Share News

కూటమి ప్రభుత్వానికి ఓటర్లు మద్దతివ్వాలి

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:30 AM

కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ఓటర్లు మద్దతివ్వాలని, గ్రామాల్లో టీడీపీ హయాంలో ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులతో సీసీ రహదారులు వేశామని జనసేన ఉంగుటూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు పిలుపు నిచ్చారు.

కూటమి ప్రభుత్వానికి ఓటర్లు మద్దతివ్వాలి
గొల్లగూడెంలో వృద్ధురాలితో మాట్లాడుతున్న జనసేన అభ్యర్థి పత్సమట్ల. గన్ని

ఉంగుటూరు కూటమి అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు

ఉంగుటూరు,ఏప్రిల్‌ 26 : కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ఓటర్లు మద్దతివ్వాలని, గ్రామాల్లో టీడీపీ హయాంలో ఎస్సీ సబ్‌ ప్లాన్‌ నిధులతో సీసీ రహదారులు వేశామని జనసేన ఉంగుటూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు పిలుపు నిచ్చారు. శుక్రవారం గొల్లగూడెం గ్రామంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనే యులు, బీజేపీ నాయకురాలు శరణాల మాలతీరాణి, కూటమి కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఆయన ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి మహిళలు, వృద్ధుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకుని సూపర్‌ సిక్స్‌ పథకాలను వివరించి ఓట్లను అభ్యర్థించారు. తనతో పాటు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌యాదవ్‌కు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కరపా వెంకటశ్రీనివాసరావు, ఎంపీటీసీ గద్దే మంగేష్‌, స్థానిక నాయకులు మాజీ ఎంపీపీ నెక్కలపూడి వీరవెంకట సత్యనారాయణ, వేములపల్లి సుధీర్‌, దాసరి రాజశేఖర్‌, కడియాల రవిశంకర్‌, ఇమ్మణ్ణి గంగాధరరావు, చింతల శ్రీనివాస్‌, నేకూరి ఆశీర్వాదం, పాతూరి విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. చేబ్రోలు, గోపీనాఽథపట్నం చర్చిల్లో ప్రార్థనలు చేసి పాస్టర్ల ఆశీర్వాదం తీసుకున్నారు. చేబ్రోలు సర్పంచ్‌ రాంధే లక్ష్మీసునీత, మాజీ సర్పంచ్‌ రాంధే రాజారావు, గోపీనాఽథపట్నం టీడీపీ అధ్యక్షుడు బీరా పెద్దిరాజు, ఉంగుటూరు సర్పంచ్‌ బండారు సింధు తదితరులు పాల్గొన్నారు. కైకరం గ్రామంలోని పలు వార్డులలో సర్పంచి సలగాల గోపి, చింతల శ్రీనివాస్‌, యెగ్గిన పెదబాబు తదితరులు ప్రచారం చేశారు.

Updated Date - Apr 27 , 2024 | 12:30 AM