Share News

ఎంపీగా ఒక్కసారే అవకాశం

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:13 AM

నియోజకవర్గాల పునర్విభజన తరువా త నుంచి విజయనగరం ఎంపీగా ఒక్కసారే అభ్యర్థులకు అవకాశం ఇస్తున్నారు. ప్రతి లోక్‌సభ ఎన్నికల్లోనూ కొత్త ఎంపీని ఎన్నుకుంటున్నారు విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గ ఓటర్లు.

ఎంపీగా ఒక్కసారే అవకాశం

- విజయనగరం ప్రత్యేకత

విజయనగరం (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల పునర్విభజన తరువా త నుంచి విజయనగరం ఎంపీగా ఒక్కసారే అభ్యర్థులకు అవకాశం ఇస్తున్నారు. ప్రతి లోక్‌సభ ఎన్నికల్లోనూ కొత్త ఎంపీని ఎన్నుకుంటున్నారు విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గ ఓటర్లు. గతంలో ఉన్న బొబ్బిలి పార్లమెంట్‌ స్థానం పునర్విభజనలో శ్రీకాకుళం- విజయనగరం జిల్లాలకు చెందిన అసెంబ్లీ సెగ్మెంట్లతో కలుపుకొని విజయనగరానికి మారింది. ఇందులో విజయనగరం, నెల్లిమర్ల, గజపతినగరం, ఎచ్చెర్ల, బొబ్బిలి, రాజాం, చీపురుపల్లి నియోజకవర్గాలు ఉన్నాయి. పార్లమెంటు స్థానం మారిన నాటి నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీ చేసి గెలిచారు. ఒకసారి గెలిచిన అభ్యర్థి మరోసారి పోటీలో ఉండటం లేదు. 2009లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో బొత్స ఝాన్సీ గెలుపొందారు. 2014లో అశోక్‌ గజపతిరాజు విజయం సాధించారు.. కేంద్ర పౌరవిమాన యాన శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. 2019లో ఆయన ఓటమి చెందారు.. 2019 ఎన్నికల్లో బెల్లాన చంద్రశేఖర్‌ పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో కూటమి తరపున కలిశెట్టి అప్పలనాయుడు, వైసీపీ నుంచి ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ బరిలో ఉన్నారు. మరి ఓటర్లు ఆనవాయితీని కొనసాగిస్తారో...కొత్త సంప్రదానికి తెరతీస్తారో చూడాలి.

Updated Date - Apr 28 , 2024 | 12:13 AM