Share News

జగన్‌ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత: గౌరు

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:09 AM

జగన్‌ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని టీడీపీ నాయకుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు.

జగన్‌ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత: గౌరు
పాణ్యంలోని టీడీపీ కార్యాలయంలో మాట్లాడుతున్న గౌరు వెంకటరెడ్డి

పాణ్యం, ఏప్రిల్‌ 27: జగన్‌ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని టీడీపీ నాయకుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు విసుగెత్తి టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. ఇసుక దొరకక భవన నిర్మాణ కార్మికులు, పెయింటర్లు, ట్రాక్టరు యజమానులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ఆర్టీసీ చార్జీలు రెండింతలు పెరిగాయన్నారు. నిత్యావసర ధరల నియంత్రణలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఉద్యోగులకు సరైన సమయానికి జీతాలు అందించకపోగా కక్ష సాధింపు చర్యలు చేపట్టడంపై ఉద్యోగ రంగాలు ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు. గ్రామాలలో అభివృద్ది పేరిట నిర్మాణాలు సాగించిన సచివాలయాలు, ఆర్బీకే, ఆరోగ్య, తదితర నిర్మాణాలకు ఇప్పటి వరకు నిధులు అందిచకపోవడంతో నిర్మాణాలు చేపట్టిన అభాగ్యులు అప్పులపాలై కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నిర్మించిన టిడ్కో గృహాలను తన ఖాతాలో వేసుకొని తనే ఇంటి నిర్మాణాలు సాగించినట్లు జగన్‌ పత్రికలో ప్రచారాలు చేసుకోవ డంపై ప్రజలు నవ్వుకుంటున్నార న్నారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో జగనన్న కాలనీలు ప్రారంభమే కాలేదన్నారు. ఎక్కడ అభివృద్ధి జరిగిందో వైసీపీ నియోజక వర్గ ప్రజాప్రతినిఽధులు తెలపాలని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పాణ్యం నుంచి పోటీ చస్తున్న గౌరు చరిత, పార్లమెంట్‌ కు నంద్యాల నుంచి పోటీ చేస్తున్న బైరెడ్డి శబరిని గెలిపించాలని కోరారు. టీడీపీ మండల కన్వీనర్‌ జయరామిరెడ్డి, ఎంపీటీసీ రంగరమేష్‌, జిల్లా కార్యదర్శి రమణమూర్తి, నాయకులు గోవర్ధన్‌రెడ్డి, హనుమంతరెడ్డి, నాగేశ్వరరెడ్డి, మహబూబ్‌బాషా, మనోహర్‌రెడ్డ, మోహన్‌రెడ్డి, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:09 AM