Share News

మండుతున్న ఎండలు

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:07 AM

మన్యంలో ఎండల తీవ్రత కొనసాగుతున్నది. కొయ్యూరులో గురువారం 43.0 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ముంచంగిపుట్టు, పెదబయలులో 40 డిగ్రీలకు చేరింది. ఉదయం నుంచే ఎండ ప్రభావం మొదలై మధ్యాహ్నం వేళల్లో తీవ్రమవుతోంది. రాత్రి, పగలు తేడా లేకుండా ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగుతున్నది. తాజా వాతావరణానికి ఏజెన్సీ వాసులు సైతం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

మండుతున్న ఎండలు
సందడి లేని పాడేరు మెయిన్‌ రోడ్డు

- కొయ్యూరులో అత్యధికంగా 43.0 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

పాడేరు, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): మన్యంలో ఎండల తీవ్రత కొనసాగుతున్నది. కొయ్యూరులో గురువారం 43.0 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ముంచంగిపుట్టు, పెదబయలులో 40 డిగ్రీలకు చేరింది. ఉదయం నుంచే ఎండ ప్రభావం మొదలై మధ్యాహ్నం వేళల్లో తీవ్రమవుతోంది. రాత్రి, పగలు తేడా లేకుండా ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగుతున్నది. తాజా వాతావరణానికి ఏజెన్సీ వాసులు సైతం ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా..

కొయ్యూరులో గురువారం 43.0 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా అనంతగిరిలో 40.6, ముంచంగిపుట్టు, పెదబయలులో 40.0, జి.మాడుగుల, జీకేవీధిలో 38.7, చింతపల్లిలో 38.4, పాడేరులో 37.3, అరకులోయ, డుంబ్రిగుడలో 36.4, హుకుంపేటలో 36.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Apr 26 , 2024 | 12:07 AM