Share News

వైభవంగా శ్రీరఘునాయకస్వామి కల్యాణోత్సవం

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:21 AM

జిల్లాలో ప్రసి ద్ధిగాంచిన చదలవాడలోని శ్రీరఘునాయకస్వామి వారి 239వ వార్షిక కల్యాణోత్సవం గురురవారం క న్నులపండువగా నిర్వహించారు.

వైభవంగా శ్రీరఘునాయకస్వామి కల్యాణోత్సవం

గరుడ పక్షి రాకతో భక్తుల తన్మయత్వం

అంగరంగ వైభవంగా రథోత్సవం

నాగులుప్పలపాడు, ఏప్రిల్‌ 25 : జిల్లాలో ప్రసి ద్ధిగాంచిన చదలవాడలోని శ్రీరఘునాయకస్వామి వారి 239వ వార్షిక కల్యాణోత్సవం గురురవారం క న్నులపండువగా నిర్వహించారు. దేవస్థానం వద్ద నున్న కళ్యాణ వేదిక పైకి అలంకరించిన స్వామి వార్ల ఉత్సవమూర్తులను తీసుకొచ్చి కల్యాణ ఘట్టా న్ని వేదపండితులు అరుణాచార్యులు ఆధ్వర్యంలో అర్చకులు వేదమంత్రాల నడుమ అశేష భక్త జనం సాక్షిగా ఉదయం 10.30 గంటలకు నిర్వహించారు. స్వామివారికి తలంబ్రాలు పోసే సమయంలో ఆకా శంలో గరుడ పక్షి ఆరుసార్లు కల్యాణవేదిక చుట్టూ ప్రదిక్షణలు చేయడంతో భక్తులు తన్మయత్వం చెం దారు. రామనామ స్మరణం జపించారు. ఉభయదా తలు మద్దిరాలపాడుకు చెందిన పెనుబోతు వం శీయులు మల్లికార్జున, నవీన్‌తో కలిసి మంత్రి నా గార్జున స్వామివార్లకు పట్టువస్త్రాలు, తలంబ్రాలు అందజేశారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కళ్యా ణోత్సవాన్ని తిలకించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది భక్తుల కోసం స్వామివారి క ల్యాణ తలంబ్రాలు ఉచితంగా అందజేసేందుకు దేవస్ధాన ఈవో అనీల్‌కుమార్‌ ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేయడం విశేషం. కాగా ఏఎంసీ చైర్మన్‌ మారెళ్ళ బంగారుబాబు, వైసీపీ మండల కన్వీనర్‌ పోలవరపు శ్రీమన్నారాయణ, సర్పంచ్‌ దాసరి వర ప్రసాదరావు కల్యాణోత్సవంలో పాల్గొన్నారు.

ఉత్సాహంగా రథోత్సవం

శ్రీరఘునాయక స్వామి వారి కల్యాణోత్సవంలో భాగంగా సాయంత్రం స్వామి వార్ల రథోత్సవం అం గరంగా వైభవంగా నిర్వహించారు. ఉభయదాతలు తూమాటి రాంబోట్లు చౌదరి దంపతులు ప్రతేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామ పురవీధు ల్లో రథోత్సవం నిర్వహించారు. భక్తులు, యువకు లు రథానిన లాగేందుకు పోటీపడ్డారు. ఒంగోలు రూరల్‌ సీఐ అజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ బ్ర హ్మనాయుడు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశా రు. ఆలయ ధర్మకర్త ఉప్పల లక్ష్మీనరసింహాచా ర్యులు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు చదలవాడ వెంకటకృష్ణయ్య తదితరులు ఏర్పాట్లను పరిశీ లించారు.

Updated Date - Apr 26 , 2024 | 08:00 AM