Share News

నామినేషన్ల హోరు

ABN , Publish Date - Apr 26 , 2024 | 01:25 AM

సార్వత్రిక ఎన్నికల్లో తొలి అంకం నామినేషన్ల దాఖలు కార్యక్రమం ముగిసింది.

నామినేషన్ల హోరు

సెగ్మెంట్‌


భీమిలి 20

విశాఖ ‘తూర్పు’ 23

విశాఖ దక్షిణం 20

విశాఖ ఉత్తరం 25

విశాఖ పశ్చిమలో 18

గాజువాక 21

పెందుర్తి 20

చివరిరోజు పార్లమెంటు స్థానానికి 12 మంది, అసెంబ్లీ సెగ్మెంట్లకు 68 మంది నామినేషన్‌

విశాఖ లోక్‌సభ స్థానానికి 39 మంది నామినేషన్లు

అసెంబ్లీ సెగ్మెంట్లకు 147 మంది...

నేడు పరిశీలన

ఉపసంహరణకు 29 వరకూ గడువు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి):

సార్వత్రిక ఎన్నికల్లో తొలి అంకం నామినేషన్ల దాఖలు కార్యక్రమం ముగిసింది. ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైసీపీ అభ్యర్థులు అటు పార్లమెంటు, ఇటు అసెంబ్లీ స్థానాలకు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేయగా, చివరిరోజైన గురువారం జై భారత్‌ పార్టీ నుంచి సీబీఐ మాజీ అధికారి వీవీ లక్ష్మీనారాయణ విశాఖ ఉత్తర సెగ్మెంట్‌కు నామినేషన్‌ వేశారు. కాగా, విశాఖ పార్లమెంటుకు చివరిరోజు 12 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మొత్తం 39 మంది నామినేషన్లు దాఖలు చేసినట్టయ్యింది. అసెంబ్లీ స్థానాలకు చివరిరోజు 68 మంది నామినేషన్లు దాఖలు చేయగా మొత్తం సంఖ్య 147కు చేరుకుంది. పార్లమెంటు స్థానానికి గురువారం దేవర శంకర్‌ (రాడికల్‌ పార్టీ), బిక్కవోలు చలమాజి (నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ), నక్కా నమ్మిగ్రేస్‌ (జైభీమ్‌రావు భారత్‌ పార్టీ), అందుకూరి విజయభాస్కర్‌ (ఇండియా ప్రజాబంధు పార్టీ)తోపాటు స్వతంత్య్ర అభ్యర్థులుగా పట్టపగలు రాజారమేష్‌, వియ్యపు గంగరాజు, మోహబూబ్‌ సుభాన్‌, కొల్లి నాగరాజు, లగుడు గోవిందరావు, వాసుపల్లి సురేష్‌, పొన్నాడ జనార్దన్‌, పిడిది అప్పారావు నామినేషన్లు వేశారు. నామినేషన్లను శుక్రవారం పరిశీలిస్తారు. ఈనెల 27వ తేదీ నుంచి 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు.

ఏడు అసెంబ్లీ స్థానాలకు 147 మంది నామినేషన్‌

జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలకు గురువారం 68 మంది 75 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. చివరిరోజు భీమిలిలో ఆరుగురు ఆరు సెట్లు, విశాఖ తూర్పులో 12 మంది 13 సెట్లు, ‘సౌత్‌’లో 10 మంది 13 సెట్లు, ఉత్తరంలో 11 మంది 14 సెట్లు, విశాఖ పశ్చిమలో తొమ్మిది మంది 10 సెట్లు, గాజువాకలో 10 మంది 11 సెట్లు, పెందుర్తిలో ఆరుగురు ఏడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఒక అభ్యర్థి ఒకటి ఎక్కువగా వేసిన నామినేషన్లను మినహాయిస్తే ఏడు అసెంబ్లీ స్థానాలకు మొత్తం 147 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పరిశీలిస్తే భీమిలిలో 20, విశాఖ తూర్పులో 23, విశాఖ దక్షిణలో 20, విశాఖ ఉత్తరంలో 25, విశాఖ పశ్చిమలో 18, గాజువాకలో 21, పెందుర్తిలో 20 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈనెల 18వ తేదీన నామినేషన్లు దాఖలు ప్రారంభం కాగా చివరి రోజు ఎక్కువగా దాఖలయ్యాయి.

జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలకుగాను చివరిరోజు గురువారం 68 మంది 75 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. భీమిలిలో కోలా హరిబాబు (రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), స్వతంత్ర అభ్యర్థిగా మేకా సత్యకిరణ్‌, జాతీయ జనసేన నుంచి గంటా శ్రీనివాసరావు నామినేషన్లు దాఖలు చేశారు. విశాఖ తూర్పు నుంచి వై. వేణుగోపాల్‌కృష్ణ (భారతీయ చైతన్య యువజన పార్టీ), గుత్తుల శ్రీనివాసరావు, గుత్తుల మౌనిక (కాంగ్రెస్‌), కోనా శ్రీనివాసరావు (జైభారత్‌ నేషనల్‌ పార్టీ), తోట వెంకట సాయిముకుంద (ప్రజాప్రస్థానం), ఎ.దాలిరాజు (నవభారత్‌ నిర్మాణ సేవా పార్టీ), రజని ఈడ్పుగంటి (జాతీయ జనసేన), ఇండిపెండెంట్లుగా ఎస్‌.సుశీల, వాకుమల్లి గోవింద, వడ్డి శిరీష, ఈడ్పుగంటి సురేష్‌, ఉమ్మడి భాస్కరరావు నామినేషన్లు వేశారు. విశాఖ దక్షిణ నియోజక వర్గానికి వాసుపల్లి సంతోష్‌కుమార్‌ (కాంగ్రెస్‌), కె.శ్రీదేవి (జైమహా భారతీయపార్టీ), రావాడ తాతారావు (భారతీయ నిర్మాణ సేవా పార్టీ), సూరాడ యల్లాజీ (సమాజ్‌వాదీ పార్టీ), వై.సురేష్‌కుమార్‌ (జైభారత్‌ నేషనల్‌ పార్టీ), ఇండిపెండెంట్లుగా వంశీకృష్ణ, సౌమ్యబాబు, విశాఖ ఉత్తర నియోజకవర్గానికి జైభారత్‌ నేషనల్‌ పార్టీ నుంచి వీవీ లక్ష్మీనారాయణ, జైభీమ్‌ భారత్‌ పార్టీ నుంచి కారెం మమత, కాంగ్రెస్‌ నుంచి ఎల్‌.రామారావు, బీఎస్పీ నుంచి పేడాడ కనకమహాలక్ష్మి, బీజేపీ తరపున విష్ణుకుమార్‌రాజు, సమాజ్‌వాదీ నుంచి శరత్‌బాబు, స్వతంత్రులుగా బి.సత్యశ్రీనివాస్‌, సి.మల్లికార్జునరావు, కె. ఈశ్వరభద్రాచారి, రామునాయుడు, సాహితీ నామినేషన్లు దాఖలు చేశారు. పశ్చిమ నియోజకవర్గానికి జాతీయ జనసేన పార్టీ నుంచి మందపాటి శ్రీనివాసరాజు, భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థి బొట్టా కోటేశ్వరరావు, ఇండిపెండెంట్లుగా లక్కిడాపు సురేష్‌బాబు, కొయిలాడ వెంకటలక్ష్మీ, కొయిలాడ వెంకటవరజగదీస్‌, వింజుమూరి కిరణ్‌కుమార్‌, పెదిరెడ్ల నానాజీలు, నామినేషన్లు దాఖలు చేశారు. గాజువాకకు తెలుగుదేశం పార్టీ నుంచి పల్లా శ్రీనివాసరావు, పల్లా కార్తీక్‌ యాదవ్‌, దళిత బహుజన పార్టీ నుంచి శామ్యూల్‌ జాన్‌, ప్రజా ప్రస్థానం పార్టీ నుంచి తలపుల శైలజ, వైసీపీ నుంచి గుడివాడ అమర్‌నాథ్‌, జై మహాభారత్‌ పార్టీ నుంచి కాండ్రేగుల ఆదినారాయణ, నవభారత్‌ నిర్మాణ సేవ పార్టీ నుంచి బత్తుల నీలకంఠం, నవతరం పార్టీ నుంచి సుంకర సారజ్యోతి, ఇండిపెండెంట్లుగా కొవిరి కృష్ణ, కాకర్లమూడి కృష్ణప్రసాద్‌ నామినేషన్‌లు దాఖలు చేశారు. పెందుర్తికి 20 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థిగా అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ సతీమణి అన్నంరెడ్డి శిరీష, నవరంగ కాంగ్రెస్‌ పార్టీ నుంచి రమేశ్‌నాయుడు, ఇండిపెండెంట్లుగా బంటికోరు గోవిందరాజు (స్వతంత్ర), పి.రమేశ్‌నాయుడు (నవరంగ్‌ కాంగ్రెస్‌), గుంటూరు నరసింహమూర్తి, షేక్‌ సఫీ ఉల్లా నామినేషన్లు వేశారు.

Updated Date - Apr 26 , 2024 | 01:26 AM