Share News

ముగిసిన నామినేషన్ల ఘట్టం

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:44 PM

ఎన్నికల్లో ప్రధానమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది.

ముగిసిన నామినేషన్ల ఘట్టం

184 మంది అభ్యర్థులు.. 282 నామినేషన్లు

ఎంపీకి 41.. ఎమ్మెల్యేలకు 241..

ఆఖరి రోజు 97 దాఖలు

కర్నూలు, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ప్రధానమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. కర్నూలు పార్లమెంట్‌ స్థానం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టరు డాక్టర్‌ జి.సృజన, అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్‌ఓలు ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్లను స్వీకరించారు. గురువారం సాయంత్రం 3 గంటలకు ఆ ఘట్టానికి తెర పడింది. కర్నూలు పార్లమెంట్‌ సహా కర్నూలు, కోడుమూరు (ఎస్సీ), ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 184 మంది అభ్యర్థులు 282 నామినేష్లు దాఖాలు చేశారు. చివరి రోజు గురువారం అత్యధికంగా 97 నామినేషన్లు వచ్చాయి. ఎంపీ స్థానానికి టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, వైసీపీ అభ్యర్థి బీవై రామయ్య సహా 41 మంది అభ్యర్థులు 56 నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి టీడీపీ అభ్యర్థులు టీజీ భరత్‌, బొగ్గుల దస్తగిరి, బీవీ జయనాగేశ్వరెడ్డి, మాధవరం ఎన్‌.రాఘవేంద్రరెడ్డి, వీరభద్రగౌడ్‌, కేఈ శ్యాంబాబు, గౌరు చరిత, బీజీపీ అభ్యర్థి డాక్టర్‌ పార్థసారథి సహా 157 మంది అభ్యర్థులు 241 నామినేషన్లు దాఖాలు చేశారు. నేడు (26వ తేదీ) నామినేషన్ల పరిశీలన ఉంటుంది. దీంతో అభ్యర్థుల్లో ఉత్కంఠత నెలకొంది. 29వ తేదీ నామినేషన్ల ఉప సంహరణకు ఆఖరు గడువు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు బరిలో నిలిచేవారి జాబితా తేలనుంది.

నామినేషన్లు, అభ్యర్థులు

నియోజకవర్గం నామినేషన్లు అభ్యర్థులు

కర్నూలు పార్లమెంట్‌ 41 27

కర్నూలు అసెంబ్లీ 56 41

కోడుమూరు (ఎస్సీ) 31 21

ఎమ్మిగనూరు 28 16

మంత్రాలయం 17 12

ఆదోని 23 16

ఆలూరు 25 15

పత్తికొండ 24 14

పాణ్యం 37 23

మొత్తం 282 184

Updated Date - Apr 25 , 2024 | 11:44 PM