Share News

సైకతంతో స్వీప్‌

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:40 PM

‘నా ఓటును అమ్ముకొను.. నిజాయితీగా ఓటు వేస్తాననే’ నినాదంతో ఎన్నికల సంఘం వినూత్నంగా అవగాహనకు శ్రీకారం చుట్టింది. ఒంగోలులోని ఆర్డీవో కార్యాలయం వద్ద ఇసుకపై ఓటును అమ్ముకోనంటూ ప్రచారం చేపట్టారు.

సైకతంతో స్వీప్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 25: ‘నా ఓటును అమ్ముకొను.. నిజాయితీగా ఓటు వేస్తాననే’ నినాదంతో ఎన్నికల సంఘం వినూత్నంగా అవగాహనకు శ్రీకారం చుట్టింది. ఒంగోలులోని ఆర్డీవో కార్యాలయం వద్ద ఇసుకపై ఓటును అమ్ముకోనంటూ ప్రచారం చేపట్టారు. వచ్చేనెల 13వతేదీన జరిగే పోలింగ్‌లో ప్రతి ఒక్కరు నిజాయితీగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ ప్రాంతంలో తిరిగే ప్రజానీకం సెల్‌ఫోన్లలో ఫొటోలు తీసుకున్నారు. ఓటుకు ఎంత విలువ ఉందో ప్రతి ఒక్కరికీ అర్థమయ్యే రీతిలో ఉందని సైకత శిల్పులను ప్రశంసించారు. విజయవాడుకు చెందిన బాలాజీ వరప్రసాద్‌ను ఈ సైకతాన్నితీర్చిదిద్దారు.

Updated Date - Apr 25 , 2024 | 11:40 PM