Share News

నగదు,మద్యం స్వాధీనం

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:15 AM

ఎన్నికల నేపథ్యంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అన్ని ప్రధాన ప్రాంతాల్లోనూ జాతీయ, రాష్ట్రీయ రహదారులపై తనిఖీలు నిర్వ హించారు. నాటుసారా, నగదు, మద్యం, గంజాయి రవాణా జరుగకుండా పటి ష్టమైన చర్యలు చేపట్టినట్టు ఎస్పీ ప్రశాంతి తెలిపారు.

నగదు,మద్యం స్వాధీనం
స్వాధీనం చేసుకున్న సారా తయారీ సామాగ్రి

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 26 :ఎన్నికల నేపథ్యంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అన్ని ప్రధాన ప్రాంతాల్లోనూ జాతీయ, రాష్ట్రీయ రహదారులపై తనిఖీలు నిర్వ హించారు. నాటుసారా, నగదు, మద్యం, గంజాయి రవాణా జరుగకుండా పటి ష్టమైన చర్యలు చేపట్టినట్టు ఎస్పీ ప్రశాంతి తెలిపారు.శుక్రవారం జిల్లాలోని చింత లపూడి, భీమడోలు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పోలవరం, ఏలూరు, కైకలూరు ఎస్‌ఈబీ పోలీస్‌ స్టేషన్‌ అధికారులు, చెక్‌పోస్టుల వద్ద సిబ్బందితో దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీ, విక్రయ దారులపై దాడుల చేసి 80 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. 3,800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి మూడు కేసులు నమోదు చేశారు. డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ కల్గి ఉన్నవారిపై 11 కేసులు నమోదు చేసి 64.24 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిపై బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్లు అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు తెలిపారు.

కామవరపుకోట/ఉంగుటూరు ఏప్రిల్‌ 26 : కొత్తూరు చెక్‌పోస్టు వద్ద అధికారులు వాహన తనిఖీలు చేపట్టగా వ్యాన్‌లో తీసుకువెళుతున్న వ్యక్తి నుంచి లక్షా 30 వేలు స్వాధీనం చేసుకున్నట్లు చెక్‌పోస్టు ఎన్నికల అధికారి ఎండి మొహిద్దీన్‌ తెలిపారు. గుంటూరు నుంచి జంగారెడ్డిగూడెం వ్యాన్‌పై వెళుతున్న వ్యక్తి నుంచి ఈనగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాహనతనిఖీలలో పోలీసులు కె.రమేష్‌, పి.రాంబాబు, కె.రామకృష్ణ,సూర్యారావు,రాము తదితరులు ఉన్నారు. ఉంగుటూరు టోల్‌ ప్లాజావద్ద శుక్రవారం కారును తనిఖీ చేయగా అందులో అనుమతిలేని నగదు రూ.70,500 లను స్వాధీనం చేసుకున్నట్టు రిటర్నింగు అధికారి ఖాజావలి తెలిపారు. పెనుగొండ నుంచి ఏలూరు వెళుతున్న కారును తనిఖీ చేయగా మదిచెర్ల అప్పా రావు, నౌడు దుర్గారావుల నుంచి అనుమతిలేని నగదు రూ.70,500 స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:15 AM