Share News

ముగిసిన నామినేషన్లు

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:24 PM

సార్వత్రిక ఎన్నికల సమరంలో నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. శుక్రవారం ఎన్నికల అధికారులు ఈ నామినేషన్లను పరిశీలించి నిబంధనలు పాటించని వాటిని తిరస్కరిస్తారు.

ముగిసిన నామినేషన్లు
ఉండి ఆర్వోకు నామినేషన్‌ అందించిన శివరామరాజు

నరసాపురం ఎంపీకి 27 మంది, ఎమ్మెల్యే స్థానాలకు 122 మంది

నేడు నామినేషన్ల పరిశీలన.. ఉపసంహరణ గడువు 29

సార్వత్రిక ఎన్నికల సమరంలో నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. శుక్రవారం ఎన్నికల అధికారులు ఈ నామినేషన్లను పరిశీలించి నిబంధనలు పాటించని వాటిని తిరస్కరిస్తారు. 29వ తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు వుంది. మే 13వ తేదీ పోలింగ్‌ జరుగుతుంది. ఈ నెల 18వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల చేసి, ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్ల ను స్వీకరించారు.

ఎంపీ స్థానానికి 27 మంది

భీమవరం టౌన్‌, ఏప్రిల్‌ 25 : నరసాపురం ఎంపీ స్థానాని కి గురువారం 11 మంది అభ్యర్థులు 18 సెట్ల నామినేషన్లను దాఖలు చేసినట్లు పార్లమెంటరీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధి కారి, జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. వీటితో కలిపి ఇప్పటి వరకు 27 మంది అభ్యర్థులు 39 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. ఆఖరి రోజు స్వతంత్ర అభ్యర్థులుగా గేదెల లక్ష్మణరావు, గొట్టుముక్కల శివాజీ, ప్రసన్నకుమార్‌, డి.ఆదినారాయణ, అడబాల శివ, అద్దంకి శేఖర్‌బాబు(దొరబాబు), యాక్షన్‌ పార్టీ ఫర్‌ పీఫుల్‌ ప్రోగ్రెస్‌ నుంచి నాగరాజు రుక్మిణి, రిపబ్లిక్‌ ఆఫ్‌ ఇండియా(ఎ) నుంచి గంజి పూర్ణిమ, కాంగ్రెస్‌ పార్టీ నుంచి బలగం నాయకర్‌, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి కొర్లపాటి బ్రహ్మానందరావునాయుడు, కొర్లపాటి జ్యోతి నామినేషన్లు దాఖలు చేశారు.

ఎమ్మెల్యే స్థానాలకు 122 మంది

జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గురువారం 67 మంది అభ్యర్థులు 73 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. వీటితో కలిపి ఇప్పటివరకు మొత్తం 122 మంది అభ్య ర్థులు 206 సెట్ల నామినేషన్లను సమర్పించినట్లు కలెక్టర్‌ తెలి పారు. చివరి రోజు.. భీమవరంలో ఎనిమిది మంది ఎనిమిది సెట్లు, తాడేపల్లిగూడెంలో 15 మంది 16 సెట్లు, నరసాపు రంలో ఏడుగురు ఏడు సెట్లు, ఆచంటలో ఎనిమిది మంది తొమ్మిది సెట్లు, తణుకులో ఆరుగురు ఏడు సెట్లు, ఉండిలో పది మంది పది సెట్లు, పాలకొల్లులో 13 మంది 16 సెట్లు నామినేషన్లను దాఖలు చేసినట్లు తెలిపారు.

భీమవరంలో 19 మంది

భీమవరంలో గురువారం ఎనిమిది మంది అభ్యర్థులు ఎనిమిది సెట్ల నామినేషన్‌ పత్రాలను సమర్పించినట్లు ఆర్వో శ్రీనివాసులరాజు తెలిపారు. ఇప్పటి వరకు మొత్తం 19 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు.. భారత చైతన్య యువజన పార్టీ నుంచి పి.వడ్డీకాసులు, బహుజన సమాజ్‌ పార్టీ నుంచి బుగ్గే రేచర్ల, జాతీయ జనసేన నుంచి కడియం రామాంజనేయులు, స్వతంత్ర అభ్యర్థులుగా ముండవ నాగేశ్వరరావు, ఏడుకొండలు, పెంటపాటి మోహనమనోహర్‌, బహుజనసమాజ్‌ పార్టీ నుంచి దాసరి కరివర్ధన విజయ ప్రకాశరావు నామినేషన్లు దాఖలు చేశారు.

ఆచంటలో 13 మంది

ఆచంటలో గురువారం తొమ్మిది మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆర్‌వో వి.స్వామి నాయుడు తెలిపారు. వీటితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 13 మంది అభ్యర్థులు 26 సెట్ల నామినేషన్‌లు దాఖలైనట్లు చెప్పారు. చివరి రోజు.. కాంగ్రెస్‌ నుంచి నెక్కంటి సతీష్‌, వైసీపీ నుంచి చెరుకువాడ రంగనాధరాజు, జై భీమ్‌రావ్‌ పార్టీ నుంచి కాకి శ్యామ్‌కుమార్‌, జై భారత్‌ పార్టీ నుంచి వెలగల శ్రీనివాసరెడ్డి, స్వతంత్ర అభ్యర్థులుగా సికిలి రత్నరాజు, గోగి గోపాలకృష్ణ, రామోజు పూర్ణచంద్ర, చికిలే కృష్ణబాబు నామినేషన్లు వేశారు.

పాలకొల్లులో 19 మంది

పాలకొల్లులో గురువారం 13 మంది నామినేషన్లు దాఖలు చేసినట్టు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి బి.శివనారాయణ రెడ్డి తెలిపారు. వీటితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 19 మంది నామినేషన్లు సమర్పించారు. చివరిరోజు.. స్వతంత్ర అభ్యర్థులుగా నల్లి రాజేష్‌, పాలపర్తి జాన్సన్‌, జల్ల వాసు, వసంతాల దుర్గ వెంకట సురేష్‌, కన్నేటి చిన్న అబ్బులు, తానేటి ప్రసాద్‌, సలాది శ్రీరామమూర్తి, కొటికలపూడి ప్రదీప్‌, గొల్లమందుల నవీన్‌ కుమార్‌, వైసీపీ నుంచి గుడాల శ్రీహరి గోపాలరావు, గుడాల మంగతాయారు, టీడీపీ నుంచి నిమ్మల రామానాయుడు, నిమ్మల సూర్యకుమారి నామినేషన్లు దాఖలు చేశారు.

నరసాపురంలో 14 మంది

నరసాపురంలో గురువారం ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆర్వో అంబరీష్‌ తెలిపారు. వీటితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 14 మంది అభ్యర్థులు 25 సెట్ల నామినేషన్‌లను దాఖలు చేశారు. చివరిరోజు.. జనసేన నుంచి బొమ్మిడి నాయకర్‌, కాంగ్రెస్‌ నుంచి కానూరి ఉదయ భాస్కర్‌ కృష్ణప్రసాద్‌, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ఆకుల వెంకటస్వామి, స్వతంత్ర అభ్యర్థులుగా లోకం శ్రీనివాసరావు, గాది రవి, జాతీయ జనసేన పార్టీ నుంచి పాలెంపు సత్యలింగనాయకర్‌, నవరంగ్‌ కాంగ్రెస్‌ నుంచి కొల్లి సత్యనాయకర్‌ నామినేషన్లు వేశారు.

తాడేపల్లిగూడెంలో 20 మంది

తాడేపల్లిగూడెంలో గురువారం 15 మంది అభ్యర్థులు నామినేషన్‌లు సమర్పించినట్టు ఆర్వో కె.చెన్నయ్య తెలిపారు. వీటితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 20 మంది అభ్యర్థులు 28 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థిగా కొట్టు సత్యనారాయణ, కొట్టు సాధనికుమారి, స్వతంత్ర అభ్యర్థులుగా నడపన అచ్యుతకుమార్‌, ఉంగరాల పద్మ, దేవతి పద్మావతి, బొలిశెట్టి రాజేష్‌, లంకా ప్రసాద్‌, గెద్దాడ సువర్ణరాజు, కట్ల గంగరాజు, ఎంవీవీఎల్‌ నారాయణ, జై భారత్‌ నేషనల్‌ పార్టీ నుంచి పళ్లావఝ్జుల శ్రీరామకృష్ణశర్మ, కాంగ్రెస్‌ నుంచి మార్నిడి శేఖర్‌, జాతీయ జనసేన పార్టీ నుంచి బూసనబోయిన ఆంజనేయులు, పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా నుంచి మేకా వెంకటేశ్వర రావు, గుంటూరు జిల్లా నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి బొలిశెట్టి శ్రీనివాస్‌ నామినేషన్లు సమర్పించారు.

ఉండిలో 21 మంది

ఉండిలో గురువారం పది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆర్వో ప్రవీణ్‌ ఆదిత్య తెలిపారు. వీటితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 21 మంది అభ్యర్థులు 38 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. చివరి రోజు.. టీడీపీ నుంచి కనుమూరు రఘరామకృష్ణరాజు, కనుమూరు భరత్‌, భారతీయ చైతన్య యువజన పార్టీ నుంచి గుడిగంట వెంకటేశ్వరరావు, నేషనలిస్ట్‌ జనశక్తి పార్టీ నుంచి కడియం సూరిబాబు, నీతి నిజాయితీ పార్టీ నుంచి పెనుమత్స శివరామరాజు, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి వేటుకూరి వెంకట శివరామరాజు, స్వతంత్ర అభ్యర్థులుగా కూనపరాజు వెంకటకృష్ణంరాజు, దండు సతీష్‌రాజు, గుండె నగేష్‌, గాజుల శివ నామినేషన్లు వేశారు.

తణుకులో 16 మంది

తణుకులో గురువారం ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆర్వో బి.వి.రమణ తెలిపారు. వీటితో కలిపి ఇప్పటి వరకు మొత్తం 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. చివరిరోజు జై బీమ్‌ రావ్‌ పార్టీ నుంచి సాకా సురేష్‌, స్వతంత్ర అభ్యర్థులుగా కరుటూరి సుబ్బారావు, చిట్టూరి సత్యనారాయణ, కూసంపూడి రామచంద్రరావు, కాంగ్రెస్‌ నుంచి దిర్శిపో రామకృష్ణ నామినేషన్లు వేశారు.

Updated Date - Apr 25 , 2024 | 11:24 PM