Share News

ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:49 AM

మండలంలో కైలాసపట్నం గ్రామంలో తేనెటీగల దాడిలో ఉపాధి హామీ పథకం కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం కైలాసపట్నం గ్రామ సమీపంలో గల కంకర చెరువులో 187 మంది ఉపాధి కూలీలు పూడికతీత పనులు చేస్తున్నారు. సమీపంలోని ఓ చెట్టుకు తేనె పట్టు ఉంది.

ఉపాధి కూలీలపై తేనెటీగల దాడి
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కూలీలను పరామర్శిస్తున్న ఎంపీడీవో, ఏపీవో

- 25 మందికి గాయాలు

కోటవురట్ల, ఏప్రిల్‌ 26: మండలంలో కైలాసపట్నం గ్రామంలో తేనెటీగల దాడిలో ఉపాధి హామీ పథకం కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం కైలాసపట్నం గ్రామ సమీపంలో గల కంకర చెరువులో 187 మంది ఉపాధి కూలీలు పూడికతీత పనులు చేస్తున్నారు. సమీపంలోని ఓ చెట్టుకు తేనె పట్టు ఉంది. అయితే కూలీలు పనులు చేస్తుండగా తేనెటీగలు గుంపులుగా దాడి చేశాయి. దీంతో కూలీలు పరుగులు తీశారు. తేనెటీగల దాడిలో 10 మంది తీవ్రంగా, 15 మంది స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు వీరిని కోటవురట్ల వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు సకాలంలో వైద్య సేవలు అందించడంతో వారికి ప్రాణాపాయం తప్పింది. బాధితులను ఎంపీడీవో కాశీవిశ్వనాథం, ఉపాధి ఏపీవో గంగునాయుడు పరామర్శించారు.

Updated Date - Apr 27 , 2024 | 12:49 AM