Share News

ఉర్దూ యూనివర్సిటీని గాలికొదిలేసిన ప్రభుత్వం

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:37 AM

ఉర్దూ యూనివర్సిటీని వైసీపీ ప్రభుత్వం గాలికొది లేసిందని టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ అన్నారు.

ఉర్దూ యూనివర్సిటీని గాలికొదిలేసిన ప్రభుత్వం

నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌

ఓర్వకల్లు, మార్చి 27: ఉర్దూ యూనివర్సిటీని వైసీపీ ప్రభుత్వం గాలికొది లేసిందని టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ అన్నారు. బుధవారం మండలంలోని ఓర్వకల్లు గ్రామ సమీపంలోని డా.అబ్దుల్‌ హక్‌ ఉర్దూ యూనివర్సిటీని రాజశేఖర్‌తోపాటు నాయకులు, కార్యకర్తలు పరిశీలించారు. ఈ సందర్భంగా మల్లెల రాజశేఖర్‌ మాట్లా డుతూ ఉర్దూ వర్సిటీని పశువుల కోసం పెట్టిన యూనివర్సిటీగా వైసీపీ తయారు చేసిందని ఆరోపిం చారు. నాటి సీఎం చంద్రబాబు హయాంలో 144 ఎకరాల్లో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ అందుకోసం మొదటి విడత కింద రూ.18 కోట్లు విడుదల చేశారన్నారు. అయితే వైసీపీ అధికా రంలోకి వచ్చాక ఉర్దూ యూనివర్సిటీకి ఒక్క ఇటుక కూడా వేయలేదని, మధ్యలోనే పనులు నిలిచిపోయాయన్నారు. దాదాపు నాలుగున్నర సంవ త్సరాల నుంచి ఈ యూనివర్సిటీని పట్టించుకునే నాథుడే కరువ య్యారన్నారు. ముస్లింలకు టీడీపీ హయాంలో జరిగిన మేలు ఈ వైసీపీ లో జరగలేదన్నారు. టీడీపీ హయాంలో పేద ముస్లిం పిల్లల పెళ్లిళ్ల కోసం షాదీతోపా పేరుతో రూ.లక్ష, ముస్లిం యువత ఉపాధి కోసం రూ.3 లక్ష లు ఇవ్వడమే కాకుండా అందులో రూ.లక్ష సబ్సిడీ ఇచ్చారని అన్నారు. చంద్రబాబు హయాంలో ఓర్వకల్లులో విమానాశ్రయం, ఉక్కు పరిశ్రమ, ఆయుధాల పరి శ్రమ, సోలార్‌ వంటి పరిశ్రమలు తీసుకువచ్చి ఉపాధి అవకాశాలు కల్పించార న్నారు. ఎన్నికల ముందు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏమి అభివృద్ధి చేశారని సీఎం జగన్‌ పర్యటిస్తున్నారని, ఆయనకు పర్యటించే అర్హత లేదన్నారు. కార్యక్ర మంలో టీడీపీ మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి, నాయకులు మహబూబ్‌బాషా, సుధాకర్‌, వడ్డే నారాయణ, రామగోవిందు, అన్వర్‌బాషా, కేవీ మధు, బజారు, జయక్రిష్ణ, కాటినేని నారాయణ పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:37 AM