Share News

ఒక్క అవకాశం ఇవ్వండి: జయకృష్ణ

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:16 AM

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని కూటమి పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ కోరారు.

ఒక్క అవకాశం ఇవ్వండి: జయకృష్ణ

సీతంపేట: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని కూటమి పాలకొండ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ కోరారు. మండలంలోని గదబవలస, కొత్తవలస, దేవగిరి, పెద్దవంగర, గజిలి, కడగండి, ఓండ్రుజోల గ్రామాల్లో ఆయన శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో నెంబర్‌3, జీవో నెంబర్‌ 52లకు ఎందుకు మౌనం వహిస్తున్నారో ఓటర్లు గ్రహించాలన్నారు. గిరిజన సమస్యలు కోసం అసెంబ్లీలో ప్రస్తావించే వ్యక్తిగా తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు సవర తోటముఖలింగం, సీనియర్‌ నాయకులు నిమ్మక నాగేశ్వరరావు, నిమ్మక చం ద్రశేఖర్‌, ప్రచారకర్త తోయక సంధ్యారాణి, నిమ్మక మురళి, కూటమి నాయకులు పాల్గొన్నారు.

నేడు వీరఘట్టంలో ప్రచారం

వీరఘట్టం: మండలంలో కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ ఆదివారం ప్రచారం చేయనున్నారు. మండలంలోని ఎస్‌.గోపాలపురం, జె.గోపాలరావు, మూలలంక, గాదిలంక, పెద్దూరు, చిన్నగోర, చిన్నగోర కాలనీల్లో ప్రచారం చేయనున్నట్టు టీడీపీ మండల అధ్యక్షుడు ఉదయాన ఉదయ్‌భాస్కర్‌ శనివారం తెలిపారు.

Updated Date - Apr 28 , 2024 | 12:16 AM