Share News

ఎస్సీ, బీసీల పథకాలకు కోత- అభివృద్ధికి వాత

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:41 PM

ఒక్కసారి అవకాశం కావాలని అడిగిన సీఎం జగన్‌ ఎస్సీ, బీసీ సంక్షేమ పథకాలకు పూర్తిగా కోతేసి, రాష్ట్రాభివృద్ధికి వాతేశాడని కొండపి ఎమ్మెల్యే, కూటమి బలపరుస్తున్న టీడీపీ కొండపి నియోజకవర్గ అభ్యర్థి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వామి శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు మండలంలోని చిర్రికూరపాడు, నర్సింగోలు, రామచంద్రాపురం, పైడిపాడు, అక్కచెరువుపాలెం, రెడ్డిపాలెం, చతుకుపాడు, కామేపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

ఎస్సీ, బీసీల పథకాలకు కోత- అభివృద్ధికి వాత
చిర్రికూరపాడులో ఓటర్లను అభ్యర్థిస్తున్న స్వామి

ప్రచారంలో అడుగడుగునా స్పందన

30 కుటుంబాలు టీడీపీలో చేరిక

జరుగుమల్లి (కొండపి), ఏప్రిల్‌27: ఒక్కసారి అవకాశం కావాలని అడిగిన సీఎం జగన్‌ ఎస్సీ, బీసీ సంక్షేమ పథకాలకు పూర్తిగా కోతేసి, రాష్ట్రాభివృద్ధికి వాతేశాడని కొండపి ఎమ్మెల్యే, కూటమి బలపరుస్తున్న టీడీపీ కొండపి నియోజకవర్గ అభ్యర్థి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్వామి శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు మండలంలోని చిర్రికూరపాడు, నర్సింగోలు, రామచంద్రాపురం, పైడిపాడు, అక్కచెరువుపాలెం, రెడ్డిపాలెం, చతుకుపాడు, కామేపల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా స్వామి ప్రచార వాహనంపై నుంచి మాట్లాడుతూ వందకు పైగా ఎస్సీ సంక్షేమ పథకాలను వైసీపీప్రభుత్వం రద్దు చేసిందని విమర్శించారు. మునుపెన్నడూ లేని విధంగా బీసీలు, మైనార్టీలపై వైసీపీ ప్రభుత్వంలో దాడులు పెరిగాయని స్వామి విమర్శించారు. అదేవిధంగా వైసీపీ ఐదేళ్ల పాలనలో గ్రామాలను పాడుబెట్టేశారని, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు, మహిళా, బీసీ, ఎస్సీ, మైనార్టీల సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయని స్వామి అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని స్వామి అన్నారు. కొండపి నియోజకవర్గ అభివృద్ధిలో పెద్దాయన దామచర్ల ఆంజనేయులు పాత్ర ఎనలేనిదన్నారు. ఆయన చూపిన మార్గంలో కొండపి అభివృద్ధిని తాను కొనసాగిస్తున్నానని స్వామి అన్నారు.

భారీ చేరికలు...

ఎన్నికల ప్రచారంలో స్వామి సమక్షంలో పలు గ్రామాల నుంచి భారీగా వైసీపీని వీడి ప్రజలు చేరారు. చిర్రికూరపాడు, నర్సింగోలు, రామచంద్రాపురం గ్రామాల్లో 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. స్వామి వారందరికీ పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. నర్సింగోలు గ్రామంలో గోన లాబాను, గోన సుశీల, పాలేటి రూబెన్‌, పాలేటి ఆమోస్‌, ఎండ్లూరి నాగరాజు, ఏజర్ల వెంకటేశ్వర్లు కుటుంబాలతోపాటు మరో పది కుటుంబాల వారు, రామచంద్రాపురంలో నేతి రామకృష్ణ, నేతి నారాయణ, నేతి రవిబాబు, మాదినేని జనార్దన్‌, మాదినేని నరిసింహారావు, తొట్టెంపూడి హరిబాబు, చెన్నారెడ్డి చిన్న నరసింహం, తొట్టెంపూడి మధులతోపాటు 15 కుటుంబాలు పార్టీలో చేరాయి. ప్రచారంలో భాగంగా చిర్రికూరపాడులోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి స్వామి పూలమాల వేసి నివాళులర్పించారు. పలు గ్రామాల్లోని దివంగత ఎన్టీఆర్‌, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రచార కార్యక్రమంలో జనసేన నాయకులు కనపర్తి మనోజ్‌కుమార్‌, గూడా శశిభూషణ్‌, బీజేపీ నాయకుడు బాలకోటయ్య, పార్టీ మండల అధ్యక్షుడు పోకూరి రవీంద్రబాబు, టీడీపీ సీనియర్‌ నాయకుడు పోటు పెదబాబు, మాజీ ఎంపీపీలు పేముల విజయనిర్మల, దాసరి వెంకటేశ్వర్లు, నాయకులు నంబూరి వీరరాఘవులు, గొర్రెపాటి మాధవ, రామారావు, గుండపనేని వెంకటేశ్వర్లు, ఆరికట్ల రమణయ్య, పాతూరి కోటేశ్వరరావు, రావి నాగేశ్వరరావు, కొమ్మాలపాటి కృష్ణ, కామేపల్లి మాజీ సర్పంచ్‌ ఏలూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:41 PM