచి మొత్తం 36 నెలల పాటు ఈ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి విద్యుత్‌ సంస్థలు ఎఫ్‌పీపీసీఏ పేరుతో భారం వేయడం మొదలుపెట్టాయి. 2021-22లో ఏ నెలలో వాడిన యూనిట్లను 2023-24లో అదే నెల బిల్లులో సర్దుబాటు చేస్తున్నారు. యూనిట్‌కు 20 పైసల నుంచి 66 పైసల వరకు వినియోగదారులకు వడ్డించారు. మొదటి మూడు నెలల్లో యూనిట్‌కు 20 పైసలు, రెండో త్రైమాసికంలో యూనిట్‌కు 63 పైసలు, మూడో త్రైమాసికంలో 63 పైసలు, చివరి త్రైమాసికంలో యూనిట్‌పై 66 పైసల చొప్పున లెక్కించి ట్రూ అప్‌ విధిస్తున్నారు.

ఇదో కొత్తకోణం

2014-15 నుంచి 2018-19 మధ్యకాలంలో వినియోగించుకున్న విద్యుత్‌కు ట్రూ అప్‌ చార్జీలు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఉన్న విద్యుత్‌ వినియోగదారుల నుంచే కాకుండా ఆ సమయంలో ఇళ్లను విక్రయించుకుని వెళ్లిపోయిన వారినీ వదిలిపెట్టలేదు. వివిధ అవసరాల నిమిత్తం కొంతమంది తమ ఇళ్లను విక్రయించుకుంటారు. మరికొంతమంది స్థలాలను అమ్ముకుంటారు. ఇది నిత్యం జరిగే ప్రక్రియ. సాధారణంగా నిర్మించిన ఇంటిని విక్రయించినప్పుడు ఇల్లు కొనుగోలుదారుల పేరు మీద రిజిస్టర్‌ అవుతుంది. అప్పటికే ఆ ఇంటికి విద్యుత్‌ కనెక్షన్‌ ఉంటే తమ పేరు మీద ఉన్న దస్తావేజులను చూపించి సర్వీసు పేరును కొనుగోలుదారులు మార్చుకుంటారు. కొంతమంది అప్పటికే ఉన్న సర్వీసును విద్యుత్‌ శాఖకు అప్పగించేస్తారు. రిజిస్ట్రేషన్‌ అయ్యాక మరమ్మతులు చేయించుకుని కొత్త విద్యుత్‌ కనెక్షన్లు తీసుకుంటారు. ఇంటి యజమానులు మారినా ఇక్కడ ఇంటి నెంబర్‌ మాత్రం ఒకటే ఉంటుంది. 2014-2019 మధ్య ఇళ్లను విక్రయించుకుని వెళ్లిపోయిన వారు వాడిన విద్యుత్‌కు ట్రూ అప్‌ చార్జీలను చెల్లించాలని ప్రస్తుతం ఉంటున్న వారిపై విద్యుత్‌ శాఖ సిబ్బంది ఒత్తిడి తెస్తున్నారు. తాము ముందున్న సర్వీసును ఇచ్చేసి, కొత్తగా తీసుకున్నామని చెబుతున్నా వినడం లేదు. యజమానులు మారినా ఇంటి నెంబరు అప్పుడు, ఇప్పుడు ఒకటే కదా అని చెబుతున్నారు. ఆ బకాయుని చెల్లించకపోతే ఉన్న సర్వీసును తొలగించడం గానీ, ఈ సర్వీసుకు వచ్చే బిల్లులో ఆ మొత్తాన్ని కలపడం గానీ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఆదాయం కోసం జగన్‌ ప్రభుత్వం అన్ని అడ్డదారులు తొక్కుతోందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:56 PM