Share News

ఎన్నికల పరిశీలకుల ఆరా

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:26 PM

చీపురుపల్లి, రాజాం, బొబ్బిలి, ఎచ్చెర్ల నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకుడు తలాత్‌ పర్వేజ్‌ ఇక్బాల్‌ గురువారం కంట్రోల్‌ రూం, మీడియా కేంద్రాన్ని సందర్శించారు. కంట్రోల్‌ రూంలో ఏర్పాటు చేసిన వాహనాల జీపీఎస్‌, చెక్‌ పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల లైవ్‌తీరు, మీడియా మానటరింగ్‌, ఎంసీసీ, సి విజిల్‌, ఫిర్యాదుల విభాగాలను తనిఖీ చేశారు.

ఎన్నికల పరిశీలకుల ఆరా
టర్నింగ్‌ అధికారి నూకరాజుతో మాట్లాడుతున్న ఎన్నికల పరిశీలకుడు చాబ్ర

ఎన్నికల పరిశీలకుల ఆరా

ఏర్పాట్లు.. ఫిర్యాదులు.. పరిష్కారాలపై స్వయంగా తనికీ

కలెక్టరేట్‌/ నెల్లిమర్ల, ఏప్రిల్‌ 25: చీపురుపల్లి, రాజాం, బొబ్బిలి, ఎచ్చెర్ల నియోజకవర్గాల ఎన్నికల పరిశీలకుడు తలాత్‌ పర్వేజ్‌ ఇక్బాల్‌ గురువారం కంట్రోల్‌ రూం, మీడియా కేంద్రాన్ని సందర్శించారు. కంట్రోల్‌ రూంలో ఏర్పాటు చేసిన వాహనాల జీపీఎస్‌, చెక్‌ పోస్టుల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల లైవ్‌తీరు, మీడియా మానటరింగ్‌, ఎంసీసీ, సి విజిల్‌, ఫిర్యాదుల విభాగాలను తనిఖీ చేశారు. ఎంసీసీ ద్వారా జారీ చేస్తున్న అనుమతులపై ఆరా తీశారు. పెయిడ్‌ న్యూస్‌, ప్రకటనలను అభ్యర్థుల ఖాతాల్లో వేయాలని సూచించారు. ఆయన వెంట డీఆర్‌వో అనిత, సీపీవో బాలాజీ, డీఐపీఆర్‌వో రమేష్‌ ఉన్నారు.

- నెల్లిమర్ల, విజయనగరం, గజపతినగరం నియోజక వర్గాల పరిశీలకుడుగా ఐఏఎస్‌ అధికారి హనిష్‌ చాబ్రను ఎన్నికల కమిషన్‌ నియమించింది. ఈ మేరకు ఆయన గురువారం విజయనగరం చేరుకున్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో ప్రతిరోజూ 10.30 నుంచి 11.30 వరకు ప్రజలను కలిసేందుకు అందుబాటులో ఉంటారని కలెక్టర్‌ నాగలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదులు, కోడ్‌ ఉల్లంఘనలు, నగదు, మద్యం పంపిణీ తదితర అంశాలపై తగిన ఆధారాలతో, ఫోటోలు, వీడియో, వాయిస్‌ మెసేజ్‌, అడ్రస్‌లతో ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్‌ తెలిపారు. ఫిర్యాదుల కోసం 9550224904 నంబరును కేటాయించినట్లు తెలిపారు. కాగా పరిశీలకుడు హనిష్‌ గురువారం నెల్లిమర్లలోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాన్ని సందర్శించారు. ఎన్నికలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. రిటర్నింగ్‌ అధికారి నూకరాజుతో మాట్లాడారు.

Updated Date - Apr 25 , 2024 | 11:26 PM