Share News

ముగిసిన నామినేషన్ల స్వీకరణ

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:10 AM

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మన్యంలో పాడేరుకు మొత్తం 30, అరకులోయ అసెంబ్లీ స్థానానికి 41 నామినేషన్లు దాఖలయ్యాయి. పలువురు అభ్యర్థులు డమ్మీ అభ్యర్థితో పాటు రెండేసి నామినేషన్లను దాఖలు చేశారు. దీంతో అభ్యర్థులు కంటే నామినేషన్‌ పత్రాల సంఖ్య పెరిగింది.

ముగిసిన నామినేషన్ల స్వీకరణ
గురువారం మరో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేస్తున్న పాడేరు టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి

- అసెంబ్లీ స్థానాలకు వెల్లువెత్తిన నామినేషన్లు

- మొత్తం పాడేరులో 30, అరకులోయకు 41 దాఖలు

- నేడు అభ్యర్థుల నామినేషన్‌ పత్రాల పరిశీలన

పాడేరు, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మన్యంలో పాడేరుకు మొత్తం 30, అరకులోయ అసెంబ్లీ స్థానానికి 41 నామినేషన్లు దాఖలయ్యాయి. పలువురు అభ్యర్థులు డమ్మీ అభ్యర్థితో పాటు రెండేసి నామినేషన్లను దాఖలు చేశారు. దీంతో అభ్యర్థులు కంటే నామినేషన్‌ పత్రాల సంఖ్య పెరిగింది.

పాడేరు అసెంబ్లీ స్థానానికి 30...

పాడేరు అసెంబ్లీ స్థానానికి మొత్తం 30 నామినేషన్లను దాఖలయ్యాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరి, వైసీపీ అభ్యర్థిగా మత్స్యరాస విశ్వేశ్వరరాజు, కాంగ్రెస్‌ పార్టీకి సతకా బుల్లిబాబు, బహుజన్‌ సమాజ్‌ పార్టీకి సుర్ల అప్పారావు, ప్రజాబంధు పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కింటుకూరి జోసెఫ్‌, సమాజవాది పార్టీ అభ్యర్థిగా మినుముల రాంబాబు, బహుజన సమాజ్‌ పార్టీకి సుర్ల అప్పారావు, ఇండియా ప్రజాబంధు పార్టీకి కింటుకూరి జోషఫ్‌, భారత చైతన్య యువజన పార్టీకి కిల్లో రంగారావు, వైసీపీ డమ్మీ అభ్య్థర్థిగా కిముడు శివనాగరత్నం, స్వతంత్ర అభ్యర్థులు వల్లా మౌనిక, అడపా విష్ణుమూర్త్తి, కొక్కుల కన్నబాబు, చెర్రేకి గులాబి, చెర్రేకి అప్రియంబాబు నామినేషన్లను దాఖలు చేశారు. అలాగే టీడీపీ డమ్మీ అభ్యర్థిగా అడపా కీర్తిమాన్విత, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సతకా బుల్లిబాబు, కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థిగా ఎస్‌జానకమ్మ, జై భారత్‌ నేషనల్‌ పార్టీకి దమంతి నాగేశ్వరరావు, ఆంధ్ర రాష్ట్ర సమితికి జల్లి రాంబాబు, జైమహాభారత్‌ పార్టీకి బొంజు అర్జున్‌రావు నామినేషన్లు వే యగా, స్వతంత్ర అభ్యర్థులుగా డొంకాడ శివప్రసాద్‌., కిల్లు వెంకటరమేశ్‌నాయుడు, ఎస్‌.శంకర రావు, సెగ్గే శ్రీను, వంతాల సుబ్బారావు నామినేషన్లను దాఖలు చేశారు.

అరకులోయకు అసెంబ్లీకి 41..

అరకులోయ అసెంబ్లీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పాంగి రాజారావు, వైసీపీ అభ్యర్థిగా రేగం మత్స్యలింగం, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా శెట్టి గంగాధరస్వామి, వైసీపీ డమ్మీ అభ్యర్థిగా రేగం చాణిక్య, భారతీయ జనతా పార్టీ డమ్మీ అభ్యర్థిగా పాంగి శ్రీలక్ష్మి, బహుజన సమాజ్‌ పార్టీ అభ్యర్థి లకే రాజారావు, గొండ్యానా దండకారణ్య పార్టీ అభ్యర్థిగా చుంచు రాజాబాబు, జై భారత్‌ నేషనల్‌ పార్టీకి బురిడి ఉపేంద్ర, భారత చైతన్య యువజన పార్టీకి దురియా సాయిబాబా, లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీకి కిల్లో అనిల్‌కుమార్‌, ఆంధ్రరాష్ట్ర సమితికి పాంగి నీలమ్మ నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా సివేరి అబ్రహం, వంతాలరామన్న, గెమ్మిలి కృష్ణారావు, సమర్థి రఘునాథ్‌, సమర్థి గులాబీ, మొగలి చంద్రకళ అడకట్ల వైకుంఠరావు, మైస్య సుజాత, సమర్థి భవాని, నారాజు గోవిందరావు, సమర్థి గులాబి, సమర్థి రఘునాధ్‌, పాచిపెంట శాంతకుమారి, కమ్మిడి నిర్మల, పి.రామకృష్ణ, తాంగుల రామదాసు, దురియా సాయిబాబా, సమిర్థి భవాని నామినేష్లను సమర్పించారు.

------------

పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాలకు దాఖలైన నామినేషన్ల వివరాలు

తేదీ పాడేరు అరకులోయ మొత్తం

18 0 0 0

19 2 5 7

20 1 2 3

22 4 4 8

23 1 6 7

24 10 13 23

25 12 11 23

--------------------------------------------------

మొత్తం 30 41 71

-------------------------------------------------

ఫొటో రైటప్‌: 25పిడిఆర్‌ 7ఎ: నామినేషన్ల ప్రక్రియను పరిశీలిస్తున్న పరిశీలకుడు కె.వివేకానందన్‌

ఆఖరి రోజు 23 నామినేషన్లు

పాడేరులో 12, అరకులోయకు 11 నామినేషన్లు

పాడేరు, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): పాడేరు, అరకులోయ అసెంబ్లీ స్థానాలకు ఆఖరి రోజు గురువారం 23 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయా నామినేషన్‌ పత్రాలను పాడేరు, అరకులోయ ఆర్వోలు భావన వశిష్ట, అభిషేక్‌లు స్వీకరించారు. పాడేరు అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి, టీడీపీ డమ్మీ అభ్యర్థిగా అడపా కీర్తిమాన్విత, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సతకా బుల్లిబాబు, కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థిగా ఎస్‌జజానకమ్మ, జై భారత్‌ నేషనల్‌ పార్టీకి దమంతి నాగేశ్వరరావు, ఆంధ్ర రాష్ట్ర సమితికి జల్లి రాంబాబు, జైమహాభారత్‌ పార్టీకి బొంజు అర్జున్‌రావు నామినేషన్లు వే యగా, స్వతంత్ర అభ్యర్థులుగా డొంకాడ శివప్రసాద్‌., కిల్లు వెంకటరమేశ్‌నాయుడు, ఎస్‌.శంకరరావు, సెగ్గే శ్రీను, వంతాల సుబ్బారావు నామినేషన్లను దాఖలు చేశారు.

అరకులోయకు 11..

ఆఖరి రోజు అరకులోయ అసెంబ్లీ స్థానానికి 11 మంది నామినేషన్లు సమర్పించారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి శెట్టి గంగాధరస్వామి, బీజేపీ అభ్యర్థ్ది పాంగి రాజారావు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా కమ్మిడి నిర్మల, సమిర్డి గులాభీ, వంతాల రామన్న, చెండా ఏలియా, పి.రామకృష్ణ, మొస్య సుజాత, తాంగుల రామదాసు, దురియా సాయిబాబా, సమిర్థి భవాని నామినేష్లను సమర్పించారు.

నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన పరిశీలకుడు

సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను జిల్లా ఎన్నికల (సాధారణ) పరిశీలకుడు కె.వివేకానందన్‌ గురువారం పరిశీలించారు. ఐటీడీఏ కార్యాలయంలోని అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా పార్టీలు, స్వతంత్రులు దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాలను ఆయన తనిఖీ చేశారు.

Updated Date - Apr 26 , 2024 | 12:10 AM