Share News

కత్తులు దూసేవారిపై నిఘా

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:35 PM

సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు కల్పించాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

కత్తులు దూసేవారిపై నిఘా
గ్రామాల్లో పోలీసుల కవాతు

- సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు గస్తీ

- యువత ఇరుక్కుంటే.. ఇబ్బందులు తప్పవు

విజయనగరం (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు కల్పించాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. గత ఎన్నికల్లో గొడవలు, అల్లర్లు చేసిన వారిపై ఎన్నికల అధికారులు, పోలీసులు డేగ కన్నువేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నాగలక్ష్మి పోలీసులను అప్రమత్తం చేశారు. దీంతో సమస్యాత్మక, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి బందోబస్తు ఏర్పాట్లు, అవగాహన కార్యక్రమాలను పోలీసు యంత్రాంగం చేపట్టింది. జిల్లాలో సుమారు 267 వరకు సమస్యాత్మక, అతి సమసాత్మక ప్రాంతాలు ఉన్నాయి.

శాంతియుతంగా ఎన్నికలు జరగాలి: కలెక్టర్‌

విజయనగరం జిల్లా అంటేనే శాంతికాముకులుగా పేరుగాంచింది. ఎందరో మహానుభావులకు జన్మ నిచ్చిననేల. ఇక్కడి ప్రజలు గొడవలు, అల్లర్లకు దూరంగా ఉంటారని చెబు తుంటారు. వచ్చే ఎన్నికలలో ఎటు వంటి సమస్యలు లేకుండా ప్రజ లందరూ సహకరించి ఎన్నికలు స జావుగా సాగేలా చూడాలి. ముఖ్యంగా యువత ప్రలోభాలకు లొంగకుండా... గొడవల్లో కలుగజేసుకోకుండా స్వేచ్ఛాయుత వాతవరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలి. జిల్లాకు ఉన్న మంచి పేరును కొనసాగిద్దాం.

Updated Date - Apr 25 , 2024 | 11:35 PM