Share News

టీడీపీలో నామినేషన్‌ల జోష్‌

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:57 PM

నామినేషన్ల కార్యక్రమం దిగ్విజయం కావడంతో టీడీపీలో జోష్‌ పెరిగింది. ఉమ్మడి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ ఆపార్టీ అభ్యర్థుల అంచనాలకు మించి కార్యక్రమాలకు కూటమి శ్రేణులు, ప్రజానీకం తరలివచ్చారు.

టీడీపీలో నామినేషన్‌ల జోష్‌

తొమ్మిది చోట్ల అధికంగా హాజరు

మూడుచోట్ల పోటాపోటీ

పోటెత్తిన తూర్పుప్రాంతం

పశ్చిమంలో ఊరూవాడా కదిలింది

వైసీపీ కార్యక్రమాలు వెలవెల

బిత్తరపోయి వైపాలెంలో రెచ్చిపోయిన వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

నామినేషన్ల కార్యక్రమం దిగ్విజయం కావడంతో టీడీపీలో జోష్‌ పెరిగింది. ఉమ్మడి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ ఆపార్టీ అభ్యర్థుల అంచనాలకు మించి కార్యక్రమాలకు కూటమి శ్రేణులు, ప్రజానీకం తరలివచ్చారు. పశ్చిమ ప్రాంతంలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమాలు దిగ్విజయం కావడంతో వైసీపీ నేతల్లో అంతర్మథనం ప్రారంభమైంది. జిల్లాలోని తూర్పుప్రాంత నియోజకవర్గాల్లో అయితే టీడీపీ నామినేషన్లకు జనం పోటెత్తారు. అధికార వైసీపీకి బలమైనదిగా భావిస్తున్న పశ్చిమ ప్రాంతంలో అన్నిచోట్లా టీడీపీ కార్యక్రమాలకే ప్రజలు ఎక్కువగా వచ్చారు. గిద్దలూరులో వైసీపీ అభ్యర్థి ముందుగా నామినేషన్‌ వేయగా, కార్యక్రమానికి ఐదు నుంచి ఆరు వేలమంది మాత్రమే హాజరయ్యారు. టీడీపీ కూటమి అభ్యర్థి బుధవారం నామినేషన్‌ వేయగా నికరంగా 30 వేల మంది హాజరయ్యారు. మార్కా పురంలో వైసీపీ అభ్యర్థి నామినేషన్‌ కార్యక్రమానికన్నా టీడీపీ కూటమి అభ్యర్థి నారాయణరెడ్డి నామినేషన్‌కు మూడింతలు జనం అధికంగా హాజరయ్యారు. ర్యాలీ అనంతరం సభ వద్దే 17వేల మందిపైనే నిల్చొని నారాయణరెడ్డి ప్రసంగాన్ని విన్నట్లు అంచనా. వైపాలెంలో కూటమి అభ్యర్థి ఎరిక్షన్‌బాబు నామినేషన్‌కు జనం పోటెత్తారు. దీంతో వైసీపీ నేతలు భారీ ప్రలోభాలతో జన స మీకరణకు ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి బాలినేనితో సహా ముఖ్య నేత లను పిలిపించారు. ప్రజలను భారీగా తరలించినప్పటికీ టీడీపీ సభ స్థా యిలో జరగలేదు. దీంతో బిత్తరపోయిన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి ఎన్నికల అధికారిపై దురుసుగా వ్యవహరించి విమర్శలకు గురయ్యా రు. చెవిరెడ్డి దూకుడు వ్యవహారశైలితో యావత్తు అధికారులు బిత్తరపోయారు. ఆయనపై జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు కూడా చేశారు.

కనిగిరిలో తేలిపోయిన వైసీపీ ర్యాలీ

కనిగిరిలో టీడీపీ కూటమి అభ్య ర్థి ఉగ్ర నామినేషన్‌కు తండోపతం డాలుగా వచ్చిన ప్రజలను చూసి వైసీపీ నేతలు జనసమీకరణకు భారీగా డబ్బు, మద్యం ఇచ్చారు. ప్రత్యేకించి గురువారం ఉపాధి కల్పన పనులన్నీ ఆపేసి ఆ కూలీ లందర్నీ కార్యక్రమానికి బలవం తంగా రప్పించారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ వసతిగృహాల్లో ఉన్న విద్యార్థులకు ప్రలోభాలు ఆశచూపి కార్యక్రమానికి తీసుకొచ్చారు. అయి నా ర్యాలీ వెలవెలబోయింది. దర్శి లో టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్‌ లక్ష్మి నామినేషన్‌కు ఆటంకాలు కల్పించేందుకు వైసీపీ నేతలు విశ్వప్రయత్నాలు చేశారు. టీడీపీ వారికి మద్యం సరఫరా చేస్తున్నా రన్న అనుమానంతో దర్శిలో ఉన్న బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ను హడా వుడిగా సీజ్‌ చేయించారు. ప్రైవేట్‌ సం స్థల వాహనాలను కూడా ఇవ్వకుండా అడ్డుకున్నారు. అయి నా ప్రజలు టీడీపీ కార్యక్రమానికి భారీగా హాజరయ్యారు.

ఒంగోలులో తండోపతండాలుగా..

ఒంగోలులో వైసీపీ నామినేషన్‌కు వచ్చిన ప్రజలు మధ్యలోనే వెళ్లిపోయి సభా కార్యక్రమ నిర్వహణే విఫలమైంది. టీడీపీ అభ్యర్థి నామినేషన్‌కు ప్రజలు విపరీతంగా వచ్చారు. ఎస్‌ఎన్‌పాడులో గురువారం విజయ్‌కుమార్‌ నామినేషన్‌కు జనం పోటెత్తారు. మంత్రి నాగార్జున నామినేషన్‌ కార్యక్రమం వెలవెలబోయింది. కొండపిలో టీడీపీ కూటమి అభ్యర్థి స్వామి నామినేషన్‌కు జనం భారీగా హాజరయ్యారు. అలాగే నామినేషన్‌కు వచ్చిన జనం మధ్యలోనే వెళ్లిపోవడంతో మంత్రి సురేష్‌ సభను ముగించారు. అద్దంకి, పర్చూరులో వైసీపీ అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమాలు వెలవెలబోయాయి. అదేసమయంలో టీడీపీ అభ్యర్థులు రవికుమార్‌, సాంబశివ రావు నామినేషన్ల కార్యక్రమానికి ఒక్కోచోట 30వేలమంది హాజరయ్యారు. ప్రజ లు స్వచ్ఛందంగా తరలివచ్చారు. చీరాలలో ముందురోజు నామినేషన్‌ వేసిన కరణం వెంకటేష్‌ కార్యక్రమానికి ప్రజలు బాగానే హాజరైనా చివర వరకూ నిలవ లేదు. గురువారం టీడీపీ కూటమి అభ్యర్థి కొండయ్య నామినేషన్‌లో ఆరంభం నుంచి చివరి వరకూ జనం హోరెత్తింది. అందులో ఎస్సీ, బీసీలు అధికంగా ఉన్నారు. కందుకూరులో మంగళవారం టీడీపీ అభ్యర్థి నాగేశ్వరరావు నామినేషన్‌ విజయవంతమైంది. బుధవారం వైసీపీ కార్యక్రమానికి డబ్బు, మద్యం వెదజల్లి సమీకరణకు ప్రయత్నాలు చేసినా ఆశించిన స్థాయిలో జనం హాజరుకాలేదు.

Updated Date - Apr 25 , 2024 | 11:57 PM