Share News

విధుల్లో నిర్లక్ష్యం వద్దు: డీఎంహెచ్‌వో

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:12 AM

వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంటకరమణ ఆదేశించారు.

విధుల్లో నిర్లక్ష్యం వద్దు: డీఎంహెచ్‌వో
బండిఆత్మకూరులో రికార్డును పరిశీలిస్తున్న డీఎంహెచ్‌వో

బండిఆత్మకూరు, మార్చి 27: వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంటకరమణ ఆదేశించారు. బుధవారం కాకనూరు, సంతజూటూరు గ్రామాల్లో ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కాకనూరులో బోదకాలు వ్యక్తికి కిట్‌ను ఆయన అందజేశారు. అనంతరం బండిఆత్మకూరు పీహెచ్‌సీని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ల్యాబ్‌, రోగుల వార్డు, కాన్పుల వార్డును పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్లు కిరణ్‌కుమార్‌, యశోద, సూపర్‌వైజర్‌ వెంకటశివన్న, సుబ్రమణ్యం, యశోద, వెంకట సుబ్బమ్మ, వీరమ్మ పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:12 AM