Share News

టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:47 PM

ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. ఇంకొల్లు లో శనివారం మండుటెండలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ వీడి భా రీగా టీడీపీలో చేరారు. వారికి ఏలూరి కండువాలు వేసి ఆహ్వానించారు.

టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి
వైసీపీని వీడి టీడీలో చేరిన స్టాలిన్‌పేటవాసులతో ఎమ్మెల్యే ఏలూరి

ఇంకొల్లులో 60 కుటుంబాలు చేరిక

ఇంకొల్లు, ఏప్రిల్‌ 25 : ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు విజ్ఞప్తి చేశారు. ఇంకొల్లు లో శనివారం మండుటెండలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ వీడి భా రీగా టీడీపీలో చేరారు. వారికి ఏలూరి కండువాలు వేసి ఆహ్వానించారు. వైసీపీ వైఫల్యాల కారణంగానే పార్టీని వీడినట్లు చెప్పారు. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తేనే అందరికీ సంక్షేమ ఫలాలు సమానంగా అందుతాయని వారు పేర్కొ న్నారు. మం డల పార్టీ అధ్యక్షుడు నాయుడు హనుమంతరావు, డాక్టర్‌ శ్యాంసుందరరావు ఆధ్వర్యంలో ఇంకొల్లు స్టాలిన్‌పేటకు చెందిన మాదిగలు, నాయీ బ్రాహ్మణులు, ముస్లింలు పెద్ద సంఖ్యలో టీడీపీలో చేరారు. అందరూ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, ఎంపీ అభ్యర్థిగా కృష్ణప్రసాద్‌ను గెలిపించాలని కోరారు. స్టాలిన్‌ పేటకు చెందిన సుమారు 20 కుటుంబాలు వారు వలేరు చిట్టి, ఏజర్ల జాను, గాబ్రియేలు, సురేష్‌, మరియమ్మ, అరుణ, పల్లపాటి సుధీర్‌, రాజేష్‌, నాయీబ్రాహ్మణులు 18 కుటుంబాల వారు వేటపాలెం శివ, వెంకటరమణ, శ్రీను, కోటి, ఆంజనేయులు, నాగేశ్వరరావు తదితరులు, ముస్లింలు 15 కుటుంబాలు ఏలూరి సమక్షంలో శనివారం సైకిలెక్కారు. కొణికి గ్రామానికి చెందిన బండి రాఘవరావు, రామూర్తి, మురళీకృష్ణ, దావులూరి రామాంజనేయులు, గుద్దేటి శ్రీనివాసరావు తదితరులు పార్టీలో చేరారు. అనంతరం సాయిబాబా గుడిలో ఇంకొల్లుకు చెందిన మహిళలు ఏలూరి గెలుపును ఆకాంక్షించి హనుమాన్‌చాలీసా చేస్తుండగా వారిని ఏలూరి అభినందించారు. ఏలూరి సాయిబాబా, తటాకాంజనేయస్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసారు. కార్యక్రమంలో జనసేనపార్టీ పర్చూరు ఇన్‌చార్జి పెదపూడి విజయకుమార్‌, నాయుడు హనుమంతరావు, డాక్టర్‌ శ్యాం, పాలేరు రామకృష్ణ, వీరగంధం, వెంకట్రావు, యడ్లూరి ప్రసాద్‌, వలేరు మా ర్క్‌, కొల్లూరి శివాజీ, ఎంపీటీసీ సభ్యుడు బుడే, బా బర్‌బాషా, మీరావలి, వెంకటనారాయణ, కొల్లూరి గౌతమ్‌, కొల్లూరి రాంబాబు, సాంబయ్య, వెంకట్రా వు, శ్రీను టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇటీవల ప్రమాదంలో గాయపడిన ఇంకొల్లుకు చెందిన లోకేష్‌ నుపరామర్శించారు. ముస్లిం కాలనీలో ప్రచారం నిర్వహించారు.

జగన్‌ అంతం..మాదిగల పంతం

ఏలూరికి ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్‌ల మద్దతు

పర్చూరు, ఏప్రిల్‌ 27 : టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావుకు శనివారం బా పట్ల జిల్లా ఎంఎస్పీ, ఎమ్మార్పీఎస్‌ నాయకులు మ ద్దతు తెలిపారు. ఇసు కదర్శిలోని క్యాంప్‌ కార్యాల యంలో సంఘ నాయకులు ఎమ్మెల్యే ఏలూరిని కలి శారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్‌ అంతం.. మాదిగల పంతం.. అన్నారు. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎన్నికల్లో ఎన్డీయే కూట మికి పూర్తి ఇస్తున్నట్లు తెలిపారు. పర్చూరు నియోజకవర్గంలోని మాదిగలంతా ఏకతాటిపై నిలబడి జగన్‌ను గద్దె దింపాలన్నారు. ఏ లూరి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా ఎంఎస్పీ అధ్యక్షుడు దుండంగుట్ల లక్ష్మీనరసయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు దుడ్డు వందనం మాదిగతోపాటు, టీడీపీ బాపట్ల పార్లమెంట్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు బేతపూడి సురేష్‌, జిల్లా నాయకులు జనరాజుపల్లి సుబ్బారావు, పల్లెపోగు నాని, తాళ్లూరి బెన్నియ, గానుగపాటి సురేంద్ర, ఉసురుపాటి సురేష్‌, మందం కిషోర్‌, నేలపాటి బాబు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 11:47 PM