Share News

కూటమి బలంతో వైసీపీని సాగనంపుదాం

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:58 AM

ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీని రానున్న ఎన్నికల్లో కూటమి బలంతో సాగనంపుదామని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం ఇక్కడ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, గిరిజనుల గురించి వైసీపీ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. అందువల్ల అందరం ఐక్యంగా వైసీపీని తరమాల్సిన సమయం వచ్చిందన్నారు.

కూటమి బలంతో వైసీపీని సాగనంపుదాం
ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి

- టీ డీపీ, బీజేపీ, జనసేన నేతల ఆత్మీయ సమావేశంలో గిడ్డి ఈశ్వరి

పాడేరు, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీని రానున్న ఎన్నికల్లో కూటమి బలంతో సాగనంపుదామని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం ఇక్కడ నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, గిరిజనుల గురించి వైసీపీ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. అందువల్ల అందరం ఐక్యంగా వైసీపీని తరమాల్సిన సమయం వచ్చిందన్నారు. అందరి కంటే గిరిజనులే జగన్‌ పాలనలో తీవ్రంగా నష్టపోయారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు చెందిన పథకాలను రద్దు చేయడంతో పాటు గిరిజనులకు గుండెకాయ వంటి జీవో: 3రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం దారుణమన్నారు. అరకులోయ పార్లమెంట్‌ స్థానంలో వున్న గిరిజన ఎంపీ, ఎమ్మెల్యేలు దానిపై నోరు మెదపకపోవడం గిరిజనులకు ద్రోహం చేయడమేనన్నారు, వారందరికీ రానున్న ఎన్నికల్లో ఓటుతోనే బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. కూటమి అరకులోయ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతను, పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తనను గెలిపించుకోవాలని గిడ్డి ఈశ్వరి కోరారు. ఎన్‌డీఏ అభ్యర్థులను గెలిపించుకుని గిరిజన ప్రాంతంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమృద్ధిగా చేసుకోవాల్సిన అవసరం మనందరిపై ఉందన్నారు. అనంతరం బీజేపీ నేతలు కురసా ఉమామహేశ్వరరావు, కూడా కృష్ణారావు, జనసేన నేత డాక్టర్‌ వంపూరు గంగులయ్య, టీడీపీ నేతలు పోలుపర్తి గోవిందరావు, బొర్రా నాగరాజు, ఎంవీవీ.ప్రసాద్‌, తదితరులు మాట్లాడారు. మూడు పార్టీలకు చెందిన ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరుకావడంతో ఆత్మీయ సమావేశం ఉత్సాహంగా జరిగింది. అంతకు ముందు జనసేన పార్టీ కార్యాలయంలో కూటమి నేతలు అభ్యర్థి గిడ్డి ఈశ్వరికి శాలువాలు కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు గంగపూజారి శివకుమార్‌, డప్పోడి వెంకటరమణ, కేవీ.సురేశ్‌కుమార్‌, పాంగి పాండురంగస్వామి, చిట్టిబాబు, లక్ష్మణరావు, పెనుమాక రవికుమార్‌, లకే భాస్కర్‌, నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:58 AM