Share News

టీడీపీ హయాంలోనే కార్మికులకు భరోసా!

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:19 AM

తెలుగుదేశం పార్టీ హయాంలోనే భవన నిర్మాణ రంగ కార్మికులకు భరోసా లభిస్తుందని టీడీపీ కూటమి అభ్యర్థి దామచ ర్ల జనార్ధన్‌ తెలిపారు. గురువారం ఒంగోలులోని వేమూరి లక్ష్మణ కళ్యాణ మం డపంలో శివశక్తి భవన నిర్మాణకూలీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆ త్మీయ సమావేశానికి దామచర్ల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

 టీడీపీ హయాంలోనే కార్మికులకు భరోసా!

తెలుగుదేశం కూటమి అభ్యర్థి దామచర్ల

ఒంగోలు(కార్పొరేషన్‌), ఏప్రిల్‌ 25 : తెలుగుదేశం పార్టీ హయాంలోనే భవన నిర్మాణ రంగ కార్మికులకు భరోసా లభిస్తుందని టీడీపీ కూటమి అభ్యర్థి దామచ ర్ల జనార్ధన్‌ తెలిపారు. గురువారం ఒంగోలులోని వేమూరి లక్ష్మణ కళ్యాణ మం డపంలో శివశక్తి భవన నిర్మాణకూలీ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆ త్మీయ సమావేశానికి దామచర్ల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ రంగ కార్మికుల జీవితాలకు భరోసా కరువైందన్నారు. ఇసుక మాఫియాతో వైసీపీ భవన నిర్మాణ రంగ కార్మికుల జీవితాలతో ఆడుకుటుందని విమర్శించారు. తె లుగుదేశం హయాంలో రూ.1500 లోపు మాత్రమే లభించిన ట్రాక్టర్‌ ఇసుక ఇ ప్పుడు రూ.6వేలకు పెరిగిందన్నారు. గడిచిన ఐదేళ్ళగా భవన నిర్మాణం కార్మికు ల భవిష్యత్‌ అంధకారంలోకి వెళ్ళిందని, ఇప్పటికైనా కార్మికులు వాస్తవ పరిస్థితు లను గుర్తించాలని దామచర్ల కోరారు. వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే రా ష్ట్రం విడిచి పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళ్ళిల్సిందేనన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కార్మికులకు భరోసా లభిస్తుందని తెలిపారు. ఇసుకను ఉచి తంగా అందజేస్తామని తెలిపారు. అలాగే కార్మిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ప్ర మాద బీమా, ఆరోగ్య బీమా, వివాహప్రోత్సాహక సహాయం అందిస్తామని పేర్కొ న్నారు. వచ్చే నెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. అలాగే ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని తెలిపారు. వైసీపీ వైఫల్యాలను వివరించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయా లని కోరారు. ఒంగోలు అసెంబ్లీ టీడీపీ కూటమి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తనకు అత్యధిక మెజారిటీ తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్‌ కామేపల్లి శ్రీనివాసరావు, క్టస్టర్‌ ఇన్‌చార్జి పాలూరి వెంకటేశ్వరరెడ్డి, జనసేన కార్పొరేటర్‌ మలగా రమేష్‌, శివశక్తి భవన నిర్మాణ కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు గుంజి సుబ్బారావు, ప్రధానకార్యదర్శి తమ్మిశెట్టియానాది, తమ్మిశెట్టి సతీష్‌, జూటూరి శివకుమార్‌, తన్నీరు ప్రసాద్‌, సుబ్రహ్మణ్యం, సుబ్బారెడ్డి, ప ల్లపోతు శ్రీను, తన్నీరు శ్రీను, మిండాల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 08:06 AM