Share News

TDP: కర్నూలు జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన

ABN , Publish Date - Apr 28 , 2024 | 08:32 AM

కర్నూలు జిల్లా: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రాలయం, కొడుమూరు సెగ్మెంట్‌లో ప్రజాగళం నిర్వహిస్తారు. అలాగే కౌతాలం, గూడూరు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.

TDP: కర్నూలు జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన

కర్నూలు జిల్లా: సార్వత్రిక ఎన్నికల ప్రచారం (Election Campaign0లో భాగంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఆదివారం కర్నూలు జిల్లా (Kurnool Dist.)లో పర్యటించనున్నారు. మంత్రాలయం (Mantralayam), కొడుమూరు (Kodumuru) సెగ్మెంట్‌లో ప్రజాగళం (Prajagalam) నిర్వహిస్తారు. అలాగే కౌతాలం, గూడూరు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ రోజు సాయంత్రం 3.50 గంటలకు నెల్లూరు నుంచి కౌతాలంకు వస్తారు. రాత్రి గూడూరులోనే చంద్రబాబు బస చేస్తారు.


కాగా చంద్రబాబు నాయుడు సోమవారం నందికొట్కూరులో పర్యటించనున్నారని ఆ పార్టీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు. శనివారం అల్లూరు గ్రామ సమీపంలో హెలిప్యాడ్‌ స్థలాన్ని మాండ్ర శివానందరెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు పరిశీలించారు. అనంతరం మాండ్ర శివానందరెడ్డి మాట్లాడుతూ సోమవారం సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు హెలికాప్టర్‌లో అల్లూరు గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారని, అక్కడి నుంచి నందికొట్కూరు అల్లూరు సర్కిల్‌, కొత్త బస్టాండ్‌ మీదుగా పటేల్‌ సెంటర్‌ వరకు రోడ్డు షో, పటేల్‌ సెంటర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారన్నారు. అనంతరం అల్లూరు గ్రామం వద్ద బస చేస్తారన్నారు. 30వ తేదీ ఉదయం అక్కడి నుంచి బయలుదేరతారని ఆయన తెలిపారు. హెలిప్యాడ్‌ ప్రదేశాన్ని పరిశీలించిన వారిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిత్తా జయసూర్య, నియోజకవర్గ పరిశీలకుడు శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ వీరం ప్రసాద్‌రెడ్డి ఉన్నారు.


రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలనను అంతమొంది ద్దామని డోన్‌ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వై.నాగేశ్వర రావు యాదవ్‌, వలసల రామక్రిష్ణ, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ టీఈ కేశన్నగౌడు, బీజేపీ నాయకులు వడ్డె మహారాజ్‌, జనసేన నాయకులు ఆలా మోహన్‌ రెడ్డిలతో కలిసి ఎన్డీయే చార్జిషీట్‌ బుక్‌లెట్‌ను కోట్ల విడుదల చేశారు. ఈ సందర్భంగా కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి మాట్లాడుతూ ధరలు, పన్నులు, చార్జిలు, అప్పుల బాదుడుతో ఒక్కో కుటుంబంపై రూ.10లక్షల భారం మోపిన ఘనత సీఎం జగన్‌కే దక్కింద న్నారు. ల్యాండ్‌, ఇసుక, మైనింగ్‌, గంజాయి, డ్రగ్స్‌తోపాటు రేషన్‌ బియ్యంలో రూ.8 లక్షల కోట్లు వైసీపీ కొట్టేసిందని ఆరోపించారు. కల్తీ మద్యాన్ని విక్రయించి రాష్ట్రంలో 35 లక్షల మంది ఆరోగ్యాలను పాడు చేసి 30వేల మంది మహిళల తాళిబొట్లను వైసీపీ పాలకులు తెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని జగన్‌ మాట ఇచ్చి నేరుగా ప్రభుత్వమే రూ.లక్ష కోట్ల మద్యం అమ్మి దోచుకోవడం దారుణమన్నారు. వైసీపీ మేనిఫెస్టో హామీ లు 99 శాతం అమలు చేశామని జగన్‌ అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. ఇసుక ధరలు నాలుగు రెట్లు పెంచి భవన నిర్మాణ కార్మికులు 40 లక్షల మంది కడుపు కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పది సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచి రూ.75వేల కోట్లు ప్రజలపై భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పెద్దిరెడ్డి అనుచరుల దాడులు దౌర్జన్యాలు..

మూడు రాజధానుల పేరుతో జనం చేతిలో చిప్ప

రాజీనామా లేఖతో రేవంత్‌ రెడ్డి రాలేదేం?

KCR: మోదీకి ఓటేస్తే వినాశనమే

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Apr 28 , 2024 | 08:40 AM