Share News

జిల్లాకు ఆరుగురు ఎన్నికల పరిశీలకులు

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:26 PM

పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావర ణంలో నిర్వహించేందుకు జిల్లాకు ఆరుగురు ఎన్నికల పరిశీలకులు విచ్చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గురువారం తెలిపారు.

జిల్లాకు ఆరుగురు ఎన్నికల పరిశీలకులు

భీమవరం టౌన్‌, ఏప్రిల్‌ 25 : పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావర ణంలో నిర్వహించేందుకు జిల్లాకు ఆరుగురు ఎన్నికల పరిశీలకులు విచ్చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గురువారం తెలిపారు. ఎన్నికల ప్రత్యక్ష పర్యవేక్షణకు జనరల్‌, పోలీస్‌, వ్యయ పరిశీలకులుగా వీరు విధులు నిర్వహిస్తారు. ఎన్నికల ఉల్లంఘనలకు సంబం ధించిన ఫిర్యాదులను, అర్జీలను రాజకీయ పార్టీలు, పోటీ లో వున్న అభ్యర్థులు, సాధారణ ప్రజలు భీమవరం సూర్య నారాయణపురం తమ్మిరాజు నగర్‌ కాస్మోపాలిటన్‌ క్లబ్‌ రూమ్‌ నంబర్‌ 303లో ఆయా నియోజకవర్గాల పరిశీలకు లను ప్రభుత్వ పనిదినాలలో ప్రతి రోజు ఉదయం పది గంటల నుంచి 11 గంటల వరకు స్వయంగా కలిసి అందజేయవచ్చు. సమస్య తీవ్రతను బట్టి సాధారణ ప్రజలు ఆయా ఫోన్‌ నంబర్లలో ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు నని తెలిపారు.

ఎం.దీప, సాధారణ పరిశీలకులు : ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం నియోజకవర్గాలను పర్యవేక్షిస్తారు. ఫోన్‌ నెంబర్లు 08816–299633, 91824 08687.

ఎల్‌.నిర్మలరాజ్‌, సాధారణ పరిశీలకులు : తణుకు, తాడేపల్లిగూడెం, ఉండి నియోజకవర్గాలను పర్యవేక్షిస్తారు. ఫోన్‌ నెంబర్లు 08816–299631, 91824 04268.

పియూష్‌ శుక్లా, పార్లమెంట్‌ వ్యయ పరిశీలకులు : అన్ని నియోజకవర్గాల ఎన్నికల వ్యయ పరిశీలకులుగా వ్యవహరిస్తారు. ఫోన్‌ నెంబర్లు 08816–299632, 91824 06871.

శైలేష్‌ కుమార్‌, పోలీస్‌ అబ్జర్వర్‌ : అన్ని నియోజకవ ర్గాలకు ఎన్నికల పోలీసు పరిశీలకులుగా వ్యవహరి స్తారు. ఫోన్‌ నెంబర్లు :08816–299636, 91824 01630.

మోహల్‌ అగర్వాల్‌, వ్యయ పరిశీలకులు : ఆచంట, పాలకొల్లు, నరసాపురం నియోజక వర్గాల వ్యయ పరిశీలకులు. ఫోన్‌ నెంబర్లు : 08816–299634, 91824 01630.

విక్రమాదిత్య మీనా, వ్యయ పరిశీలకులు : తణుకు, తాడేపల్లిగూడెం, ఉండి, భీమవరం నియోజకవర్గాల వ్యయ పరిశీలకుల. ఫోన్‌ నెంబర్లు : 08816–299635, 91824 04117.

Updated Date - Apr 25 , 2024 | 11:26 PM