Share News

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల తనిఖీ

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:10 AM

నంద్యాల జిల్లా కేంద్రంలోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల ప్రత్యేక పోలీసు పరిశీలనాధికారి హిమాన్షు శంకర్‌ త్రివేది శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల తనిఖీ

నంద్యాల క్రైం ఏప్రిల్‌ 27 : నంద్యాల జిల్లా కేంద్రంలోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల ప్రత్యేక పోలీసు పరిశీలనాధికారి హిమాన్షు శంకర్‌ త్రివేది శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలో ఎస్పీ కె.రఘువీర్‌రెడ్డి, స్థానిక పోలీస్‌ అధికారులు, కేంద్ర సాయుధ బలగాలతో కలిసి ఆయన కవాతు నిర్వహించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలైన దళితవాడ అప్పర్‌ప్రైమరీ గాంధీజీ పురపాలక పాఠశాల, గుర్రాలపేట మున్సిపల్‌ హైస్కూల్‌ కేంద్రాలను వారు స్వయంగా పరిశీలించారు.

స్ట్రాంగ్‌ రూమ్‌ల పరిశీలన

పాణ్యం: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం ఈవీఎంలను భద్రపరచే స్ట్రాంగ్‌ రూమ్‌లను శనివారం ఎన్నికల ప్రత్యేక పరిశీలనాధికారులు ఎ. దినేష్‌కుమార్‌, హిమాన్షు శంకర్‌ త్రివేది, ఎస్పీ రఘువీర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఆర్‌జీఎం కాలేజీలోని స్ట్రాంగ్‌రూమ్‌లు, శాంతిరామ్‌ ఇంజనీరింగ్‌, ఫార్మసీ కాలేజీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రత్యేక పరిశీలనాధికారిగా నియమితులైన ఎ.దినేష్‌కుమార్‌ను నంద్యాల ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఎస్పీ కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చారు.

Updated Date - Apr 28 , 2024 | 12:10 AM