Share News

వర్షంతో ఊరట

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:17 AM

మండలంలో గురువారం భిన్న వాతావరణం చోటు చేసుకుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్రంగా ఎండ కాసింది. అత్యధికంగా 43.0 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనం అల్లాడిపోయారు. అయితే మధ్యాహ్నం మూడు గంటలకు మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రావణాపల్లి, నల్లగొండ, బంగారమ్మపేట, అంతాడ, కొయ్యూరు, చింతలపూడి, బాలారం, కంఠారం తదితర పంచాయతీలలో వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతతో అల్లాడిన జనం వర్షంతో ఊరట చెందారు.

  వర్షంతో ఊరట
కొయ్యూరు మండలం రావణాపల్లిలో వర్షం

- మధ్యాహ్నం వరకు ఎండ.. ఆ తరువాత భారీ వాన

కొయ్యూరు, ఏప్రిల్‌ 25: మండలంలో గురువారం భిన్న వాతావరణం చోటు చేసుకుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్రంగా ఎండ కాసింది. అత్యధికంగా 43.0 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనం అల్లాడిపోయారు. అయితే మధ్యాహ్నం మూడు గంటలకు మేఘాలు దట్టంగా అలుముకున్నాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రావణాపల్లి, నల్లగొండ, బంగారమ్మపేట, అంతాడ, కొయ్యూరు, చింతలపూడి, బాలారం, కంఠారం తదితర పంచాయతీలలో వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతతో అల్లాడిన జనం వర్షంతో ఊరట చెందారు.

జి.మాడుగులలో..

జి.మాడుగుల: మండలంలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. అయితే మధ్యాహ్నం మూడు గంటలకు ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసింది.

Updated Date - Apr 26 , 2024 | 12:17 AM