Share News

ఆలోచించి ఓటు వెయ్యండి

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:25 PM

దేశంలో ప్రజా జీవనాన్ని, ప్రజా స్వామ్యాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన మోదీ నిర్వాకాన్ని చూసి వచ్చే ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తతో, ఆలోచించి ఓటు వేయాలని ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌ పిలుపునిచ్చారు.

ఆలోచించి ఓటు వెయ్యండి
రాజకీయ మూలాలు’ సదస్సులో పరకాల

‘సంక్షోభంలో రాజ్యాంగం, ఆర్థిక, రాజకీయ మూలాలు’ సదస్సులో పరకాల

తణుకు, ఏప్రిల్‌ 25 : దేశంలో ప్రజా జీవనాన్ని, ప్రజా స్వామ్యాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన మోదీ నిర్వాకాన్ని చూసి వచ్చే ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తతో, ఆలోచించి ఓటు వేయాలని ప్రముఖ రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌ పిలుపునిచ్చారు. ‘సంక్షోభంలో రాజ్యాంగం, ఆర్థిక, రాజకీయ మూలాలు’ అనే అంశంపై తణుకులో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. ‘దేశంలో నిరుద్యోగం ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో పెరిగింది. విద్యావంతుల్లో నిరుద్యోగిత 83 శాతం ఉంది. 35 వేల రైల్వే ఉద్యోగాల కోసం కోటీ 30 లక్షల మంది దరఖాస్తు చేసు కున్నారు. భారతీయ నిరుద్యోగులు ప్రాణాలకు తెగించి ఇజ్రా యిల్‌, ఉక్రెయిన్‌ దేశాలలో జరుగుతున్న యుద్ధాలలో ఉద్యో గులుగా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. అయినా ప్రభుత్వం ఈ సమస్యను పట్టించుకోవడం లేదు. పెరిగే ధరలు సామా న్యుడి నడ్డి విరుస్తున్నాయి. మూడు నెలల్లో కిరాణా సరుకుల బిల్లు చూస్తే మనకు తెలిసిపోతుంది. పెట్రోలు, డీజిల్‌ గ్యాస్‌ ధరల భారం అందరికీ అనుభవంలో వున్నదే. అన్నదాతలకు నోటితో రెట్టింపు ఆదాయమంటూనే వారి శాంతియుత ఆందో ళనలపై కర్కశంగా వ్యవహరించింది. ప్రజాస్వామ్య విలు వలైన రాజ్యాంగ నిబద్ధత, ప్రశ్నించే పౌరస్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛలకు తిలోదకాలిచ్చారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. అల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ ఉభయ గోదావరి జిల్లాల కార్యదర్శి కామన మునుస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో, దారి దీపం పత్రిక ప్రధాన సంపాదకులు డీవీ వీఎస్‌ వర్మ, సామాజిక న్యాయ పోరాట సమితి వ్యవ స్థాపక అధ్యక్షుడు మురళికుమార్‌ మాట్లాడారు. వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు,ప్రజాసంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:25 PM