Share News

‘ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించండి’

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:35 PM

సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కట్టు దిట్టమైన చర్యలు తీసుకొని ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కర్నూలు రేంచి డీఐజీ సీహెచ్‌ విజయరామారావు పోలీసు అధికారులను ఆదేశించారు.

‘ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించండి’

నంద్యాల, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కట్టు దిట్టమైన చర్యలు తీసుకొని ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని కర్నూలు రేంజి డీఐజీ సీహెచ్‌ విజయరామారావు పోలీసు అధికారులను ఆదేశించారు. ఆళ్లగడ్డ డీఎస్పీ కార్యాల యంలో గురువారం ఎన్నికల పోలీస్‌ ప్రత్యేక అధికారి హిమాన్స్‌ శంకర్‌ త్రివేది సమక్షంలో ఆళ్లగడ్డ, బనగానపల్లె నియోజకవర్గాల పోలీసు అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా ఆళ్లగడ్డ పట్టణంలో సమస్యాత్మక పోలీంగు స్టేషన్లను, స్ర్టాంగ్‌ రూమ్‌లను పరిశీలించారు. ఎన్నికల్లో గొడవలు, అల్లర్లు జరుగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ర్యాలీలు, మీటింగులలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లఘించిన వారిపై నమోదు చేసిన కేసుల వివరాలను, సమస్యాత్మక గ్రామాల్లో శాంతిభద్రలకు విఘాతం కల్గకుండా తీసుకున్న చర్యల వివరాలను, పోలీసు కవాతు వివరాలను, ఎంతమందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశారన్న వివరాలను సమీక్షా సమావేశంలో చర్చించారు. నంద్యాల ఎస్పీ రఘు వీర్‌రెడ్డి, ఆళ్లగడ్డ డీఎస్పీ షర్ఫుద్దీన్‌, సీఐలు రమేష్‌బాబు, హను మంతనాయక్‌, ఎస్‌ఐలు ఉన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:35 PM