Share News

20,12,373

ABN , Publish Date - Apr 28 , 2024 | 02:13 AM

రాష్ట్రంలో అతి పెద్ద నగరం విశాఖపట్నం...ఓటర్లపరంగా కూడా ముందుంది. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు కలిగిన విశాఖ జిల్లా ఓటర్ల సంఖ్య 20 లక్షల మార్కును దాటింది.

20,12,373

  • ఇదీ విశాఖ జిల్లా ఓటర్ల సంఖ్య

  • పురుషులు 9,92,768, మహిళలు 10,19,487, ఇతరులు 118

  • భీమిలి, గాజువాక, పెందుర్తి నియోజకవర్గాల్లో మూడు లక్షలకుపైగా ఓటర్లు

  • ఈ ఏడాది జనవరిలో తుది జాబితా

  • విడుదల చేసిన తరువాత కొత్తగా 69,780 మంది చేరిక

విశాఖపట్నం, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి):

రాష్ట్రంలో అతి పెద్ద నగరం విశాఖపట్నం...ఓటర్లపరంగా కూడా ముందుంది. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు కలిగిన విశాఖ జిల్లా ఓటర్ల సంఖ్య 20 లక్షల మార్కును దాటింది. ఈ ఏడాది జనవరి 22న తుది ఓటర్ల జాబితా విడుదల చేశారు. ఆ తరువాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 14వ తేదీ వరకు గడువు ఇచ్చారు. గడచిన మూడు నెలల్లో భారీగా దరఖాస్తులు వచ్చాయి. వాటిని పరిశీలించి అర్హత ఉన్నవారికి ఓటు హక్కు కల్పించారు. దీంతో జిల్లాలో ఓటర్ల సంఖ్య 20,12,373కు చేరింది. రాష్ట్రంలో 20 లక్షలకు మించి ఓటర్లు ఉన్న ఐదారు జిల్లాల్లో విశాఖ ఒకటిగా నిలిచింది. తాజా జాబితా మేరకు మొత్తం ఓటర్లలో పురుషులు 9,92,768, మహిళలు 10,19,487, ఇతరులు 118 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 26,719 మంది ఎక్కువగా ఉన్నారు. జిల్లాలోని భీమిలి, గాజువాక, పెందుర్తి నియోజక వర్గాల్లో మూడు లక్షలకుపైగా ఓటర్లు ఉండగా, విశాఖ తూర్పు నియోజక వర్గంలో మూడు లక్షలకు ఎనిమిది వేల ఓట్లు తక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 22న విడుదలైన తుది జాబితాలో జిల్లా ఓటర్లు 19,42,593 మంది ఉండగా గడచిన మూడు నెలల్లో 69,780 మంది కొత్తగా ఓటర్లుగా చేరారు. తాజా లెక్కల మేరకు అత్యధికంగా భీమిలిలో 3,63,013, తరువాత గాజువాకలో 3,33,611, పెందుర్తిలో 3,07,545 మంది ఓటర్లు ఉన్నారు. విశాఖ తూర్పులో 2,92,206, ఉత్తరంలో 2,85,789, దక్షిణంలో 2,16,770, పశ్చిమలో 2,13,439 మంది ఓటర్లు ఉన్నారు.

అసెంబ్లీ సెగ్మెట్‌ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం

భీమిలి 1,78,090 1,84,908 15 3,63,013

విశాఖ తూర్పు 1,42,540 1,49,646 20 2,92,206

విశాఖ దక్షిణ 1,06,444 1,10,293 33 2,16,770

విశాఖ ఉత్తరం 1,40,788 1,44,979 22 2,85,789

విశాఖ పశ్చిమ 1,05,202 1,08,226 11 2,13,439

గాజువాక 1,67,112 1,66,487 12 3,33,611

పెందుర్తి 1,52,592 1,54,948 5 3,07,543

మొత్తం 9,92,768 10,19,487 118 20,12,373

Updated Date - Apr 28 , 2024 | 02:13 AM