Share News

నేడే పాలిసెట్‌

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:49 PM

పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష శనివారం జరగనుంది. అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా వ్యాప్తంగా 24 కేంద్రాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకూ పరీక్ష జరగనుంది. 8,864 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

నేడే పాలిసెట్‌
బొబ్బిలి పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న అధికారులు

నేడే పాలిసెట్‌

నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు

హాజరు కానున్న 8,864 మంది విద్యార్ధులు

24 కేంద్రాల్లో ఏర్పాట్లు

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 26: పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష శనివారం జరగనుంది. అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా వ్యాప్తంగా 24 కేంద్రాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకూ పరీక్ష జరగనుంది. 8,864 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో 144 సెక్షన్‌ అమలు చేస్తారు. వైద్య సిబ్బంది, మంచినీరు అందుబాటులో ఉంచారు. పరీక్ష రాసిన సమయంలో విద్యుత్‌ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన 11 కేంద్రాల్లో 4509 మంది విద్యార్థులు, గజపతినగరం 6 కేంద్రాల్లో 2009 మంది, బొబ్బిలి 7 కేంద్రాల్లో 2346 మంది హాజరు కానున్నారు. పరీక్ష రాసే విద్యార్థి ఖచ్చితంగా పరీక్ష సమయం కంటే గంట ముందు హాజరు కావాలి. అంటే ఉదయం 10 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది. నిమిషం దాటినా కేంద్రంలోకి అనుమతించరు. ఇతర వివరాలకు 7989781520 నెంబరును సంప్రదించవచ్చు.

Updated Date - Apr 26 , 2024 | 11:49 PM