Share News

అభివృద్ధికి చిరునామా టీడీపీ

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:58 PM

అభివృద్ధి, సంక్షేమానికి చిరునామా టీడీపీయేనని కొండపి ఎమ్మెల్యే, టీడీపీ ఉమ్మడి కొండపి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ నాయకులతో కలిసి మండలంలోని నందనవనం, బిట్రగుంట, దావగూడూరు, చింతలపాలెం, పంగులూరివారిపాలెం, జరుగుమల్లి, వావిలేటిపాడు గ్రామాల్లో స్వామి శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన పలు గ్రామాల్లో ప్రచార రథంపై నుంచి గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడారు.

అభివృద్ధికి చిరునామా టీడీపీ
నందనవనం గ్రామంలో ప్రచార రథంపై నుంచి అభివాదం చేస్తున్న స్వామి

జరుగుమల్లి (కొండపి), ఏప్రిల్‌ 26: అభివృద్ధి, సంక్షేమానికి చిరునామా టీడీపీయేనని కొండపి ఎమ్మెల్యే, టీడీపీ ఉమ్మడి కొండపి నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కూటమి పార్టీలైన జనసేన, బీజేపీ నాయకులతో కలిసి మండలంలోని నందనవనం, బిట్రగుంట, దావగూడూరు, చింతలపాలెం, పంగులూరివారిపాలెం, జరుగుమల్లి, వావిలేటిపాడు గ్రామాల్లో స్వామి శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన పలు గ్రామాల్లో ప్రచార రథంపై నుంచి గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడారు. కొండపి నియోజకవర్గం టీడీపీ హయాంలోనే అభివృద్ధి సాధించిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడిపోయాయన్నారు. గడచిన ఐదేళ్లలో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయన్నారు. గ్రామాలకు అందుబాటులో ఇసుక ఉన్నా, వైసీపీ విధానాల కారణంగా ఇసుకను ఇళ్ల నిర్మాణాలకు వాడుకోలేని దుస్థితి నెలకొన్నదని విమర్శించారు. తప్పుడు మైనింగ్‌ పాలసీల ద్వారా ఇసుకను అక్రమార్కులు వేల రూపాయలకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారని విమర్శించారు. టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఉచితంగా ఇసుకను అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్‌తోపాటు ఏప్రిల్‌,మే, జూన్‌ మూడునెలలు అదనంగా మూడు వేల రూపాయలు కలిపి తొలి నెలలో ఏడు వేల రూపాయలు పింఛన్‌దారులకు నేరుగా ఇంటివద్దనే అందించడం జరుగుతుందన్నారు. బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్‌ అందించడం జరుగుతుందన్నారు. సూపర్‌సిక్స్‌ పథకాల ద్వారా అన్ని వర్గాల సంక్షేమానికి టీడీపీ కృషి చేస్తుందన్నారు. మహిళలకు పలు సంక్షేమ కార్యక్రమాలు, బీసీలకు ప్రత్యేక రక్షణ చట్ట, నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు వచ్చేవరకు నిరుద్యోగభృతి యువకులకు అందించడం జరుగుతుందన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద 20 వేల రూపాయల ఆర్థికసాయం ప్రతి ఏడాది అందిస్తామన్నారు. ఈసందర్భంగా పలు గ్రామాల్లో సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీనిచ్చారు.

టీడీపీలోకి చే రికలు...

ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి పొద్దుపోయాక పొన్నలూరు మండలంలోని బోగనంపాడు గ్రామంలో పది కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. వైసీపీ నుంచి మాతంగి మల్లికార్జున, మాల్యాద్రి, నరేంద్ర, పద్మ, నాని, మధు, ముండ్లమూరి పిచ్చయ్యల కుటుంబాలతోపాటు మరికొంత మంది చేరారు. అదేవిధంగా శుక్రవారం దావగూడూరు గ్రామంలో వైసీపీకి చెందిన 25 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో స్వామి సమక్షంలో చేరాయి. కంకిపాటి నాగేశ్వరరావు, చిన్నపుల్లయ్య, పురుషోత్తం, ఆశీర్వాదం, పున్నయ్య, పిడతల నారాయణ, ఆదాం, ఇషాకు, తాళ్లూరు వెంకయ్య, దాసు, గోచిపాతల సామేలులకు పార్టీ కండువాలు కప్పి స్వామి స్వాగతం పలికారు. ప్రచార కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పోకూరి రవీంద్రబాబు, జనసేన మండల అధ్యక్షుడు గూడా శశిభూషణ్‌, బీజేపీ నాయకుడు బాలకోటయ్య , టీడీపీ సీనియర్‌ నాయకుడు పోటు పెదబాబు, మాజీ ఎంపీపీ బెల్లం సత్యన్నారాయణ, నాయకులు పేముల విజయనిర్మల, పాతూరి కోటేశ్వరరావు, సుబ్బారెడ్డి, చదలవాడ బ్రహ్మేంద్రం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:58 PM