Share News

చంద్రబాబు సీఎం అయితేనే అభివృద్ధి

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:00 AM

చంద్రబాబు సీఎం అయితేనే అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని కొండపి ఎమ్మెల్యే, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం పొన్నలూరు మండలంలోని పెదవెంకన్నపాలెం, విప్పగుంట, చౌటపాలెం, లింగంగుంట, మాలెపాడు, మూలెవారిపాలెం, తిమ్మపాలెం, శివన్నపాలెం, చెరువుకొమ్ముపాలెం, అగ్రహారం, భోగనంపాడు, రాజోలుపాడు, కొత్తపాలెం గ్రామాల్లో స్వామి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

 చంద్రబాబు సీఎం అయితేనే అభివృద్ధి
చౌటపాలెంలో ప్రచార రథంపై నుంచి మాట్లాడుతున్న స్వామి

ఎండలను లెక్క చేయకుండా ప్రచారం

అడుగడుగునా మహిళల నీరాజనం

భారీగా పార్టీలోకి చేరికలు

పొన్నలూరు (కొండపి), ఏప్రిల్‌ 25: చంద్రబాబు సీఎం అయితేనే అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతుందని కొండపి ఎమ్మెల్యే, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారం పొన్నలూరు మండలంలోని పెదవెంకన్నపాలెం, విప్పగుంట, చౌటపాలెం, లింగంగుంట, మాలెపాడు, మూలెవారిపాలెం, తిమ్మపాలెం, శివన్నపాలెం, చెరువుకొమ్ముపాలెం, అగ్రహారం, భోగనంపాడు, రాజోలుపాడు, కొత్తపాలెం గ్రామాల్లో స్వామి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా స్వామి ప్రచార రథంపై నుంచి మాట్లాడుతూ ప్రధానంగా నియోజకవర్గంలో వెనుకబడిన ప్రాంతమైన పొన్నలూరు మండలాన్ని టీడీపీ పాలనలో అభివృద్ధి చేశామన్నారు. మండలంలోని అన్ని మారుమూల గ్రామాలకు రోడ్లు వేసుకున్నామని, ఇది చంద్రబాబు విజన్‌తోనే సాధ్యమైందన్నారు. పలు గ్రామాలకు తారు రోడ్లు, సీసీ రోడ్లు ఏర్పాటు చేసుకోవడంలో అప్పటి మంత్రి నారా లోకేష్‌ సహకారం పూర్తిగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముమ్మరంగా కొనసాగుతాయన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడిగిన జగన్‌ రాష్ట్రంలో అభివృద్ధిని నాశనం చేసి అక్రమంగా కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడన్నారు. మరోసారి ఓటేస్తే పూర్తిగా రాష్ట్రం నాశనం అవుతుందన్నారు. ప్రజలు చంద్రబాబుకు ఓటేసి జగన్‌ అవినీతి పాలనకు స్వస్తి పలకాలన్నారు. చంద్రబాబు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు వసతి, ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు, నెలకు 15 వందల రూపాయల భృతి, తల్లికి వందనంతో ఇంటిలోని ప్రతి చదువుకునే బిడ్డకు 15వేల రూపాయలు అందిస్తామని మేనిఫెస్టోలో చెప్పిన విషయాలను స్వామి గుర్తు చేశారు. రైతులకు ఏడాదికి పెట్టుబడి కింద 20 వేల రూపాయలు సాయం, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం ఏర్పాటు, ఎస్సీల సంక్షేమం కోసం పలు పథకాలు, సబ్‌ ప్లాన్‌ నిధులు వారికే ఖర్చు చేస్తామన్నారు. ఇంటింటికి తాగునీటి వసతి కల్పించడం జరుగుతుందని స్వామి ఈసందర్భంగా హామీనిచ్చారు.

వైసీపీని వీడి 50 మంది చేరిక...

స్వామి ప్రచారం సందర్భంగా విప్పగుంట గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన వైసీపీ కార్యకర్తలు గుడిపల్లి కోటయ్య, గుడిపల్లి మాచర్ల, గుడిపల్లి మాలకొండయ్య, దుద్దెల వెంకటయ్య, కొమర రాము, కొమర వెంకటరత్నం, కొమర శ్రీను, పంది రమణయ్య, గుడిపల్లి రమణమ్మ, కొండలరావు, పరుచూరి బ్రహ్మయ్య, కొమర బ్రహ్మయ్య టీడీపీలో చేరారు. వారందరికి స్వామి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ వారికి అండగా నిలుస్తుందని స్వామి ఈసందర్భంగా హామీనిచ్చారు. అదేవిధంగా ఇదేగ్రామానికి చెందిన చొప్పర కోటయ్య, దార్ల మాధవరావు, చొప్పర మల్లికార్జున పార్టీలో చేరారు.

మహిళల అఖండ స్వాగతం...

ఎన్నికల ప్రచారం సందర్భంగా గ్రామాల్లోకి స్వామికి మహిళలు పూలు చల్లుతూ, గుమ్మడికాయలతో దిష్టితీస్తూ, కర్పూర హారతులిచ్చి అఖండ స్వాగతం పలికారు. పగటి వేళ ఎండ తీవ్రత అధికంగా ఉన్నా యువకులు స్వామి ప్రచార రథం వెంట మోటార్‌ సైకిళ్లపై వెంట నడిచారు. స్వామి కూడా ఎండను లెక్కచేయక ప్రజల్లో మమేక మవుతూ, వారి సమస్యలు వింటూ హామీలనిస్తూ ప్రచారం సాగించారు. ప్రచార కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు అనుమోలు సాంబశివరావు, మాజీ ఎంపీపీ కొండ్రగుంట శ్రీనివాసరావు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్‌కుమార్‌, టీడీపీ నాయకులు మండవ ప్రసాద్‌, కర్ణా కోటిరెడ్డి, అనుమోలు సుధాకర్‌, గుమ్మళ్ల వెంకటరావు, గ్రామాల నాయకులు ఉన్నం కొండలరావు, ఉన్నం వెంకటేశ్వర్లు, ఘట్టమనేని సుబ్బారావు, మన్నెం వెంకటేశ్వర్లు, బండారు మాల్యాద్రి, జనసేన మండల కన్వీనర్‌ పిల్లిపోగు పీటర్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 12:00 AM